పవర్ఫుల్ ప్రాసెసర్‌తో iQOO 15- ఇండియాలో ధర ఎంతంటే..
రూ. 60,000 ధరతో ఐక్యూ 15 5జీ లాంచ్‌కు రెడీ అవుతోంది! స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5తో చౌకైన ఫ్లాగ్‌షిప్ ఇదే అవుతుందని అంచనాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించి ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఐక్యూ తమ నూతన ఫ్లాగ్‌షిప్ మొబైల్ iQOO 15 5జీని నవంబర్ 26, 2025న భారతదేశంలో విడుదల చేయనుంది. అత్యుత్తమ పనితీరు (ఫ్లాగ్‌షిప్ పర్ఫార్మెన్స్), మెరుగైన యూజర్ అనుభవాన్ని అందించడానికి ఈ ఫోన్ సిద్ధమైంది. అధికారికంగా లాంచ్ కాకముందే.. ఈ స్మార్ట్‌ఫోన్ ధరకు సంబంధించిన వివరాలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. ఈ నేపథ్యంలో కొనుగోలుదారులు ఎంత చెల్లించాల్సి ఉంటుందనే దానిపై ఒక స్పష్టత లభించింది.

లీక్ అయిన ధరల ప్రకారం.. ఐక్యూ 15 5జీ మొబైల్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్‌తో వస్తున్న అత్యంత చౌకైన ఫ్లాగ్‌షిప్‌గా నిలిచే అవకాశం ఉంది. ఈ కారణంగా, ఇది విడుదల సమయంలో వినియోగదారులను పెద్ద సంఖ్యలో ఆకర్షించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ గ్యాడ్జెట్‌పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
ఐక్యూ 15 5జీ- ధర, ప్రీ-ఆర్డర్ ప్రయోజనాలు..
ధర అంచనా: మీడియా నివేదికల ప్రకారం, ఐక్యూ 15 5జీ స్మార్ట్‌ఫోన్ ధర సుమారుగా రూ. 60,000 వరకు ఉండవచ్చు!
ఈ ధరలో లాంచ్ ఆఫర్‌లు కూడా కలిసి ఉండే అవకాశం ఉంది. కాబట్టి, బేస్ వేరియంట్ అధికారిక ధర సుమారుగా రూ. 65,000 వరకు ఉండొచ్చు అని అంచనా వేస్తున్నారు.
ఈ ధర అంచనాలను ధృవీకరించడానికి మనం నవంబర్ 26 వరకు వేచి చూడాల్సిందే.
ఐక్యూ 15 5జీ- ప్రీ ఆర్డర్, ప్రత్యేక ఆఫర్లు..
ఐక్యూ సంస్థ నవంబర్ 20 నుంచే ఐక్యూ 15 5జీ 15 మొబైల్‌కు సంబంధించిన ప్రీ-ఆర్డర్ (ముందస్తు బుకింగ్) లను ప్రారంభించనుంది.
ప్రీ-బుకింగ్ చేసే కస్టమర్లకు పరిమిత కాలం వరకు ‘ప్రయారిటీ పాస్’ను అందిస్తున్నారు.
ఈ పాస్‌తో ఉచిత ఐక్యూ టీడబ్ల్యూఎస్ 1ఈ ఇయర్‌బడ్స్, 12 నెలల పొడిగించిన వారంటీ వంటి ప్రయోజనాలు లభిస్తాయి.
కొనుగోలుదారులు కేవలం రూ. 1,000 రీఫండబుల్ (తిరిగి చెల్లించే) మొత్తాన్ని చెల్లించి ఐక్యూ 15ని ప్రీ-బుక్ చేసుకోవచ్చు.
ఐక్యూ 15 5జీ: ఊహించిన స్పెసిఫికేషన్లు, ఫీచర్లు..
డిస్‌ప్లే: ఐక్యూ 15 5జీలో 6.85-ఇంచ్ శాంసంగ్ ఎం14 ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉండవచ్చని భావిస్తున్నారు. ఇది 2కే రిజల్యూషన్, 144హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, గరిష్టంగా 6,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ని అందించే అవకాశం ఉంది.
ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్‌తో రావడం ఖాయమైంది. ఇది ఇండియాలో తాజాగా లాంచ్ అయిన వన్‌ప్లస్ 15, త్వరలో రాబోతున్న రియల్‌మీ జీటీ 8 ప్రో, శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా వంటి ఇతర ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లతో గట్టి పోటీ ఇవ్వనుంది.
కెమెరా సిస్టమ్: ఈ ఫోన్ ట్రిపుల్ కెమెరా సిస్టమ్‌తో వస్తుందని ఐక్యూ సంస్థ ధృవీకరించింది.
- 50ఎంపీ సోనీ ఐఎంఎక్స్921 వీసీఎస్ మెయిన్ సెన్సార్
- 50ఎంపీ సోనీ ఐఎంఎక్స్882 పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్
- 50ఎంపీ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా
అత్యంత శక్తివంతమైన చిప్‌సెట్‌ను తక్కువ ధరకే అందించడం ద్వారా, ఐక్యూ 15 5జీ మార్కెట్‌లో తన స్థానాన్ని బలంగా నిలబెట్టుకోవాలని చూస్తోంది.
ఐక్యూ 15 5జీ అధికారిక లాంచ్ రోజు (నవంబర్ 26) ఇంకేమైనా ఆసక్తికరమైన ఆఫర్లు లేదా వివరాలు వెలువడతాయో తెలుసుకోవాలంటే వేచి చూడాల్సిందే.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


