అతి తక్కువ ధరకే 200ఎంపీ కెమెరా, 7000ఎంఏహెచ్ బ్యాటరీ! వివో కొత్త స్మార్ట్‌ఫోన్ ఇది..
200ఎంపీ కెమెరా, 7000ఎంఏహెచ్ బ్యాటరీతో వివో వై500 ప్రో స్మార్ట్‌ఫోన్ చైనాలో లాంచ్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఈ గ్యాడ్జెట్ ధర, పూర్తి స్పెసిఫికేషన్లు వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
చైనా మార్కెట్లో వివో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయ్యింది. దాని పేరు వివో వై500 ప్రో. వివో వై సిరీస్‌లో భాగంగా వచ్చిన ఈ గ్యాడ్జెట్‌కి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

వివో వై500 ప్రో- ధర వివరాలు (చైనా మార్కెట్లో)
వివో వై500 ప్రో స్మార్ట్‌ఫోన్ వివిధ వేరియంట్‌లలో లాంచ్ అయింది. చైనాలో దీని ధరలు, భారతీయ కరెన్సీలో అంచనా ధరలు (సుమారుగా) ఇలా ఉన్నాయి..
8GB + 128GB- 1,799 యువాన్ (రూ. 22,000)
8GB + 256GB- 1,999 యువాన్ (రూ. 25,000)
12GB + 256GB- 2,299 యువాన్ (రూ. 28,000)
12GB + 512GB- 2,599 యువాన్ (రూ. 32,000)
ఈ ఫోన్ ఆస్పిషియస్ క్లౌడ్, లైట్ గ్రీన్, సాఫ్ట్ పౌడర్, టైటానియం బ్లాక్ రంగుల్లో అందుబాటులోకి వచ్చింది.
వివో వై500 ప్రో- స్పెసిఫికేషన్లు..
ప్రాసెసర్- సాఫ్ట్‌వేర్: ఈ డ్యూయల్-సిమ్ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆరిజిన్ఓఎస్ 6పై నడుస్తుంది. ఇది ఆక్టా-కోర్ 4ఎన్ఎం మీడియాటెక్ డైమెన్సిటీ 7400 చిప్‌సెట్‌తో శక్తిని పొందుతుంది. ఇందులో 12జీబీ వరకు ర్యామ్, 512జీబీ వరకు యూఎఫ్ఎస్2.2 స్టోరేజ్ ఉన్నాయి.
ఈ వివో వై500 ప్రో ఫోన్ దుమ్ము, నీటి నిరోధకత కోసం ఐపీ68+ఐపీ69 రేటింగ్ లభిస్తోంది.
డిస్‌ప్లే: వివో వై500 ప్రో 6.67-ఇంచ్ 1.5కే (1,260x2,800 పిక్సెల్స్) ఓఎల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 1,600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 94.10 శాతం స్క్రీన్-టు-బాడీ నిష్పత్తితో వస్తుంది.
కెమెరా:
రేర్ కెమెరా: ఇందులో డ్యూయల్ రేర్ కెమెరా యూనిట్‌ను అందించారు. ప్రధాన కెమెరా ఎఫ్/1.88 అపెర్చర్‌తో కూడిన 200-మెగాపిక్సెల్ శాంసంగ్ హెచ్‌పీ5 సెన్సార్ కాగా, దానికి తోడు ఎఫ్/2.4 అపెర్చర్‌తో 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంది.
ఫ్రెంట్ కెమెరా: సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (ఎఫ్/2.45 అపెర్చర్) ఉంది.
బ్యాటరీ- ఛార్జింగ్: ఈ హ్యాండ్‌సెట్ 7,000ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది, ఇది 90డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
కనెక్టివిటీ ఆప్షన్‌లలో 5G, బ్లూటూత్ 5.4, జీపీఎస్, ఏ-జీపీఎస్, బైడూ, గ్లోనాస్, గెలీలియో, క్యూజెడ్ఎస్ఎస్, ఓటీజీ, వైఫై, నావ్ఐసీ, యూఎస్బీ టైప్ సీ పోర్ట్ ఉన్నాయి. ఇందులో ఇ-కంపాస్, గైరోస్కోప్, గ్రావిటీ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ రిమోట్ కంట్రోల్, ఫోటోసెన్సిటివ్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్ వంటి సెన్సార్‌లు ఉన్నాయి.
బయోమెట్రిక్ అథెంటికేషన్ కోసం ఇందులో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంది. ఇది ఫేషియల్ రికగ్నిషన్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది.
ఈ వివో వై500 ప్రో స్మార్ట్‌ఫోన్ ఇండియా లాంచ్, ధరలపై క్లారిటీ రావాల్సి ఉంది. రానున్న రోజుల్లో సంస్థ నుంచి ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


