రెనాల్ట్​ డస్టర్​ వచ్చేస్తోంది- పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తూ కొత్త టీజర్​..

ఒకప్పుడు భారత రోడ్లను ఏలిన రెనాల్ట్​ డస్టర్ ఇండియాలోకి మళ్లీ వస్తోంది. సరికొత్త డిజైన్, హైటెక్ ఫీచర్లతో న్యూ-జనరేషన్ డస్టర్‌ను జనవరి 26న రెనాల్ట్​ ఇండియా ఆవిష్కరించనుంది. పాత జ్ఞాపకాలను గుర్తుచేస్తూ కంపెనీ తాజాగా విడుదల చేసిన ఒక టీజర్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

Published on: Dec 25, 2025, 12:20:38 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారత ఆటోమొబైల్​ మార్కెట్​లో గ్రాండ్​ రీ-ఎంట్రీకి రెనాల్ట్​ డస్టర్​ సిద్ధమవుతోంది. ఒకప్పుడు సంచలనం సృష్టించి, ఆ తర్వాత కనుమరుగైన ఈ ఎస్​యూవీ 2026 జనవరి 26న సరికొత్తగా లాంచ్​కానుంది. ఈ నేపథ్యంలో ఈ మోడల్​కి సంబంధించిన టీజర్​ని రెనాల్ట్​ ఇండియా తాజాగా రిలీజ్​ చేసింది.

సరికొత్త రెనాల్ట్​ డస్టర్​ వచ్చేస్తోంది..
సరికొత్త రెనాల్ట్​ డస్టర్​ వచ్చేస్తోంది..

రెనాల్ట్​ డస్టర్​ ఎస్​యూవీ- నోస్టాల్జియాతో ఆకట్టుకుంటున్న టీజర్..

ఈ లాంచ్ కోసం రెనాల్ట్​ ఇండియా విడుదల చేసిన టీజర్ వీడియో నెటిజన్లను కట్టిపడేస్తోంది. "ఐకాన్ ఈజ్ బ్యాక్" అంటూ పాత జ్ఞాపకాలను కంపెనీ గుర్తుచేస్తోంది. వీడియోలో ఒక బాలుడు పాత డస్టర్ బొమ్మ కారుతో ఆడుకోవడం, ఆపై కఠినమైన రోడ్ల మీద నిజమైన డస్టర్ కారు దూసుకెళుతుండటం వంటి దృశ్యాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. ముఖ్యంగా డస్టర్ యజమానుల కోసం గతంలో ఏర్పాటు చేసిన 'గ్యాంగ్స్ ఆఫ్ డస్టర్' (జీఓడీ) కమ్యూనిటీని కూడా ఈ వీడియోలో గుర్తు చేశారు. చివరిలో ఎర్రటి క్లాత్ కింద దాగి ఉన్న కొత్త తరం డస్టర్ మిరుమిట్లు గొలిపే ఎల్ఈడీ లైట్లతో దర్శనమిస్తోంది.

రెనాల్ట్​ డస్టర్​ ఎస్​యూవీ- డిజైన్ అదుర్స్..

అంతర్జాతీయ మార్కెట్లో ఇప్పటికే విక్రయిస్తున్న మోడల్‌ను పోలి ఉండేలా ఈ కొత్త డస్టర్‌ను రూపొందించారు.

ముందు భాగం: వై ఆకారపు ఎల్ఈడీ హెడ్‌లైట్లు, బుల్-బార్‌ను తలపించే గ్రిల్, గంభీరమైన వెడల్పాటి బోనెట్‌తో ఇది ఎంతో స్టైలిష్‌గా కనిపిస్తుంది.

వెనుక భాగం: వీ షేప్‌లో ఉండే టెయిల్ లైట్లు, రూఫ్ రైల్స్, షార్క్ ఫిన్ యాంటెన్నా, శక్తివంతమైన వీల్ ఆర్చ్‌లు దీనికి మస్క్యులర్​ రూపాన్ని ఇచ్చాయి.

రెనాల్ట్​ డస్టర్​ టీజర్​ని ఇక్కడ చూడండి:

రెనాల్ట్​ డస్టర్​ ఎస్​యూవీ- ఇంజిన్, పర్ఫార్మెన్స్..

గ్లోబల్ మార్కెట్‌లో ఈ కారు పలు రకాల ఇంజిన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది.

1.2 లీటర్ టర్బో-పెట్రోల్ (48వీ మైల్డ్ హైబ్రిడ్):- ఈ ఇంజిన్​ 128.2 హెచ్​పీ పవర్​ని జనరేట్​ చేస్తుంది.

1.6 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్: - రెండు ఎలక్ట్రిక్ మోటార్లతో కూడిన ఈ ఇంజిన్ 138 హెచ్​పీ పవర్‌ను ఇస్తుంది.

1.0 లీటర్ పెట్రోల్-ఎల్పీజీ ఇంజిన్: - 98.6 హెచ్​పీ పవర్ జనరేట్​ చేస్తుంది.

భారత మార్కెట్లోకి ఏ వెర్షన్లను తీసుకొస్తారనే దానిపై జనవరి 26న స్పష్టత రానుంది.

గతంలో 2012లో విడుదలైన డస్టర్, మధ్యతరగతి ప్రజలకు ఎస్‌యూవీ కలని చేరువ చేసింది. ఇప్పుడు మళ్లీ అదే పేరుతో, రెట్టింపు ఉత్సాహంతో రెనాల్ట్​ భారత్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. మరి ఈ కొత్త డస్టర్ ధరలు ఎలా ఉంటాయో, ఇది ఎంతవరకు పాత క్రేజ్‌ను తిరిగి తెస్తుందో చూడాలి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More