అతి తక్కువ ధరకే Lava Agni 4- పవర్ఫుల్ ప్రాసెసర్, 50ఎంపీ సెల్ఫీ కెమెరా, బోలెడు ఏఐ ఫీచర్స్..
పవర్ఫుల్ ప్రాసెసర్, అదిరే ఏఐ ఫీచర్స్‌తో కూడిన లావా అగ్ని 4 స్మార్ట్‌ఫోన్ విడుదలైంది. ఈ గ్యాడ్జెట్ ధర కూడా తక్కువే! ఈ నేపథ్యంలో లావా అగ్ని 4 ఫీచర్స్, ధర వంటి వివరాలను ఇక్కడ చూసేయండి..
మచ్ అవైటెడ్ మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ని తాజాగా ఇండియాలో లాంచ్ చేసింది లావా సంస్థ. ఈ గ్యాడ్జెట్ పేరు లావా అగ్ని 4. ఇది గత సంవత్సరం వచ్చిన అగ్ని 3కి సక్సెసర్. ఈ కొత్త హ్యాండ్‌సెట్.. మెరుగైన డిజైన్, పనితీరు, సరికొత్త ఏఐ ఫీచర్లతో అనేక ముఖ్యమైన అప్‌గ్రేడ్‌లను తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఈ మొబైల్ ఫీచర్స్, ధర వంటి వివరాలను ఇక్కడ డీటైల్డ్‌గా తెలుసుకోండి..

లావా అగ్ని 4- ధర, లభ్యత వివరాలు..
లావా అగ్ని 4 కేవలం ఒకే కాన్ఫిగరేషన్‌లో లభిస్తుంది: 8జీబీ ర్యామ్- 256GB ఇంటర్నల్ స్టోరేజ్. దీని ధర రూ. 22,999గా నిర్ణయించారు.
లావా సంస్థ ఈ ప్రారంభ ధరలో ప్రమోషనల్ డెబిట్, క్రెడిట్ కార్డ్ ఆఫర్‌లు కూడా ఉంటాయని తెలిపింది!
ఈ స్మార్ట్‌ఫోన్ నవంబర్ 25వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్‌లో సేల్‌లోకి వస్తుంది.
ఇది ఫాంటమ్ బ్లాక్, లూనార్ మిస్ట్ అనే రెండు రంగుల్లో అందుబాటులో ఉంటుంది.
లావా అగ్ని 4- ఫీచర్స్..
డిజైన్, డిస్‌ప్లే: లావా అగ్ని 4లో 6.67-ఇంచ్ ఫ్లాట్ అమోలెడ్ ప్యానెల్‌ను అమర్చారు.ఇది 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌ని, 2,400 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ని, 446పీపీఐ పిక్సెల్ డెన్సిటీని అందిస్తుంది.
మన్నిక ఫీచర్లు:
- సూపర్ యాంటీ-డ్రాప్ డైమండ్ ఫ్రేమ్
- కార్నింగ్ గొరిల్లా గ్లాస్ రక్షణ
- ఐపీ64 రేటింగ్ (వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కోసం)
అదనంగా, తడిసిన లేదా జిడ్డుగా ఉన్న వేళ్లతో కూడా మెరుగైన టచ్ ప్రతిస్పందన కోసం కొత్త వెట్ టచ్ కంట్రోల్ మోడ్‌ను ఈ ఫోన్‌లో లావా ప్రత్యేకంగా హైలైట్ చేసింది.
పర్ఫార్మెన్స్:
ఈ లావా అగ్ని 4 మీడియాటెక్ డైమెన్సిటీ 8350 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. దీనికి LPDDR5X ర్యామ్, యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్ జత చేయబడ్డాయి.పనితీరు: ఈ ఫోన్ AnTuTu v10లో 1.4 మిలియన్ పాయింట్లకు పైగా స్కోర్ సాధించిందని లావా పేర్కొంది.
కూలింగ్ సిస్టమ్:
గేమింగ్- ఎక్కువ పనిభారం ఉండే టాస్క్‌ల సమయంలో స్థిరమైన పనితీరును కొనసాగించడానికి, అగ్ని 4లో వీసీ లిక్విడ్-కూలింగ్ వ్యవస్థను జోడించారు
కెమెరాలు:
ఈ హ్యాండ్‌సెట్‌లో రెండు రేర్ కెమెరాల సెటప్ ఉంది.
- 50ఎంపీ ప్రధాన సెన్సార్ (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ - OIS తో)
- 8ఎంపీ అల్ట్రా-వైడ్ కెమెరా
ముందు వైపు, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో కూడిన 50ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది. ముందు, వెనుక కెమెరాలు రెండూ గరిష్టంగా 4కే రిజల్యూషన్‌లో 60ఎఫ్‌పీఎస్ వద్ద వీడియో రికార్డింగ్‌కు మద్దతు ఇస్తాయి.
కొత్త ఏఐ ఫీచర్లు:
లావా తన సరికొత్త వాయు AI ప్లాట్‌ఫాంను అగ్ని 4లో ప్రవేశపెట్టింది. ఇది సంభాషణ ఆధారిత సిస్టమ్ కంట్రోల్స్, అనేక AI ఏజెంట్లను అందిస్తుంది. వీటిలో ఇవి ఉన్నాయి:
- ఏఐ మ్యాథ్ టీచర్
- ఏఐ ఇంగ్లీష్ టీచర్
- ఏఐ ఫోటో ఎడిటింగ్, ఇమేజ్ జనరేషన్ అసిస్టెంట్లు
- ఏఐ కాల్ సమ్మరీ
అదనంగా, గూగుల్ 'సర్కిల్ టు సెర్చ్' ఫీచర్‌కు కూడా మద్దతు ఉంది. వాయిస్, విజన్ ఆధారిత ఇంటెలిజెన్స్ ఫీచర్లు కూడా ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఉన్నాయి.
బ్యాటరీ, అదనపు ఫీచర్లు
బ్యాటరీ, ఛార్జింగ్: అగ్ని 4లో 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 66డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం ఉంది. కేవలం 19 నిమిషాల్లో 50% ఛార్జింగ్ చేయగలదని లావా పేర్కొంది.
భద్రత, సౌకర్యం: ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్, యాంటీ-థెఫ్ట్ అలర్ట్, యాంటీ-పీపింగ్ మోడ్ వంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి.
కనెక్టివిటీ: ఇది 5జీ, వైఫై 6ఈ, బ్లూటూత్ 5.4, యూఎస్బీ 3.2 టైప్-సీ, 4జీ ఎల్టీఈ, ఐఆర్ బ్లాస్టర్ వంటి కనెక్టివిటీ ఆప్షన్‌లను కలిగి ఉంది. అలాగే, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, మైక్రోఫోన్ కూడా ఉన్నాయి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


