టాటా సియెర్రా కొంటున్నారా? హైదరాబాద్​లో ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలు ఇవి..

టాటా సియెర్రా ఎస్​యూవీని కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? అయితే, హైదరాబాద్​లో టాటా సియెర్రా ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి. ఇది మీ బడ్జెట్​ ప్లానింగ్​కి కచ్చితంగా ఉపయోగపడుతుంది.

Published on: Dec 19, 2025, 06:45:37 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అనుకున్నదే జరిగింది! 2025 టాటా సియెర్రాకి భారతీయుల నుంచి క్రేజీ డిమాండ్​ లభిస్తోంది. ఈ ఎస్​యూవీని గత నెలలో లాంచ్​ చేసిన దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ టాటా మోటార్స్​, ఇటీవలే బుకింగ్స్​ని సైతం ప్రారంభించింది. మొదటి రోజే 70వేలకు పైగా బుకింగ్స్​తో టాటా సియెర్రా టాక్​ ఆఫ్​ ది టౌన్​గా నిలిచింది. మరి మీరు కూడా ఈ ఎస్​యూవీని కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే. హైదరాబాద్​లో టాటా సియెర్రా ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

2025 టాటా సియెర్రా..
2025 టాటా సియెర్రా..

హైదరాబాద్​లో టాటా సియెర్రా ఆన్​రోడ్​ ప్రైజ్..

టాటా సియెర్రా ఎస్​యూవీ స్మార్ట్​ ప్లస్​ (పెట్రోల్​)- రూ. 14.11 లక్షలు

ప్యూర్​ (పెట్రోల్​)- రూ. 15.93 లక్షలు

స్మార్ట్​ ప్లస్​ (డీజిల్​)- రూ. 15.93 లక్షలు

ప్యూర్​ డీసీఏ (పెట్రోల్​)- రూ. 17.76 లక్షలు

ప్యూర్​ ప్లస్​ (పెట్రోల్​)- రూ. 17.76 లక్షలు

ప్యూర్​ (డీజిల్​)- రూ. 17.76 లక్షలు

అడ్వెంచర్​ (పెట్రోల్​)- రూ. 18.73 లక్షలు

అడ్వెంచర్​ ప్లస్​ (పెట్రోల్​)- రూ. 19.58 లక్షలు

ప్యూర్​ ప్లస్​ డీసీఏ (పెట్రోల్​)- రూ. 19.58 లక్షలు

ప్యూర్​ డీజిల్​ ఏటీ (డీజిల్​)- రూ. 19.58 లక్షలు

ప్యూర్​ ప్లస్​ (డీజిల్​)- రూ. 19.58 లక్షలు

అడ్వెంచర్​ (డీజిల్​)- రూ. 20.19 లక్షలు

అడ్వెంచర్​ డీసీఏ (పెట్రోల్​)- రూ. 20.56 లక్షలు

అకంప్లీష్డ్​ (పెట్రోల్​)- రూ. 20.76 లక్షలు

అడ్వెంచర్​ ప్లస్​ (డీజిల్​)- రూ. 21.04 లక్షలు

ప్యూర్​ ప్లస్​ ఏటీ (డీజిల్​)- రూ. 21.41 లక్షలు

అడ్వెంచర్​ ప్లస్​ టీజీడీఐ (పెట్రోల్​)- రూ. 22.02 లక్షలు

అకంప్లీష్డ్​ (డీజిల్​)- రూ. 22.38 లక్షలు

అడ్వెంచర్​ ప్లస్​ ఏటీ (డీజిల్​)- రూ. 22.63 లక్షలు

అకంప్లీష్డ్​ టీజీడీఐ (పెట్రోల్​)- రూ. 23.05 లక్షలు

అకంప్లీష్డ్​ ఏటీ (డీజిల్​)- రూ. 23.55 లక్షలు

అకంప్లీష్డ్ ప్లస్​​ (డీజిల్​)- రూ. 23.90 లక్షలు

అకంప్లీష్డ్​ ప్లస్​ టీజీడీఐ (పెట్రోల్​)- రూ. 24.20 లక్షలు

అకంప్లీష్డ్​ ప్లస్​ ఏటీ (డీజిల్​)- రూ. 25.08 లక్షలు

అంటే హైదరాబాద్​లో టాటా సియెర్రా ఎస్​యూవీ ఆన్​రోడ్ ​ప్రైజ్​ రూ. 14.11 లక్షల నుంచి రూ. 25.08 లక్షల వరకు ఉంటుంది.

వాహనాల లాంచ్​ చేసే సమయంలో ఆటోమొబైల్​ సంస్థలు వాటి ఎక్స్​షోరూం ధరలను మాత్రమే ప్రకటిస్తాయి. కానీ ఆన్​రోడ్​ ప్రైజ్​ వేరుగా ఉంటుంది. వివిధ రాష్ట్రాల్లో ట్యాక్స్​ వేరువేరుగా ఉండటం ఇందుకు కారణం. మీరు మీ సమీప డీలర్​షిప్​ షోరూమ్​ని సందర్శిస్తే, వెహికిల్​ టెస్ట్​ డ్రైవ్​తో పాటు లాంచ్​ ఆఫర్స్​ గురించి (ఏవైనా ఉంటే) కూడా తెలుసుకోవచ్చు. ఇది మీ బడ్జెట్​ ప్లానింగ్​కి ఉపయోగపడుతుంది.

టాటా సియెర్రా బేస్​ వేరియంట్​లోనే అదిరే ఫీచర్లు..!

ఈ ఎస్​యూవీలో చాలా హైలైట్స్​ ఉన్నాయి. మరీ ముఖ్యంగా బేస్​ వేరియంట్ అనేది.. పేరుకే బేస్​ వేరియంట్! కానీ ఇందులో అదిరే ఫీచర్స్​ ఉన్నాయి. సేఫ్టీ విషయంలోనూ టాటా మోటార్స్​ రాజీపడలేదు.

టాటా సియెర్రా బేస్ వేరియంట్‌ను స్మార్ట్+ అని పిలుస్తారు. ఇందులో అనేక అధునాతన ఫీచర్లను స్టాండర్డ్‌గా అందిస్తున్నారు. అవి..

బై-ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్

టర్న్ ఇండికేటర్‌లతో కూడిన ఎలక్ట్రికల్‌గా అడ్జస్టబుల్ ఓఆర్‌వీఎంలు

ఎలక్ట్రిక్ టెయిల్‌గేట్ రిలీజ్​

10.16 సెం.మీ డిజిటల్ కాక్‌పిట్

ఎల్‌ఈడీ టర్న్ ఇండికేటర్లు

ఆటో హోల్డ్‌తో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్

స్టోరేజ్‌తో కూడిన ఫ్రంట్ స్లైడింగ్ ఆర్మ్‌రెస్ట్

ఫాలో మీ హోమ్ హెడ్‌ల్యాంప్

పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More