Black Friday Sale : ఐఫోన్ 17పై బంపర్ ఆఫర్! రూ. 46 వేలకే సొంతం చేసుకోండి..

ఈ ఏడాది సెప్టెంబర్​లో విడుదలైన ఐఫోన్ 17పై బంపర్ ఆఫర్ లభిస్తోంది! క్రోమా బ్లాక్​ ఫ్రైడే సేల్​లో ఐఫోన్​ 17పై భారీ తగ్గింపు లభిస్తోంది. ఆ వివరాలతో పాటు ఐఫోన్​ 17కి చెందిన కొన్ని కీలక విషయాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Nov 26, 2025, 09:15:14 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఈ ఏడాది సెప్టెంబర్​లో మార్కెట్‌లోకి విడుదలైన ఐఫోన్ 17 పై ఆకర్షణీయమైన ఆఫర్ అందుబాటులోకి వచ్చింది. ఐఫోన్ 16తో పోలిస్తే, ఈ కొత్త మోడల్‌లో అద్భుతమైన అప్‌గ్రేడ్‌లు ఉండటంతో, ఇటీవల కాలంలో వచ్చిన బేస్ ఐఫోన్‌లలో ఇది అత్యుత్తమమైనదిగా పేరు తెచ్చుకుంది. మీరు ఐఫోన్ 17ను కొనుగోలు చేయాలనుకుంటే, క్రోమా బ్లాక్​ ఫ్రైడే సేల్​లో భాగంగా పరిమిత కాలం వరకు రూ. 46,000 లోపే ఈ స్మార్ట్​ఫోన్​ని సొంతం చేసుకోవచ్చు.

ఐఫోన్​ 17పై బంపర్​ డిస్కౌంట్​.. (AP)
ఐఫోన్​ 17పై బంపర్​ డిస్కౌంట్​.. (AP)

క్రోమా బ్లాక్​ ఫ్రైడే సేల్​- ఐఫోన్​ 17పై ఆఫర్స్​..

క్రోమా నిర్వహిస్తున్న బ్లాక్ ఫ్రైడే సేల్‌లో.. రూ. 82,900 ఉన్న ఐఫోన్ 17 పై పలు ఆఫర్లు లభిస్తున్నాయి. మీకు బ్యాంక్ క్యాష్‌బ్యాక్‌గా రూ. 1,000 తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా, మీరు మీ పాత పరికరాన్ని ఎక్ఛేంజ్ చేస్తే అదనంగా రూ. 7,000 ఎక్స్​ఛేంజ్​ బోనస్ పొందవచ్చు.

క్రోమా వెబ్‌సైట్ ప్రకారం మీ పాత పరికరానికి గరిష్టంగా రూ. 29,000 వరకు ఎక్స్​ఛేంజ్​ విలువ లభించే అవకాశం ఉంది. ఎంత వరకు తగ్గింపు లభిస్తుంది అనేది మీరు ఇచ్చే స్మార్ట్​ఫోన్​ పర్ఫార్మెన్స్​పై ఆధారపడి ఉంటుందని గుర్తుపెట్టుకోండి.

కాగా ఈ అన్ని ఆఫర్లను కలుపుకుంటే, ఐఫోన్ 17 ధర ప్రభావవంతంగా రూ. 45,900కు తగ్గిపోతుంది! ఈ ఆఫర్ నవంబర్ 30 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి.

ఐఫోన్ 17 కొనుగోలు చేయడానికి 5 కారణాలు..

1. 120హెచ్​జెడ్​ డిస్‌ప్లే!

ఎన్నో ఏళ్లుగా, మధ్య శ్రేణి స్మార్ట్​ఫోన్‌లలో కూడా 120హెచ్​జెడ్​ ప్యానెల్‌లు ఉన్నప్పటికీ, బేస్ ఐఫోన్ మాత్రం 60హెచ్​జెడ్​ డిస్‌ప్లేకే పరిమితమైందని వినియోగదారులు ఫిర్యాదు చేస్తూ వచ్చారు. ఈ సంవత్సరం, యాపిల్ చివరకు వినియోగదారుల మాట విన్నట్లుంది! ఐఫోన్ 17లో ప్రోమోషన్ డిస్‌ప్లేతో 120హెచ్​జెడ్​ సపోర్ట్ లభిస్తోంది. ఈ అప్‌గ్రేడెడ్ డిస్‌ప్లే వల్ల వినియోగదారు ఎక్స్​పీరియెన్స్​ సరళంగా ఉంటుంది. మీరు పాత ఐఫోన్ నుంచి అప్‌గ్రేడ్ అయితే, ఈ తేడాను వెంటనే అనుభూతి చెందుతారు.

2. అద్భుతమైన పనితీరు

పనితీరు విషయానికి వస్తే, ఐఫోన్‌లు ఎన్నో సంవత్సరాలుగా ఆండ్రాయిడ్ ఫ్లాగ్‌షిప్‌ల కంటే ముందంజలో ఉన్నాయి. ఐఫోన్ 17, ఏ19 చిప్‌సెట్​తో ఈ విషయంలో మరో అడుగు ముందుకేసింది. ప్రో మోడల్స్‌కు ఏ19 ప్రో లభించినప్పటికీ, ఏ19 ప్రాసెసర్ కూడా అత్యంత సామర్థ్యం కలిగి ఉంది. ఈ పరికరం మల్టీటాస్కింగ్, ఎక్కువ సమయం గేమింగ్ సెషన్లను కూడా సులభంగా నిర్వహించగలదు.

3. సెంటర్ స్టేజ్ సెల్ఫీ కెమెరా

ఈ సంవత్సరం, యాపిల్ కొత్త సెంటర్ స్టేజ్ సెల్ఫీ కెమెరాను పరిచయం చేసింది. ఇది మీ పరికరాన్ని తిప్పకుండానే ల్యాండ్‌స్కేప్ మోడ్‌లో గ్రూప్ సెల్ఫీలు తీసుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఐఫోన్ 17, మరింత ఖరీదైన ప్రో మోడల్స్‌లో ఉపయోగించిన అదే 18-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్‌ను వాడుతోంది. కాబట్టి, ఐఫోన్ 17తో మీరు మంచి ఫొటోలను పొందవచ్చు.

4. పటిష్టమైన బ్యాటరీ

యాపిల్ ఐఫోన్‌ల బ్యాటరీ సామర్థ్యాలను అధికారికంగా చెప్పకపోయినా, ఐఫోన్ 17 రోజంతా ఉండే బ్యాటరీ లైఫ్​ని అందిస్తుందని హామీ ఇస్తుంది. సగటు వినియోగంలో ఈ పరికరం దాదాపు 11 గంటల పాటు కొనసాగుతుందని టెక్​ నిపుణులు చెబుతున్నారు. ఇది నిజంగా అద్భుతం!

అంతేకాకుండా, బేస్ ఐఫోన్‌లో చివరికి 40డబ్ల్యూ వైర్డు ఛార్జింగ్ సపోర్ట్ లభించింది. దీని ద్వారా మీ పరికరం కేవలం 20 నిమిషాల్లో 0 నుంచి 50 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. అయితే దీని కోసం మీరు అడాప్టర్‌ను విడిగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More