29.9 కేఎంపీఎల్ మైలేజీతో రికార్డులు సృష్టించిన టాటా సియెర్రా.. స్పీడ్‌లో కూడా తోపు!
ఇటీవలి కాలంలో వార్తల్లో నిలుస్తున్న టాటా సియెర్రా ఎస్‌యూవీ సరికొత్త రికార్డును సృష్టించింది! టెస్ట్ డ్రైవ్‌లో 29.9 కేఎంపీఎల్ మైలేజీని సాధించి “ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్”లో చోటు దక్కించుకుంది! అంతేకాదు 222 కేఎంపీహెచ్ టాప్ స్పీడ్ సైతం నమోదు చేసింది! ఈ టెస్ట్ డ్రైవ్‌కి సంబంధించిన వివరాలు..
టాటా మోటార్స్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న టాటా సియెర్రా ఎస్‌యూవీ తాజాగా “ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్”లో చోటు దక్కించుకుంది! ఇండోర్‌లోని నేషనల్ ఆటోమోటివ్ టెస్ట్ ట్రాక్స్ పరీక్షా కేంద్రంలో నిర్వహించిన 12 గంటల టెస్ట్ రన్‌లో ఈ ఎస్‌యూవీ 29.9 కేఎంపీఎల్ మైలేజీని నమోదు చేసింది.

నవంబర్ 30, 2025న నిర్వహించిన ఈ ట్రయల్‌ను పిక్సెల్ మోషన్ బృందం చేపట్టింది. ఈ పరీక్షలో డ్రైవర్లను మార్చడానికి మాత్రమే స్వల్ప విరామాలు తీసుకున్నారు. మిగతా సమయమంతా వాహనాన్ని నిరంతరంగా నడిపారు.
డాక్యుమెంటేషన్ ప్రకారం, ఈ బృందం ఉదయం 7:00 గంటల నుంచి సాయంత్రం 7:00 గంటల వరకు సియెర్రాను నిరంతరంగా నడిపింది. తద్వారా, నిర్దిష్ట సమయ పరిమితిలో గరిష్ఠ మైలేజీ సాధించిన మునుపటి జాతీయ ప్రమాణాన్ని ఈ టాటా సియెర్రా అధిగమించింది.
కొత్త 'హైపెరియన్' పెట్రోల్ ఇంజిన్ ప్రత్యేకతలు..
ఈ టెస్ట్ రన్ టాటాకు చెందిన సరికొత్త 1.5-లీటర్ హైపెరియన్ పెట్రోల్ ఇంజిన్ ఫస్ట్ రియల్-వరల్డ్ ప్రదర్శనగా నిలిచింది. ఇంజనీర్ల అభిప్రాయం ప్రకారం, ఈ ఇంజిన్‌ను ఎస్‌యూవీ సామర్థ్యాన్ని తగ్గించకుండా, మెరుగైన మైలేజీని అందించేలా రూపొందించారు.
ఈ సుదీర్ఘ పరీక్ష సమయంలో, ఇంజిన్ టార్క్-రిచ్ మిడ్-రేంజ్, అప్‌డేట్ చేసిన కంబషన్ సెటప్ స్థిరమైన ఇంధన సరఫరాను నిర్వహించడానికి సహాయపడ్డాయి.
ఇంజిన్‌లో ఇంటర్నల్ ఫిక్షన్ తగ్గడం కూడా మైలేజీకి దోహదపడింది. దీనివల్ల సియెర్రా ట్రాక్‌పై స్థిరంగా దూసుకెళ్లగలిగింది.
టాటా సియెర్రా- మైలేజీ టెస్ట్‌తో పాటు అత్యధిక వేగం..
మైలేజీ టెస్ట్‌తో పాటు ఇండోర్‌లోని నేషనల్ ఆటోమోటివ్ టెస్ట్ ట్రాక్స్ పరీక్షా కేంద్రం ట్రాక్‌లోనే విడిగా నిర్వహించిన ఒక పరీక్షలో సియెర్రా ఎస్‌యూవీ 222 కేఎంపీహెచ్ అత్యధిక వేగాన్ని కూడా అందుకుంది. కొత్త పవర్‌ట్రైన్ గరిష్ఠ సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఈ సమాంతర పరీక్షను నిర్వహించారు.
అయితే, వినియోగదారులకు అందించే వాహనాలు ఈ వేగంతో ప్రయాణించలేవని టాటా మోటార్స్ స్పష్టం చేసింది. భద్రతా ప్రమాణాల్లో భాగంగా, తయారీ మోడళ్లలో వేగం 190 కేఎంపీహెచ్ వద్ద ఎలక్ట్రానిక్‌గా పరిమితం చేయడం జరిగింది.
- టాటా సియెర్రా వేరియంట్లు- వాటి ధరల వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
టాటా మోటార్స్ విజ్ఞప్తి: రోడ్లపై ఇలా ప్రయత్నించవద్దు!
ఈ రికార్డు టాటా సియెర్రాపై ఉత్సాహాన్ని పెంచినప్పటికీ, ఈ రెండు పరీక్షలను శిక్షణ పొందిన నిపుణులు మాత్రమే, నియంత్రిత వాతావరణంలో నిర్వహించారని టాటా మోటార్స్ ఉద్ఘాటించింది. ఓనర్లను ఉద్దేశిస్తూ, ఇలాంటి ప్రయత్నాలను పబ్లిక్ రోడ్లపై చేయవద్దని, వేగ, సాధారణ ట్రాఫిక్ నియమాలను పాటించాలని విజ్ఞప్తి చేసింది.
ఈ ఘనత సాధించడంపై టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ మోహన్ సావర్కర్ మాట్లాడుతూ, "సియెర్రా ప్రయాణం ప్రారంభంలోనే జాతీయ మైలేజీ రికార్డును నెలకొల్పడం మాకు గర్వకారణం. పెట్రోల్ పవర్‌ట్రైన్‌ల సామర్థ్యాన్ని పెంచడానికి హైపెరియన్ ఇంజిన్ ప్లాట్‌ఫామ్‌ను నిర్మించాం, ఈ మైలురాయి ఆ ప్రయత్నాన్ని ధృవీకరిస్తుంది. ఇది కస్టమర్‌ల కోసం సియెర్రా వాల్యూ ప్రతిపాదనను బలోపేతం చేస్తుంది. అధునాతన, సమర్థవంతమైన, భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే సాంకేతికతలను మార్కెట్‌కు తీసుకురావాలన్న టాటా మోటార్స్ నిబద్ధతను ఇది చాటుతుంది," అని తెలిపారు.

E-Paper












