మహీంద్రా ఎక్స్​యూవీ700 ఫేస్‌లిఫ్ట్ : సరికొత్త లుక్​, ఇంకొన్ని రోజుల్లో ప్రొడక్షన్​..!

మహీంద్రా ఎక్స్​యూవీ700 ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ త్వరలోనే అందుబాటులోకి రాబోతోందని తెలుస్తోంది! ఈ మేరకు ఈ వర్షెన్​ ప్రొడక్షన్​ అతి త్వరలోనే ప్రారంభంకానుంది. వివరాల్లోకి వెళితే..

Published on: Nov 23, 2025 5:31 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మహీంద్రా అండ్​ మహీంద్రాకు చెందిన బెస్ట్​ సెల్లింగ్​, 7 సీటర్​ ఫ్యామిలీ ఎస్​యూవీ ఎక్స్​యూవీ700కి త్వరలోనే ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ రాబోతోంది. తాజాగా అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ప్రొడక్షన్​ వచ్చే నెల, అంటే డిసెంబర్ 2025లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 2026లో ఈ మోడల్​ లాంచ్​ అవ్వొచ్చు! కాగా ప్రస్తుత తరం ఎక్స్​యూవీ700 మోడల్ ఉత్పత్తి నవంబర్ 2025 తో నిలిచిపోనుందని తెలుస్తోంది.

మహీంద్రా ఎక్స్​యూవీ700 ఫేస్​లిఫ్ట్​..
మహీంద్రా ఎక్స్​యూవీ700 ఫేస్​లిఫ్ట్​..

మహీంద్రా ఎక్స్​యూవీ700 ఫేస్​లిఫ్ట్​- డిజైన్, ఇంటీరియర్‌లో కీలక మార్పులు!

కొత్త ఎక్స్​యూవీ700 ఫేస్‌లిఫ్ట్‌ ఇప్పటికే భారత దేశ రోడ్లపై టెస్టింగ్​ దశలో కనిపించింది. ఈ ఎస్​యూవీ టెస్ట్​ మోడల్​కి సంబంధించిన స్పై షాట్‌ల ద్వారా కొన్ని ఆసక్తికరమైన వివరాలు వెల్లడయ్యాయి.

ఎక్స్​టీరియర్​: ఈ కొత్త ఎస్​యూవీకి పూర్తిగా కొత్తగా డిజైన్ చేసిన ఫ్రంట్ గ్రిల్, కొత్త ‘ట్విన్-పాడ్ ఎల్​ఈడీ హెడ్‌ల్యాంప్స్’, సరికొత్త సిగ్నేచర్ ఎల్​ఈడీ డీఆర్​ఎల్​లు (డే-టైమ్ రన్నింగ్ లైట్స్) ఉండే అవకాశం ఉంది.

ఇంటీరియర్: ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో మార్పులు చేసిన డోర్ ప్యానెల్స్‌తో పాటు సరికొత్త ఇంటీరియర్ థీమ్ లభించనుంది.

ట్రిపుల్ స్క్రీన్ డాష్‌బోర్డ్: అత్యంత ముఖ్యమైన మార్పు.. డాష్‌బోర్డ్‌లో ఉండబోతోంది! రాబోయే ఎక్స్​ఈవీ 9ఈ ఎలక్ట్రిక్​ కారు తరహాలో, ఈ మహీంద్రా ఎక్స్​యూవీ700 ఫేస్‌లిఫ్ట్‌లో కూడా మూడు-స్క్రీన్ల సెటప్​తో కూడిన సరికొత్త డాష్‌బోర్డ్‌ను మహీంద్రా అందించనుంది.

సౌండ్ సిస్టమ్: అదనంగా, ఈ కొత్త మోడల్‌లో హార్మన్/కార్డన్ ప్రీమియం సౌండ్ సిస్టమ్‌ను కూడా అందించే అవకాశం ఉంది.

ఇంజిన్ విషయంలో పాతవే కొనసాగే అవకాశం!

ఎక్స్​యూవీ700 ఫేస్‌లిఫ్ట్‌లో ప్రస్తుతం ఉన్న శక్తివంతమైన ఇంజిన్లే కొనసాగే అవకాశం ఉంది.

ఇంజిన్ ఎంపికలు: 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్, 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్.

ట్రాన్స్‌మిషన్: ఈ రెండు ఇంజిన్ ఆప్షన్లు 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికతో జత చేయబడతాయి.

‘ఎక్స్​యూవీ 7ఎక్స్ఓ’గా పేరు మార్పు?

మహీంద్రా సంస్థ ఇటీవల ‘XUV 7XO’ పేరును ట్రేడ్‌మార్క్ చేయించుకుంది. మహీంద్రా ఎక్స్​యూవీ700 ఫేస్​లిఫ్ట్​కి ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ అనే పేరు పెట్టే అవకాశం ఉంది.

తమ ఎక్స్​యూవీ300 ఫేస్‌లిఫ్ట్‌ను ‘ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ’గా మార్చినప్పటి నుంచి, నామకరణంలో ఈ తరహా మార్పులు మహీంద్రా అనుసరిస్తున్న ట్రెండ్‌ను ఇది స్పష్టం చేస్తోంది.

ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓకు ప్రధాన మార్పులు చేసినందున కొత్త పేరు సరిగ్గా సరిపోయింది. ఎక్స్​యూవీ700 ఫేస్‌లిఫ్ట్ స్పై షాట్‌లు కూడా ఈ మోడల్‌లో గణనీయమైన మార్పులు ఉంటాయని సూచిస్తున్నాయి. కాబట్టి, మహీంద్రా ఈ ప్రజాదరణ పొందిన 7 సీటర్ ఎస్​యూవీ కొత్త పేరు వచ్చే అవకాశాన్ని కొట్టిపారేయలేం.

ఈ కొత్త మోడల్‌కి సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా వెలువడనప్పటికీ, ఈ వివరాలు కారు ప్రియులలో ఉత్సాహాన్ని పెంచుతున్నాయి.

మహీంద్రా ఎక్స్​యూవీ700 ప్రస్తుత ధర రూ. 13.66లక్షల నుంచి రూ. 23.71లక్షల వరకు ఉంటుంది. ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ ధర ఇంకాస్త ఎక్కువ ఉండొచ్చు. 2026లో లాంచ్​ తర్వాత ఈ మోడల్​ మహీంద్రా స్కార్పియో ఎన్​తో పాటు టాటా సఫారీ, హ్యుందాయ్​ అల్కజార్​, ఎంజీ హెక్టర్​ ప్లస్​ వంటి వాటితో పోటీ పడనుంది.

News/News/మహీంద్రా ఎక్స్​యూవీ700 ఫేస్‌లిఫ్ట్ : సరికొత్త లుక్​, ఇంకొన్ని రోజుల్లో ప్రొడక్షన్​..!
News/News/మహీంద్రా ఎక్స్​యూవీ700 ఫేస్‌లిఫ్ట్ : సరికొత్త లుక్​, ఇంకొన్ని రోజుల్లో ప్రొడక్షన్​..!