ఫీచర్లు, భద్రతకు కొదవే లేదు- టాటా సియెర్రా వాల్యూ ఫర్​ మనీ వేరియంట్​ వివరాలు..

టాటా సియెర్రా డెలివరీలు ఇంకొన్ని రోజుల్లో ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో మీరు ఒకవేళ ఈ ఎస్​యూవీని కొనాలని ప్లాన్​ చేస్తుంటే.. టాటా సియెర్రా వాల్యూ ఫర్​ మనీ వేరియంట్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Jan 12, 2026, 13:58:43 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

1990 దశకం నాటి బెస్ట్​ సెల్లింగ్​ మోడల్​ టాటా సియెర్రాను రివైవ్​ చేసి, టాటా మోటార్స్​ ఇటీవలే లాంచ్​ చేసిన విషయం తెలిసిందే. ఇక జనవరి 15 నుంచి ఈ ఎస్​యూవీ డెలివరీలు మొదలవుతాయి. మరి మీరు కూడా టాటా సియెర్రా కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే. టాటా సియెర్రా వాల్యూ ఫర్​ మనీ వేరియంట్​ గురించి ఇక్కడ వివరంగా తెలుసుకోండి..

టాటా సియెర్రా..
టాటా సియెర్రా..

టాటా సియెర్రా ప్యూర్ వేరియంట్​- ఇదే వాల్యూ ఫర్​ మనీ..

టాటా సియెర్రా ప్యూర్ వేరియంట్ చూడటానికి ఎంతో బలంగా, గంభీరంగా కనిపిస్తుంది. పైన అమర్చిన సన్నని ఎల్ఈడీ డీఆర్ఎల్స్, ముందు వైపు ఒక చివరి నుంచి మరో చివరి వరకు సాగిపోయే ఎల్ఈడీ లైట్ బార్, పవర్‌ఫుల్ బై-ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్ దీనికి ప్రీమియం లుక్‌ను ఇచ్చాయి. అయితే, బేస్ వేరియంట్​కి నెక్ట్స్​ ట్రిమ్​ కావడంతో ఇందులో ఫాగ్ ల్యాంప్స్, అడాస్ కోసం వాడే ఫ్రంట్ రాడార్, పార్కింగ్ సెన్సార్లు వంటివి ఉండవు.

టాటా సియెర్రా ప్యూర్​ వేరియంట్​- ఇంటీరియర్, హైటెక్ ఫీచర్లు..

టాటా సియెర్రా ప్యూర్​ వేరియంట్​ లోపల అడుగుపెడితే, టెక్నాలజీ పరంగా టాటా మోటార్స్ ఎక్కడా తగ్గలేదని అర్థమవుతుంది:

టచ్‌స్క్రీన్: 10.25 ఇంచ్​ భారీ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే సదుపాయం ఉంది.

ఆడియో: ఎనిమిది స్పీకర్లతో కూడిన సౌండ్ సిస్టమ్ ప్రయాణాన్ని ఆహ్లాదకరంగా మారుస్తుంది.

వాయిస్ అసిస్ట్: ఆరు భాషల్లో 250కి పైగా వాయిస్ కమాండ్లను ఇది అర్థం చేసుకుంటుంది.

డిజిటల్ కాక్‌పిట్: డ్రైవర్ కోసం పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను అందించారు.

కన్వీనియన్స్: ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఆటో-హోల్డ్ ఫంక్షన్, టైప్-సీ ఫాస్ట్ ఛార్జింగ్ పోర్టులు ఉన్నాయి.

  • టాటా సియెర్రా కొంటున్నారా? హైదరాబాద్​లో ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలను తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

టాటా సియెర్రా ప్యూర్​ వేరియంట్​- ఇంజిన్, పనితీరు..

సియెర్రా ఎస్​యూవీ ప్యూర్ వేరియంట్‌లో కస్టమర్లు తమ అవసరానికి తగ్గట్టుగా రెండు ఇంజిన్ ఆప్షన్లను ఎంచుకోవచ్చు. అవి..

పెట్రోల్: 1.5 లీటర్ ఇంజిన్ 106 పీఎస్ పవర్, 145 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.

డీజిల్: 1.5 లీటర్ ఇంజిన్ 118 పీఎస్ పవర్ ఇస్తుంది. మాన్యువల్ వేరియంట్​లో 260 ఎన్ఎమ్, ఆటోమేటిక్ వేరియంట్​లో 280 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తూ రోడ్లపై దూసుకుపోతుంది.

టాటా సియెర్రా ప్యూర్​ వేరియంట్​- భద్రతలో రాజీ లేదు..

టాటా అంటేనే భద్రతకు మారుపేరు. ఇక ఈ టాటా సియెర్రా వాల్యూ ఫర్​ మనీ వేరియంట్‌లో కూడా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, నాలుగు చక్రాలకు డిస్క్ బ్రేక్‌లు, రియర్ పార్కింగ్ కెమెరా, హిల్ డిసెంట్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (టీపీఎంఎస్​) వంటి ఫీచర్లను స్టాండర్డ్​గా ఇచ్చారు.

ఈ టాటా సియెర్రా ప్యూర్​ వేరియంట్​ ఎక్స్​ షోరూం ధర రూ. 12.99లక్షలుగా ఉంది.

మొత్తానికి, పాత జ్ఞాపకాలను ఆధునిక హంగులతో మేళవించిన టాటా సియెర్రా, తన అద్భుతమైన డిజైన్​, ఫీచర్స్​తో మధ్యతరగతి, ప్రీమియం వినియోగదారులను కచ్చితంగా ఆకట్టుకుంటుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More