రూ. 11.49లక్షల టాటా సియెర్రా బేస్ వేరియంట్లోనే అదిరే ఫీచర్స్.. సేఫ్టీ కూడా!
రూ. 11.49లక్షల టాటా సియెర్రా బేస్ వేరియంట్‌లో అదిరే ఫీచర్స్‌ని అందిస్తోంది టాటా మోటార్స్ సంస్థ. సేఫ్టీకి కూడా ప్రాధాన్యతనిస్తూ అనేక భద్రతా ఫీచర్లను జోడించింది. మీరు టాటా సియెర్రా కొనాలని ప్లాన్ చేస్తుంటే, ఈ ఎస్యూవీ బేస్ వేరియంట్ ఫీచర్స్‌ని ఇక్కడ తెలుసుకోండి..
టాటా మోటార్స్ గత నెలలో లాంచ్ చేసిన టాటా సియెర్రా ఎస్యూవీ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఈ ఎస్‌యూవీని కొనాలని చాలా మంది ప్లాన్ చేస్తున్నారు. ఈ కారు చాలా హైలైట్స్‌తో వస్తోంది. మరీ ముఖ్యంగా బేస్ వేరియంట్ గురించి చెప్పుకోవాలి! పేరుకే బేస్ వేరియంట్, కానీ ఇందులో అదిరే ఫీచర్స్ ఉన్నాయి. సేఫ్టీ విషయంలోనూ టాటా మోటార్స్ రాజీపడలేదు. ఈ నేపథ్యంలో టాటా సియెర్రా బేస్ వేరియంట్ ధర, అది అందించే ఫీచర్స్ వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

టాటా సియెర్రా బేస్ వేరియంట్..
టాటా సియెర్రా బేస్ వేరియంట్‌ను స్మార్ట్+ అని పిలుస్తారు. ఇందులో అనేక అధునాతన ఫీచర్లను స్టాండర్డ్‌గా అందిస్తున్నారు. అవి..
బై-ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్
టర్న్ ఇండికేటర్‌లతో కూడిన ఎలక్ట్రికల్‌గా అడ్జస్టబుల్ ఓఆర్‌వీఎంలు
ఎలక్ట్రిక్ టెయిల్‌గేట్ రిలీజ్
10.16 సెం.మీ డిజిటల్ కాక్‌పిట్
ఎల్‌ఈడీ టర్న్ ఇండికేటర్లు
ఆటో హోల్డ్‌తో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్
స్టోరేజ్‌తో కూడిన ఫ్రంట్ స్లైడింగ్ ఆర్మ్‌రెస్ట్
ఫాలో మీ హోమ్ హెడ్‌ల్యాంప్
లైట్ సేబర్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్స్, టెయిల్ ల్యాంప్
సెంట్రల్ లాకింగ్
రేర్ విండో సన్‌షేడ్
అన్ని పవర్ విండోస్
ప్రకాశవంతమైన లోగోతో టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్ వీల్
రేర్ ఏసీ వెంట్స్
టైప్ ఏ + టైప్ సీ 45డబ్ల్యూ యూఎస్‌బీ పోర్టులు
వెల్‌కమ్ లైట్స్‌తో ఫ్లష్ డోర్ హ్యాండిల్స్
టాటా సియెర్రా 'స్మార్ట్+' బేస్ వేరియంట్‌లో భద్రతా ఫీచర్లు..
టాటా కార్లకు భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందనే విషయం తెలిసిందే. బేస్ వేరియంట్‌లో కూడా సియెర్రా ఎస్యూవీ అనేక భద్రతా ఫీచర్లతో వస్తుంది. వాటి జాబితా ఇది:
6 ఎయిర్‌బ్యాగ్‌లు (డ్రైవర్, కో-డ్రైవర్, కర్టెన్, సైడ్ ఎయిర్‌బ్యాగ్‌లు)
ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ఈఎస్పీ) - 20 ఫీచర్లతో
ఆర్‌ఓఎం - రోల్‌ఓవర్ మిటిగేషన్
వీడీసీ - వెహికల్ డైనమిక్ కంట్రోల్
సీఎస్‌సీ - కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్
డీటీవీ - డైనమిక్ టార్క్ వెక్టరింగ్
ఈపీబీ - ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్
ఏవీహెచ్ - ఆటోమేటిక్ వెహికల్ హోల్డ్
హెచ్‌ఏసీ - హిల్ ఎసెండ్ కంట్రోల్
హెచ్‌బీఏ - హైడ్రాలిక్ బ్రేక్ అసిస్ట్
బీఎఫ్‌సీ / హెచ్‌ఎఫ్‌సీ - బ్రేక్ / హైడ్రాలిక్ ఫేడ్ కాంపెన్సేషన్
ఈబీపీ - ఎలక్ట్రానిక్ బ్రేక్ ప్రీ ఫిల్
బీడీడబ్ల్యూ - బ్రేక్ డిస్క్ వైపింగ్
ఈడీటీసీ - ఇంజిన్ డ్రాగ్ టార్క్ కంట్రోల్
టీసీఎస్ - ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్
ఈబీడీ - ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్
ఏబీఎస్ - యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్
సీడీడీ - కంట్రోల్ డైనమిక్ డిసెలరేషన్
పీబీఏ - పానిక్ బ్రేక్ అలర్ట్
డీబీఎస్ - డైనమిక్ బ్రేకింగ్ సపోర్ట్
ఏఐబీ - ఆఫ్టర్ ఇంపాక్ట్ బ్రేకింగ్
డీఎస్‌టీ - డైనమిక్ స్టీరింగ్ టార్క్
చైల్డ్ సీట్‌ల కోసం ఐఎస్‌ఓఎఫ్‌ఐఎక్స్ మౌంట్‌లు
రేర్ పార్కింగ్ సెన్సార్‌లు
పరిమెట్రిక్ అలారం సిస్టమ్
అన్ని చక్రాలకు డిస్క్ బ్రేక్‌లు
టాటా సియెర్రా 'స్మార్ట్+' ఇంజిన్ ఆప్షన్స్, ధర..
టాటా మోటార్స్ సియెర్రా బేస్ వేరియంట్‌ను కేవలం మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే అందిస్తోంది. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ బేస్ వేరియంట్‌లో అందుబాటులో లేదు.
1.5-లీటర్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజిన్: ఈ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ 6,000 ఆర్‌పీఎం వద్ద 106 పీఎస్ పవర్‌ని, 2,100 ఆర్‌పీఎం వద్ద 145 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది చేస్తుంది.
పెట్రోల్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర: రూ. 11.49 లక్షల నుంచ ప్రారంభం అవుతుంది.
1.5-లీటర్ క్రయోజైట్ డీజిల్ ఇంజిన్: ఈ డీజిల్ ఇంజిన్ 4,000 ఆర్‌పీఎం వద్ద 118 పీఎస్ పవర్‌ని, 1500-2750 ఆర్‌పీఎం మధ్య 260 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ఎక్స్‌షోరూం ధర రూ. 12.99 లక్షలు.

E-Paper












