2026 టాటా పంచ్​ని రివీల్​ చేసిన సంస్థ- అదిరే లుక్​, టర్బో ఇంజిన్​తో ఎంట్రీ..

టాటా మోటార్స్ తన పాపులర్ మైక్రో ఎస్‌యూవీ పంచ్ ఫేస్‌లిఫ్ట్‌ను ఆవిష్కరించింది. కొత్త డిజైన్, 10.25 ఇంచ్​ స్క్రీన్, 360-డిగ్రీ కెమెరాతో పాటు పవర్‌ఫుల్ 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఇందులో ప్రధాన ఆకర్షణలు. జనవరి 13న ఈ ఎస్​యూవీ ధరలను సంస్థ ప్రకటిస్తుంది.

Published on: Jan 6, 2026, 15:20:49 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

2026 టాటా పంచ్​ కోసం ఎదురుచూస్తున్న వారికి బిగ్​ అప్డేట్​! జనవరి 13 లాంచ్​కి ముందే, ఈ బెస్ట్​ సెల్లింగ్​ ఫ్యామిలీ ఎస్​యూవీని సంస్థ ఆవిష్కరించింది. కేవలం డిజైన్ మాత్రమే కాదు, ఈ టాటా పంచ్​ ఫేస్​లిఫ్ట్​ ఇంజిన్ విషయంలోనూ సంస్థ అదిరిపోయే సర్​ప్రైజ్ ఇచ్చింది. పంచ్​లో వస్తున్న తొలి మేజర్​ అప్డేట్​కి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

2026 టాటా పంచ్​ ఇదిగో..
2026 టాటా పంచ్​ ఇదిగో..

టాటా పంచ్​ ఫేస్​లిఫ్ట్​- కొత్త లుక్: చూడగానే ఫిదా అవ్వాల్సిందే!

కొత్త టాటా పంచ్ డిజైన్ చూస్తుంటే, ఇది పంచ్ ఈవీ, ఆల్ట్రోజ్ నుంచి ప్రేరణ పొందినట్లు అనిపిస్తుంది.

ముందు భాగం: సన్నని ఎల్‌ఈడీ డే-టైమ్ రన్నింగ్ లైట్లు, బ్లాక్ కలర్ గ్రిల్‌తో ఎస్​యూవీ ఫ్రెంట్​ ఫేస్​ పూర్తిగా మారిపోయింది. బంపర్‌పై ఉన్న హెవీ బ్లాక్ క్లాడింగ్ దీనికి మరింత రగ్గడ్ లుక్‌ని ఇస్తుంది.

హెడ్‌ల్యాంప్స్: హెడ్‌లైట్లను కూడా ఎల్‌ఈడీ యూనిట్లుగా మార్చారు. ఇవి షార్ప్ కటింగ్స్‌తో చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉన్నాయి.

సైడ్ అండ్​ రియర్: పక్క నుంచి చూస్తే ఈ టాటా పంచ్​ ఫేస్​లిఫ్ట్​లో పెద్దగా మార్పులు లేకపోయినా, కొత్త 16-ఇంచ్​ అలాయ్ వీల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇక వెనుక భాగంలో ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉండే 'కనెక్టెడ్ ఎల్‌ఈడీ టైల్ ల్యాంప్స్' కారుకు మరింత ప్రీమియం లుక్‌ని జోడించాయి.

2026 టాటా పంచ్​- హైటెక్ కేబిన్: ఇంటీరియర్ అదిరింది..

ఎస్​యూవీ లోపలికి అడుగుపెట్టగానే సరికొత్త ప్రపంచం కనిపిస్తుంది!

స్టీరింగ్ వీల్: టాటా కొత్త కార్లలో కనిపిస్తున్నట్లుగా.. వెలిగే టాటా లోగోతో కూడిన 'టూ-స్పోక్' స్టీరింగ్ వీల్ ఇందులో ఉంది.

టెక్నాలజీ: 10.25-ఇంచ్​ భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7-ఇంచ్​ ఫుల్లీ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే కారును టెక్నాలజీ పరంగా నెక్ట్స్​ లెవల్‌కు తీసుకెళ్లాయి.

ఫీచర్లు: కేబిన్‌లో గ్రే, బ్లూ కలర్ సీట్ అప్​హోలిస్ట్రీ కొత్తగా ఉంటుంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, 360-డిగ్రీ కెమెరా, సన్‌రూఫ్ వంటి ఫీచర్లు రైడ్‌ని మరింత సౌకర్యవంతంగా మారుస్తాయి.

  • సింగిల్​ ఛార్జ్​తో 449 కి.మీ రేంజ్​- 2025 బెస్ట్​ సెల్లింగ్​ ఎలక్ట్రిక్​ కారుగా ఎంజీ విండ్సర్​! కారణాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

2026 టాటా పంచ్​ బిగ్ సర్​ప్రైజ్: టర్బో ఇంజిన్!

2026 టాటా పంచ్​లో అందరినీ ఆశ్చర్యపరిచే విషయం 'టర్బో పెట్రోల్ ఇంజిన్'. నెక్సాన్ నుంచి తెచ్చుకున్న 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను మొదటిసారి పంచ్‌లో ప్రవేశపెడుతున్నారు.

పవర్: ఇది 118 బీహెచ్​పీ పవర్​ని, 170 ఎన్​ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

గేర్ బాక్స్: దీనికి 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ను జత చేశారు.

ఇతర ఆప్షన్లు: సాధారణ 1.2-లీటర్ పెట్రోల్ (87 బీహెచ్​పీ), సీఎన్జీ వేరియంట్లు కూడా ఈ టాటా పంచ్​లో అందుబాటులో ఉంటాయి.

2026 టాటా పంచ్​- ధర, పోటీ..

2026 టాటా పంచ్ ధర సుమారు రూ. 6 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభం అయ్యే అవకాశం ఉందని అంచనా. లాంచ్​ రోజున ధరను సంస్థ అధికారికంగా ప్రకటిస్తుంది.

హ్యుందాయ్ ఎక్స్‌టర్, మారుతీ ఇగ్నిస్, నిస్సాన్ మాగ్నైట్, రెనాల్ట్ కైగర్ వంటి కార్లకు టాటా పంచ్​ గట్టి పోటీ ఇవ్వనుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More