Sign in

హైదరాబాద్​లో మహీంద్రా XEV 9S ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలు..

ఇటీవలే ఇండియాలో లాంచ్​ అయిన మహీంద్రా ఎక్స్​ఈవీ 9ఎస్​ కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే! హైదరాబాద్​లో మహీంద్రా ఎక్స్​ఈవీ 9ఎస్​ ఆన్​రోడ్​ ప్రైజ్​ డీటైల్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

Published on: Dec 6, 2025, 11:25:10 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మహీంద్రా ఎక్స్​ఈవీ 9ఎస్​ రూపంలో భారత ఆటోమొబైల్​ మార్కెట్​లో మరో ఈవీ ఆప్షన్​ అందుబాటులోకి వచ్చింది. గత నెలలో ఈ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీని లాంచ్​ చేసింది మహీంద్రా అండ్​ మహీంద్రా సంస్థ.. 2026 జనవరిలో బుకింగ్స్​ని ప్రారంభించనుంది. అదే నెలలో డెలివరీలను కూడా మొదలుపెట్టనుంది. మరి మీరు మహీంద్రా ఎక్స్​ఈవీ 9ఎస్​ కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే! హైదరాబాద్​లో మహీంద్రా ఎక్స్​ఈవీ 9ఎస్​ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

మహీంద్రా ఎక్స్​ఈవీ 9ఎస్​..
మహీంద్రా ఎక్స్​ఈవీ 9ఎస్​..

హైదరాబాద్​లో మహీంద్రా ఎక్స్​ఈవీ 9ఎస్​ ఆన్​రోడ్​ ప్రైజ్..

మహీంద్రా ఎక్స్​ఈవీ 9ఎస్​ ప్యాక్​ వన్​ ఎబోవ్​ (59 కేడబ్ల్యూహెచ్​)- రూ. 20.97 లక్షలు

ప్యాక్​ వన్​ ఎబోవ్​ (79 కేడబ్ల్యూహెచ్​)- రూ. 23.24 లక్షలు.

ప్యాక్​ టు ఎబోవ్​ (70 కేడబ్ల్యూహెచ్)- రూ. 25.86 లక్షలు.

ప్యాక్​ టు ఎబోవ్​ (79కేడబ్ల్యూహెచ్)- రూ. 26.91 లక్షలు.

ప్యాక్​ త్రీ (79 కేడబ్ల్యూహెచ్)- రూ. 28.90 లక్షలు.

ప్యాక్​ త్రీ ఎబోవ్​ (79 కేడబ్ల్యూహెచ్)- రూ. 31.10 లక్షలు.

అంటే హైదరాబాద్​లో మహీంద్రా ఎక్స్​ఈవీ 9ఎస్​ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ ఆన్​రోడ్​ ప్రైజ్​ రూ. 20.97 లక్షల నుంచి రూ. 31.10 లక్షల వరకు ఉంటుంది.

వాహనాల లాంచ్​ చేసే సమయంలో ఆటోమొబైల్​ సంస్థలు వాటి ఎక్స్​షోరూం ధరలను మాత్రమే ప్రకటిస్తాయి. కానీ ఆన్​రోడ్​ ప్రైజ్​ వేరుగా ఉంటుంది. వివిధ రాష్ట్రాల్లో ట్యాక్స్​ వేరువేరుగా ఉండటం ఇందుకు కారణం.

మహీంద్రా ఎక్స్​ఈవీ 9ఎస్​- వాల్యూ ఫర్​ మనీ వేరియంట్​..

మహీంద్రా ఎక్స్​ఈవీ 9ఎస్ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ​ శ్రేణిలో 'ప్యాక్ వన్ అబౌవ్' వేరియంట్ అన్నింటికంటే సరసమైన ఎంపిక. హైదరాబాద్​లో దీని 59 కేడబ్ల్యూహెచ్​ వేరియంట్​ ఆన్​రోడ్​ ప్రైజ్​ రూ. 20.97 లక్షలు.

'ప్యాక్ వన్ అబౌవ్' అనేది మహీంద్రా ఎక్స్​ఈవీ 9ఎస్​ బేస్ వేరియంట్ అయినప్పటికీ, ఇది ఆకర్షణీయంగా ఉండేలా మహీంద్రా అన్ని చర్యలు తీసుకుంది! ఈ బేస్ వేరియంట్‌ను టాప్-ఎండ్ వేరియంట్ మాదిరిగానే ఆకర్షణీయంగా రూపొందించినట్లు కంపెనీ పేర్కొంది (కొన్ని ఫీచర్లను మాత్రం టాప్-ఎండ్ కోసం రిజర్వ్ చేసింది).

లైటింగ్: ఎల్​ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్​ఈడీ టైల్‌లైట్లు.

వీల్స్: 18-ఇంచ్​ ఏరో అల్లాయ్ వీల్స్.

టెక్నాలజీ: వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, 5జీ కనెక్టివిటీతో కూడిన ట్రిపుల్ డిజిటల్ డిస్‌ప్లే సెటప్.

సౌకర్యం: పనోరమిక్ సన్‌రూఫ్, హైట్​ అడ్జెస్టెబుల్​ డ్రైవర్ సీటు, పడుకోవడానికి, జరుపుకోవడానికి వీలైన రెండొవ వరుస సీట్లు.

కంట్రోల్స్: పుష్ స్టార్ట్-స్టాప్ బటన్, క్రూయిజ్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్.

భద్రత: ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, టీపీఎంఎస్​ (టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్), డ్రైవర్ డ్రౌజీనెస్ డిటెక్షన్ సిస్టమ్.

పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More