రూ. 15వేల కన్నా తక్కువ ధరకే Moto G57 Power- 7000ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపీ కెమెరాతో!
మోటో జీ57 పవర్ 5జీ స్మార్ట్‌ఫోన్ ఇండియాలో లాంచ్ అయ్యింది. 7000ఎంఏహెచ్ బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 6ఎస్ జెన్ 4 ప్రాసెసర్ సహా అనేక ఏఐ ఫీచర్స్‌తో బడ్జెట్ సెగ్మెంట్‌లో దుమ్మురేపడానికి సిద్ధంగా ఉంది ఈ స్మార్ట్‌ఫోన్. పూర్తి వివరాల్లోకి వెళితే..
మోటోరోలా సంస్థ నుంచి మరో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ తాజాగా ఇండియాలో అడుగుపెట్టింది. దాని పేరు మోటో జీ57 పవర్. ఇదొక 5జీ గ్యాడ్జెట్. భారీ 7000ఎంఏహెచ్ బ్యాటరీ, 33డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వచ్చిన ఈ ఫోన్, ధరతో పాటు స్పెసిఫికేషన్ల పరంగా మిడ్-రేంజ్ విభాగంలో గట్టి పోటీ ఇవ్వనుంది.

ఈ కొత్త మోటోరోలా హ్యాండ్‌సెట్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 4 చిప్సెట్ని అమర్చారు. ఇది 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్‌తో కనెక్ట్ చేసి ఉంటుంది. ఈ మోటో జీ57 పవర్ స్మార్ట్‌ఫోన్‌లో 6.72 ఇంచ్ ఎల్సీడీ ప్యానెల్ ఉంది. ఇది 391పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 120హెచ్‌జెడ్ టచ్ శాంప్లింగ్ రేట్స గరిష్టంగా 1,050 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో కేవలం ఒకే స్టోరేజ్ వేరియంట్‌లో ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులో ఉంటుంది.
మోటో G57 పవర్ ముఖ్యమైన స్పెసిఫికేషన్లు..
ఆపరేటింగ్ సిస్టమ్- ఆండ్రాయిడ్ 16
డిస్‌ప్లే 6.72-ఇంచ్ ఫుల్-హెచ్డీ+ (1,080x2,400 పిక్సెల్స్) ఎల్సీడీ స్క్రీన్
డిస్‌ప్లే రేట్లు- 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 120హెచ్‌జెడ్ టచ్ శాంప్లింగ్ రేట్
ప్రొటెక్షన్- కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i
ప్రత్యేక డిస్‌ప్లే ఫీచర్- స్మార్ట్ వాటర్ టచ్ 2.0 (తడి చేతులతో కూడా సులువుగా వాడవచ్చు)
ప్రాసెసర్- క్వాల్కమ్ ఆక్టా-కోర్ 4ఎన్ఎం స్నాప్‌డ్రాగన్ 6ఎస్ జెన్ 4 ప్రాసెసర్
రేర్ కెమెరా- 50-మెగాపిక్సెల్ (ఎఫ్/1.8) సోనీ ఎల్వైటీ- 600 మెయిన్ సెన్సార్ + 8-మెగాపిక్సెల్ (ఎఫ్/2.2) అల్ట్రావైడ్ కెమెరా (119.5 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూ)
ఫ్రంట్ కెమెరా- 8ఎంపీ
వీడియో రికార్డింగ్- 2కే రిజల్యూషన్ వీడియోలను 60 ఎఫ్‌పీఎస్ వరకు షూట్ చేయగల సామర్థ్యం
బ్యాటరీ- 7000ఎంఏహెచ్, 33డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
సెక్యూరిటీ- సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్
మోటో జీ57 పవర్- ఏఐ ఆధారిత కెమెరా ఫీచర్లు..
మోటో G57 పవర్ స్మార్ట్‌ఫోన్‌లో షాట్ ఆప్టిమైజేషన్, ఆటో స్మైల్ క్యాప్చర్, మ్యాజిక్ ఎరేజర్, ఫోటో అన్‌బ్లర్ వంటి అత్యాధునిక ఏఐ-ఆధారిత కెమెరా ఫీచర్లు ఉన్నాయి. వీటితో పాటు రీఇమేజిన్ ఆటో ఫ్రేమ్, పోర్ట్రెయిట్ బ్లర్, కలర్ పాప్, సినిమాటిక్ ఫోటోస్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
ఈ స్మార్ట్‌ఫోన్ 5జీ, 4జీ ఎల్టీఈ, బ్లూటూత్ 5.1, డ్యూయల్ బ్యాండ్ వైఫై, యూఎస్బీ టైప్-సీ పోర్ట్‌తో పాటు జీపీఎస్, ఏ-జీపీఎస్, GLONASS, గెలీలియో, QZSS, బైడుయో వంటి నావిగేషన్ ఫీచర్లకు సపోర్ట్ చేస్తుంది. యాక్సెలరోమీటర్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్, యాంబియంట్ లైట్ సెన్సార్, ఇ-కంపాస్ వంటి సెన్సార్‌లు కూడా ఇందులో ఉన్నాయి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


