Tata Sierra ఎస్​యూవీ వేరియంట్లు- వాటి ధరల వివరాలు..

టాటా మోటార్స్​ సంస్థ టాటా సియెర్రా ఎస్​యూవీ వేరియంట్ల వారీగా ధరలను తాజాగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో టాటా సియెర్రా వేరియంట్లు, వాటి ధరల వివరాలను ఇక్కడ తెలుసుకోండి. మీరు ఈ ఎస్​యూవీ కొనాలని ప్లాన్​ చేస్తుంటే ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుంది.

Published on: Dec 07, 2025 6:45 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

2025 టాటా సియెర్రాకు సంబంధించి బిగ్​ అప్డేట్​! గత నెలలో ఈ ఎస్​యూవీని ఇండియాలో లాంచ్​ చేసిన టాటా మోటార్స్​, తాజాగా ఇందులోని వేరియంట్ల ధరలను ప్రకటించింది. ఈ నేపథ్యంలో టాటా సియెర్రా ధరల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

టాటా సియెర్రా ఎస్​యూవీ ధరల వివరాలు..
టాటా సియెర్రా ఎస్​యూవీ ధరల వివరాలు..

2025 టాటా సియెర్రా- వేరియంట్లు, వాటి ధరలు..

ఈ కొత్త సియెర్రాను మొత్తం మూడు పవర్‌ట్రైన్ ఆప్షన్లలో, ఐదు వేరియంట్లలో అందిస్తున్నారు. వాటి ఎక్స్​షోరూం ధరలు..

పెట్రోల్​ వేరియంట్లు-

సియెర్రా 1.5 రెవోట్రాన్ స్మార్ట్+ (ఎంటీ) - రూ. 11.49 లక్షలు

1.5 రెవోట్రాన్ ప్యూర్ (ఎంటీ) - రూ. 12.99 లక్షలు

1.5 రెవోట్రాన్ ప్యూర్ (డీసీఏ)- రూ. 14.49 లక్షలు

1.5 రెవోట్రాన్ ప్యూర్+ (ఎంటీ) - రూ. 14.49 లక్షలు

1.5 రెవోట్రాన్ ప్యూర్+ (డీసీఏ) - రూ. 15.99 లక్షలు

1.5 రెవోట్రాన్ అడ్వెంచర్ (ఎంటీ)- రూ. 15.29 లక్షలు

1.5 రెవోట్రాన్ అడ్వెంచర్ (డీసీఏ)- రూ. 16.79 లక్షలు

1.5 రెవోట్రాన్ అడ్వెంచర్+ (ఎంటీ)- రూ. 15.99 లక్షలు

1.5 హైపీరియన్ అడ్వెంచర్ (ఏటీ)- రూ. 17.99 లక్షలు

డీజిల్​ వేరియంట్లు-

1.5 క్రయోజైట్ స్మార్ట్ (ఎంటీ)- రూ. 12.99 లక్షలు

1.5 క్రయోజైట్ ప్యూర్ (ఎంటీ)- రూ. 14.49 లక్షలు

1.5 క్రయోజైట్ ప్యూర్ (ఏటీ)- రూ. 15.99 లక్షలు

1.5 క్రయోజైట్ ప్యూర్+ (ఎంటీ)- రూ. 15.99 లక్షలు

1.5 క్రయోజైట్ ప్యూర్+ (ఏటీ)- రూ. 17.49 లక్షలు

1.5 క్రయోజైట్ అడ్వెంచర్ (ఎంటీ)- రూ. 16.49 లక్షలు

1.5 క్రయోజైట్ అడ్వెంచర్+ (ఎంటీ)- రూ. 17.19 లక్షలు

1.5 క్రయోజైట్ అడ్వెంచర్+ (ఏటీ)- రూ. 18.49 లక్షలు

అకంప్లిష్‌డ్, అకంప్లిష్‌డ్+ వేరియంట్ల ధరలను ఇంకా వెల్లడించాల్సి ఉందని గమనించాలి.

2025 టాటా సియెర్రా ఫీచర్స్​..

కొత్త టాటా సియెర్రా ఎస్​యూవీలో అద్భుతమైన ఫీచర్లను చేర్చారు!

ఎక్స్​టీరియర్​ ఎలిమెంట్స్​-

  • ఆల్-ఎల్​ఈడీ లైటింగ్
  • ముందు, వెనుక భాగంలో ఎల్​ఈడీ లైట్ బార్‌లు
  • ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్ (తలుపులోకి కలిసిపోయే హ్యాండిల్స్)
  • సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్లు
  • 19-ఇంచ్​ అల్లాయ్ వీల్స్
  • బ్లాక్-అవుట్ రూఫ్, రూఫ్ రైల్స్

ఇంటీరియర్ ఫీచర్లు-

సియెర్రా లోపల విశాలంగా, సాంకేతికంగా మెరుగ్గా ఉంది:

  • పానోరమిక్ సన్‌రూఫ్
  • డాష్‌బోర్డ్‌లో ప్రముఖంగా కనిపించే మూడు స్క్రీన్‌లు
  • ఏఆర్​ హెచ్​యూడీ (ఆగ్మెంటెడ్ రియాలిటీ హెడ్స్-అప్ డిస్‌ప్లే)
  • 12-స్పీకర్ జేబీఎల్​ మ్యూజిక్ సిస్టమ్
  • రేర్​ విండో సన్‌షేడ్స్
  • ముందు ప్రయాణికుల సీటు కోసం బాస్ మోడ్ ఫంక్షన్
  • రేర్​ ఏసీ వెంట్స్, ఎయిర్ ప్యూరిఫైయర్
  • వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు
  • మెమరీ, వెల్‌కమ్ ఫంక్షన్లతో 6-వే పవర్డ్ డ్రైవర్ సీటు
  • 65డబ్ల్యూ టైప్-సీ ఛార్జింగ్ పోర్ట్‌లు, వైర్‌లెస్ ఛార్జర్, వైర్‌లెస్ ఫోన్ ప్రొజెక్షన్
  • గెశ్చర్ కంట్రోల్‌తో కూడిన పవర్డ్ టెయిల్‌గేట్
  • టెరైన్ మోడ్స్ సెలెక్టర్, ఈపీబీ (ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్), ప్యాడిల్ షిఫ్టర్లు
  • లెవెల్ 2 అడాస్​ (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్)
  • ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, డ్యుయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్
  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More