స్కోడా నుంచి కొత్త ఎస్​యూవీ- టాటా సియెర్రా, క్రెటాకు పోటీగా! లాంచ్​ ఎప్పుడంటే..

స్కోడా నుంచి కొత్త ఎస్​యూవీ విడుదలకు సిద్ధమవుతోంది. ఇది ఇటీవలే లాంచ్​ అయిన టాటా సియెర్రా, క్రెటాకు గట్టి పోటీ ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో ఈ మోడల్​ లాంచ్​తో పాటు ఇప్పటి వరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Dec 05, 2025 3:45 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

జనవరి 2026లో ఇండియాలో కొత్త కారును లాంచ్ చేయనున్నట్లు అధికారిక ధృవీకరించింది స్కోడా సంస్థ. బ్రాండ్ ఆ మోడల్ పేరును ప్రకటించనప్పటికీ, రాబోయే ప్రాడక్ట్​ ‘కుషాక్ కాంపాక్ట్ ఎస్‌యూవీ’కి చెందిన మిడ్​ సైకిల్​ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ అని భావిస్తున్నారు.

స్కోడా కొత్త ఎస్​యూవీ..
స్కోడా కొత్త ఎస్​యూవీ..

గత కొద్ది నెలలుగా, అప్డేటెడ్​ కుషాక్ ఎస్​యూవీకి చెందిన క్యామోఫ్లేజ్ టెస్ట్ వాహనాలు భారతీయ రోడ్లపై అనేకసార్లు కనిపించాయి. ఈ ప్రోటోటైప్‌లు ముందు- వెనుక భాగాల్లో భారీగా కవర్​ చేసి ఉన్నాయి. ఫలితంగా విజువల్ మార్పులు ప్రధానంగా ఆ ప్రాంతాల్లోనే ఉంటాయని ఇది సూచిస్తుంది. ఈ నేపథ్యంలో కొత్త కుషాక్​ నుంచి ఏం ఆశించవచ్చు అనేది ఇక్కడ తెలుసుకుందాము..

కొత్త స్కోడా కుషాక్ నుంచి ఏం ఆశించవచ్చు?

కొత్త కుషాక్ ఫేస్‌లిఫ్ట్‌లో కింది మార్పులను మనం ఆశించవచ్చు:

ముందు భాగం: రివైజ్డ్​ గ్రిల్, కొత్త బంపర్ డిజైన్ ఉండవచ్చు. హెడ్‌ల్యాంప్ యూనిట్లలో కూడా అప్‌డేట్‌లు వచ్చే అవకాశం ఉంది. అయినప్పటికీ వాటి ఆకారంలో పెద్ద మార్పులు కనిపించకపోవచ్చు.

వెనుక భాగం: ఇదే విధమైన మార్పులు వెనుక భాగంలో కూడా ఆశించవచ్చు. ఇక్కడ ఎస్‌యూవీకి కొత్తగా రూపొందించిన టైల్‌ల్యాంప్‌లు, రిఫ్రెష్ చేసిన బంపర్ లభించవచ్చు.

టెస్ట్​ వెహికిల్స్​ కూడా ప్రస్తుత మోడల్‌లోని అల్లాయ్ వీల్స్‌తోనే తిరుగుతున్నప్పటికీ, స్కోడా ప్రొడక్షన్​ వెర్షన్‌లో కొత్త వీల్ డిజైన్‌ను పరిచయం చేసే అవకాశం ఉంది.

స్కోడా కొత్త ఎస్​యూవీ- ఇంటీరియర్‌లో భారీ అప్‌గ్రేడ్‌?

ఇంటీరియర్ అప్‌డేట్‌లు మరింత గణనీయంగా ఉండవచ్చని అంచనా.

స్పై షాట్స్​ ప్రకారం.. ప్రస్తుత కుషాక్‌లో లేని 360-డిగ్రీ కెమెరా సెటప్​, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఇందులో యాడ్​ చేయవచ్చు.

ఈ ఫేస్‌లిఫ్ట్​లో అప్‌డేట్ చేసిన డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, రిఫ్రెష్ చేసిన టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను తీసుకురావడానికి కూడా అవకాశం ఉంది.

భద్రతా అప్‌గ్రేడ్‌లు కూడా ఇందులో భాగంగా ఉండవచ్చు. కుషాక్ ఇప్పటికే 5-స్టార్ భారత్ ఎన్​సీఏపీ రేటింగ్‌ను కలిగి ఉంది. అయితే, ఈ ఫేస్‌లిఫ్ట్‌లో అడాస్​ (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) సూట్​ని పరిచయం చేయటం ద్వారా దాని భద్రతా ప్యాకేజీని మరింత పెంచవచ్చు. అయితే దీనిని ఇంకా అధికారికంగా ధ్రువీకరించలేదు.

కొత్త స్కోడా కుషాక్-​ మెకానికల్ మార్పులు లేవు..

స్కోడా కుషాక్​ ఫేస్‌లిఫ్ట్‌తో ఎలాంటి మెకానికల్ మార్పులు ఉండకపోవచ్చని అంచనా.

ఈ ఎస్‌యూవీ 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో కొనసాగుతుంది. ఇది 113 హెచ్​పీ పవర్​ని, 178 ఎన్​ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్-కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో కనెక్ట్​ చేసి ఉంటుంది.

1.5-లీటర్ టర్బో-పెట్రోల్ యూనిట్ కూడా కొనసాగుతుందని భావిస్తున్నారు. ఇది 147 హెచ్​పీ పవర్​ని, 250 ఎన్​ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ప్రస్తుతం 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో మాత్రమే అందుబాటులో ఉంది.

లాంచ్ అయిన తర్వాత ఈ కుషాక్ ఫేస్‌లిఫ్ట్.. టాటా సియెర్రా, హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా, ఎంజీ ఆస్టర్ వంటి మోడళ్లతో పోటీ పడటం కొనసాగిస్తుంది.