మహీంద్రా ఎక్స్​ఈవీ 9ఎస్​ వేరియంట్లు, వాటి ఫీచర్స్​ వివరాలు..

మహీంద్రా ఎక్స్​ఈవీ 9ఎస్​ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీని సంస్థ తాజాగా ఆవిష్కరించింది. దేశంలోనే తొలి 7-సీటర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఇది. ఈ నేపథ్యంలో ఈ ఎక్స్​ఈవీ 9ఎస్​ వేరియంట్లు, వాటి ఫీచర్స్​కి సంబంధించిన వివరాలను ఇక్కడ వివరంగా తెలుసుకోండి..

Published on: Nov 28, 2025, 07:30:12 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారతదేశంలోనే మొట్టమొదటిగా 'INGLO ఆర్కిటెక్చర్' ఆధారంగా రూపొందించిన 7 సీటర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అయిన మహీంద్రా ఎక్స్​ఈవీ 9ఎస్​ని కంపెనీ మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ. 19.95 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. ఇది ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పుతుందని మహీంద్రా పేర్కొంది.

మహీంద్రా ఎక్స్​ఈవీ 9ఎస్
మహీంద్రా ఎక్స్​ఈవీ 9ఎస్

నెలల తరబడి టీజర్‌లతో ఆసక్తి పెంచిన ఈ ఎలక్ట్రిక్​ కారు బుకింగ్స్​ జనవరి 14, 2026న ప్రారంభం కానున్నాయి. డెలివరీలు జనవరి 23, 2026 నుంచి మొదలవుతాయి. ఈ నేపథ్యంలో మహీంద్రా ఎక్స్​యూవీ 9ఎస్ వేరియంట్లు, వాటి ఫీచర్స్​ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

మహీంద్రా ఎక్స్​ఈవీ 9ఎస్: వేరియంట్లు, వాటి ఫీచర్లు..

మహీంద్రా ఎక్స్​ఈవీ 9ఎస్ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ మొత్తం ఆరు వేరియంట్లలో (4 ప్రధాన- 2 సబ్​ వేరియంట్లు) అందుబాటులో ఉంది. వేరియంట్ల వారీగా ఫీచర్ల వివరాలు ఇక్కడ చూడండి:

1. మహీంద్రా ఎక్స్​ఈవీ 9ఎస్​: ప్యాక్ వన్ అబోవ్

బ్యాటరీ ప్యాక్: 59 కేడబ్ల్యూహెచ్​, 79 కేడబ్ల్యూహెచ్​ ఆప్షన్స్​.

సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్: 79 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్‌ను 180 కేడబ్ల్యూ డీసీ ఛార్జర్‌తో కేవలం 20 నిమిషాల్లో 20% నుంచి 80% వరకు ఛార్జ్ చేయవచ్చు! 59 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్‌ను 140 కేడబ్ల్యూ డీసీ ఛార్జర్‌తో 20 నిమిషాల్లో ఛార్జ్ చేయవచ్చు.

పవర్: 79 కేడబ్లూహెచ్​ ప్యాక్‌కు 210 కేడబ్ల్యూ, 59 కేడబ్ల్యూహెచ్​ ప్యాక్‌కు 170 కేడబ్ల్యూ పవర్​ (ఈ విభాగంలో ఉత్తమమైనది).

డ్రైవింగ్: ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్, మల్టిపుల్ డ్రైవింగ్ మోడ్‌లు (బూస్ట్ మోడ్‌తో పాటు), వన్-టచ్ సింగిల్ పెడల్ డ్రైవ్.

సస్పెన్షన్: ఐలింక్​ ఫ్రంట్ సస్పెన్షన్ అండ్​ 5-లింక్ రియర్ సస్పెన్షన్, ఎంటీవీసీఎల్​ టెక్నాలజీ, ఫ్రీక్వెన్సీ డిపెండెంట్ డంపింగ్.

ఇతర ఫీచర్లు: పనోరమిక్ స్కైరూఫ్, క్రూయిజ్ కంట్రోల్, ఇల్యూమినేటెడ్ లోగో, బై-ఎల్​ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్​ఈడీ టెయిల్ ల్యాంప్‌లు.

ఇంటీరియర్: ప్రీమియం ఫాబ్రిక్ అప్‌హోల్‌స్టరీ, స్లైడింగ్ సెకండ్ రో సీట్లు, 2వ వరుస సీట్లలో 60:40 స్ల్పిట్ అండ్​ మల్టీ-స్టెప్ రిక్లైన్.

స్టోరేజ్: విశాలమైన ఫ్రంక్ (ముందు భాగంలో 150 లీటర్లు), ట్రంక్ (వెనుక భాగంలో 527 లీటర్ల వరకు).

టెక్నాలజీ: క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్​ చిప్‌సెట్ - 8155, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్​ యాపిల్ కార్‌ప్లే, 5జీ కనెక్టివిటీ, కనెక్టెడ్ ఫీచర్లు (కేబిన్​ ప్రీకూలింగ్​, షెడ్యూల్డ్​ ఛార్జింగ్​, రిమోట్​ కమాండ్స్​ - Me4U యాప్​ ద్వారా).

సౌండ్: 4 స్పీకర్లు & 2 ట్వీటర్లు, బిల్ట్-ఇన్ అమెజాన్ అలెక్సా.

2. మహీంద్రా ఎక్స్​ఈవీ 9ఎస్​: ప్యాక్ టూ అబోవ్

(ప్యాక్ వన్ అబోవ్‌లో ఉన్న ఫీచర్లతో పాటు అదనంగా)

బ్యాటరీ ప్యాక్: 70 కేడబ్ల్యూహెచ్​.

ఛార్జింగ్: 20 నిమిషాల్లో 20% నుండి 80% వరకు ఛార్జింగ్ (160 కేడబ్ల్యూ డీసీ ఛార్జర్‌తో).

పవర్: 180 కేడబ్ల్యూ.

ఇంటీరియర్ మెరుగుదలలు: సాఫ్ట్ లెథరెట్-ర్యాప్డ్ ఇంటీరియర్ ట్రిమ్స్, లెథరెట్ సీట్ అప్‌హోల్‌స్టరీ, లెథరెట్ స్టీరింగ్ వీల్.

భద్రత & అసిస్టెన్స్: లెవల్​ 2 అడాస్​ (1 రాడార్ & 1 విజన్ కెమెరాతో), 360-డిగ్రీ కెమెరా, బ్లైండ్ వ్యూ మానిటర్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు.

సౌండ్ & టెక్నాలజీ: 16 స్పీకర్ల హర్మాన్/కార్డాన్ ఆడియో సిస్టమ్, డాల్బీ అట్మాస్, ఫ్రంట్ రోలో వైర్‌లెస్ ఛార్జింగ్.

కంఫర్ట్: వెంటిలేటెడ్ 1వ వరుస సీట్లు, 6 వే అడ్జస్టబుల్ పవర్డ్ డ్రైవర్ సీటు, డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్.

3. మహీంద్రా ఎక్స్​ఈవీ 9ఎస్​: ప్యాక్ త్రీ..

(ప్యాక్ టూ అబోవ్‌లో ఉన్న ఫీచర్లతో పాటు అదనంగా)

సస్పెన్షన్: ఇంటెలిజెంట్ అడాప్టివ్ సస్పెన్షన్.

లైటింగ్: ఎల్​ఈడీ డీఆర్​ఎల్​- సెంటర్ సిగ్నేచర్ ల్యాంప్‌తో, సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్లు.

భద్రత (Safety): 7 ఎయిర్‌బ్యాగ్‌లు (6 ఎయిర్‌బ్యాగ్‌లు + డ్రైవర్ మోకాలి ఎయిర్‌బ్యాగ్), లెవల్​ 2+ అడాస్​ (5 రాడార్‌లు & 1 విజన్ కెమెరాతో), బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, ఫ్రంట్ అండ్​ రియర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్.

అసిస్టెన్స్: డ్రైవర్-ఇనిషియేటెడ్ ఆటో లేన్ ఛేంజ్, లేన్ సెంటరింగ్ అండ్​ ఎమర్జెన్సీ స్టీరింగ్ అసిస్ట్.

కంఫర్ట్ అండ్​ లగ్జరీ: అకౌస్టిక్ లామినేటెడ్ డోర్ గ్లాస్, డ్యూయల్ వైర్‌లెస్ ఛార్జింగ్ (ముందు- వెనుక), అడ్వాన్స్‌డ్ ఎయిర్ ఫిల్ట్రేషన్ (ఏక్యూఐ డిస్‌ప్లేతో), వెంటిలేటెడ్ 2వ వరుస సీట్లు.

ప్రత్యేకతలు: ఎలక్ట్రికల్‌గా డిప్లాయ్ అయ్యే ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, పాసివ్ కీ-లెస్ ఎంట్రీ.

4. మహీంద్రా ఎక్స్​ఈవీ 9ఎస్​: ప్యాక్ త్రీ అబోవ్..

(ప్యాక్ త్రీలో ఉన్న ఫీచర్లతో పాటు అదనంగా)

లగ్జరీ లైటింగ్: నైట్ ట్రైల్ - కార్పెట్ ల్యాంప్‌లు.

టెక్నాలజీ అప్‌గ్రేడ్: క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్​ చిప్‌సెట్ (24 GB RAM & 128 GB స్టోరేజ్‌తో).

అసిస్టెన్స్: ఆటోపార్క్ అసిస్ట్, డ్రైవ్ వీడియో రికార్డింగ్, విజన్​ఎక్స్​ ( ఆగ్మెంటెడ్ రియాలిటీ హెడ్స్-అప్ డిస్‌ప్లే).

సెక్యూరిటీ: సెక్యూర్ 360 (లైవ్ వ్యూ & రికార్డింగ్), ఐడెంటిఫై - డామ్స్​ (డ్రైవర్ ఆక్యుపెన్సీ మానిటరింగ్ సిస్టమ్).

స్టీరింగ్ వీల్‌పై క్యాప్‌టచ్ స్విచ్‌లు.

మహీంద్రా ఎక్స్​ఈవీ 9ఎస్​ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ వేరియంట్లు, వాటి ధరలకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More