ఇండియాలో Oppo Find X9 స్మార్ట్​ఫోన్​ సిరీస్​ లాంచ్​ డేట్​ ఫిక్స్​- ఎప్పుడంటే..

ఇండియాలో Oppo Find X9 స్మార్ట్​ఫోన్​ సిరీస్​ లాంచ్​ డేట్​ ఫిక్స్ అయ్యింది. ఈ సిరీస్​ రెండు స్మార్ట్​ఫోన్స్​తో నవంబర్​ 18న విడుదలకానుంది. ఈ నేపథ్యంలో వీటికి సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Nov 8, 2025, 06:15:11 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారత మార్కెట్‌లోకి ఒప్పో ఫైండ్ X9 సిరీస్ ఇంకొన్ని రోజుల్లో అడుగుపెట్టనుంది! తమ తదుపరి స్మార్ట్‌ఫోన్‌ల లాంచ్‌ తేదీని ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ సిరీస్‌లో ఫైండ్​ ఎక్స్​9, ఫైండ్​ ఎక్స్​9 ప్రో మోడళ్లు ఉండే అవకాశం ఉంది. ఈ రెండు ఫోన్‌లు ఇప్పటికే చైనాలో విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ స్మార్ట్​ఫోన్​ సిరీస్​ ఇండియా లాంచ్​ డేట్​, ఫీచర్స్​ సహా ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

ఒప్పో ఫైండ్​ ఎక్స్​9..
ఒప్పో ఫైండ్​ ఎక్స్​9..

ఒప్పో ఫైండ్ ఎక్స్​9 సిరీస్: భారత లాంచ్ తేదీ..

స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో ఎక్స్​ (పూర్వపు ట్విట్టర్)లో పెట్టిన పోస్ట్ ప్రకారం.. రాబోయే ఒప్పో ఫైండ్ X9 సిరీస్​ను నవంబర్ 18న మధ్యాహ్నం 12 గంటలకు భారత దేశంలో విడుదల చేయనున్నారు. ఈ భారత లాంచ్ కోసం ఒప్పో ఒక ప్రత్యక్ష ఈవెంట్‌ను ఏర్పాటు చేసింది. ఈ ఈవెంట్‌ను తమ సోషల్ మీడియా హ్యాండిల్స్, ఒప్పో ఇండియా వెబ్‌సైట్, సంస్థకు చెందిన యూట్యూబ్ ఛానెల్‌ ద్వారా లైవ్ స్ట్రీమ్ చేయనుంది.

ఫైండ్ ఎక్స్​9 సిరీస్‌తో పాటు కంపెనీ ప్రివిలేజ్ ప్యాక్​ను కూడా ప్రకటించింది! దీని ధర కేవలం రూ. 99. ఈ ప్యాక్‌తో కొనుగోలుదారులకు రూ. 1,000 విలువైన ఎక్స్​ఛేంజ్​ కూపన్, ఉచితంగా సూపర్​వూక్​ 80డబ్ల్యూ పవర్ అడాప్టర్, రెండేళ్ల బ్యాటరీ ప్రొటెక్షన్ ప్లాన్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి.

ఒప్పో ఫైండ్ ఎక్స్​9 సిరీస్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు (అంచనా)..

ఒప్పో ఫైండ్ ఎక్స్​9 స్మార్ట్​ఫోన్​లో 6.59-ఇంచ్​ ఓఎల్​ఈడీ స్క్రీన్ ఉండవచ్చని, అయితే ప్రో వేరియంట్​లో 6.78-ఇంచ్​ ఫ్లాట్ ఓఎల్​ఈడీ డిస్‌ప్లే ఉంటుందని అంచనా. ఈ ఫోన్‌ల స్పెసిఫికేషన్లు చైనాలో విడుదలైన వాటితో సమానంగా ఉంటాయని భావిస్తున్నారు. రెండు డిస్‌ప్లేలు కూడా 1.5కే రిజల్యూషన్ కలిగి, 120హెచ్​జెడ్​ రిఫ్రెష్ రేట్​ను అందిస్తాయని భావిస్తున్నారు.

ఒప్పో ఫైండ్ ఎక్స్​9, ఫైండ్ ఎక్స్​9 ప్రోలకు శక్తినిచ్చేది డైమెన్సిటీ 9500 ఎస్​ఓసీ ప్రాసెసర్​. ఈ ఫోన్‌లు గరిష్టంగా 16జీబీ ర్యామ్, 1టీబీ ఇంటర్నల్ స్టోరేజ్​తో వస్తాయి. గ్రాఫిక్స్-ఇంటెన్సివ్ పనుల కోసం ఆర్మ్​ జీ1-అల్ట్రా జీపీయూని కలిగి ఉంటాయి. ఈ హ్యాండ్‌సెట్‌లు ఆండ్రాయిడ్ 16 ఆధారిత కలర్‌ఓఎస్ 16 తో నడుస్తాయి.

కెమెరాల విషయానికి వస్తే.. ఫైండ్ ఎక్స్​9లో 50-మెగాపిక్సెల్ సోనీ ఎల్​వైటీ-828 ప్రైమరీ కెమెరా, 50-మెగాపిక్సెల్ సోనీ ఎల్​వైటీ-600 పెరిస్కోప్ టెలిఫోటో సెన్సార్, 50-మెగాపిక్సెల్ శాంసంగ్ జేఎన్​ఎస్​ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 32-మెగాపిక్సెల్ ఫ్రంట్-ఫేసింగ్ సెన్సార్ ఉంది. ప్రో మోడల్​లో మాత్రం ప్రధాన, అల్ట్రా-వైడ్ కెమెరాలు అలాగే ఉంచి, 200-మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో షూటర్‌ను 3ఎక్స్​ డిజిటల్ జూమ్ సామర్థ్యంతో అందిస్తుంది. సెల్ఫీ కెమెరా 50-మెగాపిక్సెల్ తో వస్తుంది.

ఒప్పో ఫైండ్ ఎక్స్​9 ప్రో, ఫైండ్ ఎక్స్​9లు వరుసగా 7,500ఎంఏహెచ్​- 7,025ఎంఏహెచ్​ బ్యాటరీలతో వస్తాయి. రెండింటిలోనూ 80డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్​కు సపోర్ట్ ఉంది.

మరి మీరు స్మార్ట్​ఫోన్స్​ కొంటారా?

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More