టయోటా ఫార్చ్యునర్​కి పోటీగా MG Majestor ఎస్​యూవీ- ఫీచర్లు, స్పెసిఫికేషన్స్​ ఇవి..!

జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ కొత్త ఎస్‌యూవీ 'మెజెస్టర్​ని ఇండియాలో లాంచ్​ కోసం రెడీ చేస్తోంది. భారత రోడ్లపై ఈ మోడల్​ టెస్ట్​ డ్రైవ్​ కొనసాగుతోంది. టయోటా ఫార్చ్యూనర్‌కు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది! ఈ నేపథ్యంలో ఈ ఎస్​యూవీపై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Dec 09, 2025 10:00 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా కొంతకాలంగా భారత రోడ్లపై ఒక కొత్త ఎస్‌యూవీని టెస్ట్ చేస్తోంది. దీని పేరు మెజెస్టర్​. 2025లో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఆటో ఎక్స్‌పోలో సంస్థ దీనిని తొలిసారి ప్రదర్శించింది. వాస్తవానికి ఈ ఎస్‌యూవీ, ఈ సంవత్సరం ప్రారంభంలోనే విడుదల కావాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు ఖచ్చితమైన లాంచ్​ టైమ్​లైన్​ని కంపెనీ ఇంకా ప్రకటించలేదు. అయితే, ఇప్పుడు ఈ బ్రాండ్ మెజెస్టర్​ని ఎటువంటి కవరింగ్ లేకుండా రోడ్లపై టెస్టింగ్ చేస్తోంది. లాంచ్ అయిన తర్వాత, మెజెస్టర్​ ఎంజీ పోర్ట్‌ఫోలియోలో ఇప్పటికే ఉన్న గ్లోస్టర్ కంటే ప్రీమియం స్థానాన్ని టార్గెట్​ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ మోడల్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఎంజీ మెజెస్టర్​ ఎస్​యూవీ..
ఎంజీ మెజెస్టర్​ ఎస్​యూవీ..

ఎంజీ మెజెస్టర్​ ఎస్​యూవీ- డిజైన్..

ఎంజీ మెజెస్టర్​ ఎస్​యూవీని​ అంతర్జాతీయ మార్కెట్లలో లభ్యమయ్యే మాక్సస్ డీ90 ఆధారంగా రూపొందించారు. ఇది గ్లోస్సీ బ్లాక్ ఫినిషింగ్‌తో కూడిన పెద్ద ఫ్రంట్ గ్రిల్‌ను కలిగి ఉంది. వాహనం స్ల్పిట్-హెడ్‌ల్యాంప్ కాన్ఫిగరేషన్‌ను కలిగి ఉంటుంది. ఎల్​ఈడీ డే-టైమ్ రన్నింగ్ ల్యాంప్ పైన ఉండగా, ప్రధాన హెడ్‌ల్యాంప్ క్లస్టర్ బంపర్‌లో నిలువుగా అమర్చారు.

సైడ్స్‌లో, ఇది డైమండ్-కట్ ఫినిషింగ్‌తో కూడిన 19-ఇంచ్​ అల్లాయ్ వీల్స్‌తో వస్తుంది.

ఇతర ముఖ్యమైన డిజైన్ ఎలిమెంట్స్​లో డ్యూయల్ ఎగ్జాస్ట్ టిప్స్, చుట్టూ కవర్​ చేసిన డిజైన్‌తో అనుసంధానించిన టెయిల్ ల్యాంప్స్, ధృడమైన స్కిడ్ ప్లేట్లు ఉన్నాయి.

ఎంజీ మెజెస్టర్​ ఎస్​యూవీ- ఫీచర్లు..

ఏ ఇతర జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ వాహనం లాగానే, మెజెస్టర్​ కూడా అనేక అధునాతన ఫీచర్లతో నిండి ఉంటుంది.

ఇందులో ఫ్రీ-స్టాండింగ్ 12.3-ఇంచ్​ ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్, డ్రైవర్ కోసం కొత్తగా రూపొందించిన ఆల్-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటాయి. ఇది అవసరమైన సమాచారాన్ని ప్రదర్శిస్తుంది, అలాగే కస్టమైజేషన్​ ఆప్షన్స్​ని అందిస్తుంది.

క్యాబిన్ ఇంటీరియర్ పూర్తిగా నలుపు థీమ్‌లో రూపొందించారు. ఇందులో వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, ఎలక్ట్రిక్ టెయిల్‌గేట్, హై-క్వాలిటీ సౌండ్ సిస్టమ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (టీపీఎంఎస్​), 360-డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఆటో హోల్డ్ ఫంక్షనాలిటీ, లెవెల్ 2 అడాస్​ (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) వంటి ఫీచర్లు ఉన్నాయి.

లాంచ్​ అనంతరం ఈ ఎంజీ మజెస్సోర్ మార్కెట్‌లో టయోటా ఫార్చ్యూనర్ లెజెండర్, స్కోడా కొడియాక్, వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆర్ లైన్‌లకు పోటీ ఇవ్వనుంది.

ఎంజీ మెజెస్టర్​ ఎస్​యూవీ- స్పెసిఫికేషన్లు..

ప్రస్తుతానికి, ఎంజీ మెజెస్టర్​ స్పెసిఫికేషన్లను కంపెనీ వెల్లడించలేదు. అయితే, ఇది గ్లోస్టర్ మాదిరిగానే ఇంజిన్‌ను ఉపయోగించే అవకాశం ఉంది!

2.0-లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజిన్‌తో ఇది రావచ్చు. ఇది 58.7 బీహెచ్​పీ పవర్​ని, 373.5 ఎన్​ఎం పీక్​ టార్క్‌ను జనరేట్​ చేస్తుంది. అదనంగా, ట్విన్-టర్బో డీజిల్ ఇంజిన్ కూడా అందుబాటులో ఉండవచ్చు. ఇది 212.5 బీహెచ్​పీ పవర్​ని, 478.5 ఎన్​ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ట్రాన్స్‌మిషన్ కోసం 8-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్​ ఉండొచ్చు.

ఈ మోడల్​ ఫీచర్స్​, లాంచ్​, ధర వంటి వాటిపై రానున్న రోజుల్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More