అమెజాన్​ బ్లాక్​ ఫ్రైడే సేల్​లో ఐఫోన్​ 16పై భారీ ఆఫర్​!

అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్‌లో ఐఫోన్ 16పై భారీ ఆఫర్ లభిస్తోంది. ఈ స్మార్ట్​ఫోన్​ని కేవలం రూ. 66,900కే సొంతం చేసుకోవచ్చు. పూర్తి వివరాల్లోకి వెళితే..

Published on: Nov 28, 2025 5:33 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

చాలా ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో బ్లాక్ ఫ్రైడే డీల్స్ ఇప్పటికే మొదలయ్యాయి. ఈ క్రమంలో, ఆన్‌లైన్ దిగ్గజం అమెజాన్‌లో కూడా ఈ మెగా సేల్​ని ఈ రోజు, అంటే నవంబర్​ 28న ప్రారంభించనుంది. అయితే, సేల్​ కంటే ముందే కొన్ని ఆఫర్‌లు ఇప్పటికే లైవ్‌లోకి వచ్చాయి. ఈ ఆఫర్లలో ఐఫోన్ 16 స్మార్ట్‌ఫోన్ ఊహించని ధరకు అందుబాటులో ఉంది!

అమెజాన్​ బ్లాక్​ ఫ్రైడే సేల్​లో ఐఫోన్​ 16పై భారీ ఆఫర్​! (Bloomberg)
అమెజాన్​ బ్లాక్​ ఫ్రైడే సేల్​లో ఐఫోన్​ 16పై భారీ ఆఫర్​! (Bloomberg)

మీరు గనుక స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్ చేయాలని ప్లాన్ చేస్తుంటే, ఇదే సరైన సమయం. ఎందుకంటే వన్​ప్లస్ 15, ఐఫోన్ 16 వంటి ఎన్నో ఫ్లాగ్‌షిప్ మోడళ్లు భారీ తగ్గింపు ధరలకు లభించనున్నాయి. అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్‌లో ఐఫోన్ 16ను తక్కువ ధరకు ఎలా పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాము.

ఐఫోన్ 16 ధర ఎంత తగ్గింది?

128జీబీ స్టోరేజ్ వేరియంట్ ఉన్న యాపిల్ ఐఫోన్ 16 అసలు ధర అమెజాన్‌లో రూ. 79,900గా ఉంది.

అయితే, ఎర్లీ బ్లాక్ ఫ్రైడే డీల్లో భాగంగా ఈ స్మార్ట్‌ఫోన్ భారీ తగ్గింపుతో రూ. 66,900కే లభిస్తోంది.

దీని ద్వారా ఫ్లాగ్‌షిప్-గ్రేడ్ స్మార్ట్‌ఫోన్‌పై కొనుగోలుదారులు ఏకంగా 16% డిస్కౌంట్ పొందుతున్నారు.

ఈ సేల్ తగ్గింపుతో పాటు కొనుగోలుదారులు బ్యాంక్ ఆఫర్‌లు, ఎక్స్​ఛేంజ్​ ఆఫర్‌ల ద్వారా మరింత తగ్గింపును పొందవచ్చు.

బ్యాంక్ ఆఫర్‌లు:

అమెజాన్ లిస్టింగ్ ప్రకారం.. కొనుగోలుదారులు కనీసం రూ. 41,940 కొనుగోలు విలువపై ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీల ద్వారా ఫ్లాట్ రూ. 4,000 తక్షణ తగ్గింపును పొందవచ్చు. అదేవిధంగా, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లు ఉపయోగించి కూడా ఈ రూ. 4,000 డిస్కౌంట్‌ను పొందవచ్చు.

ఐఫోన్ 16ను ఎందుకు కొనుగోలు చేయాలి?

యాపిల్ ఐఫోన్ 16 అద్భుతమైన ఫీచర్లతో వస్తుంది. ఇది వినియోగదారులకు చాలా సంవత్సరాలు ఉపయోగపడేలా తయారైంది.

డిస్‌ప్లే: ఈ స్మార్ట్‌ఫోన్ 6.1-అంగుళాల ఓఎల్​ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 60హెచ్​జడ్​ రిఫ్రెష్ రేట్​ని అందిస్తుంది.

ప్రాసెసర్ అండ్​ ర్యామ్​: ఇది ఏ18 చిప్ ద్వారా పవర్​ని పొందుతుంది. దీనికి 8జీబీ ర్యామ్​ కనెక్ట్​ చేసి ఉంటుంది. ఈ శక్తివంతమైన కాంబినేషన్ కారణంగానే ఈ స్మార్ట్‌ఫోన్ యాపిల్​ ఇంటెలిజెన్స్​కి సపోర్ట్ చేస్తుంది.

కెమెరా: ఐఫోన్ 16లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 48ఎంపీ మెయిన్ కెమెరా, 12ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి.

సెల్ఫీ కెమెరా: ముందు భాగంలో, 12ఎంపీ సెల్ఫీ షూటర్ ఉంది. ఇది సహజమైన టోన్‌లతో కూడిన స్పష్టమైన చిత్రాలను క్యాప్చర్ చేస్తుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More