2026 కియా సెల్టోస్​ ఎస్​యూవీ బుక్​ చేశారా? బిగ్​ అప్డేట్​..

కియా మోటార్స్ తన పాపులర్ ఎస్‌యూవీ 'సెల్టోస్' కొత్త వెర్షన్‌ను సిద్ధం చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం ప్లాంట్‌లో దీని ఉత్పత్తి ప్రారంభమైంది. సరికొత్త డిజైన్, హైటెక్ ఫీచర్లతో రానున్న ఈ కారు ధరను జనవరిలో వెల్లడించనున్నారు.

Published on: Dec 25, 2025, 10:30:36 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో సరికొత్త ఒరవడిని సృష్టించిన ‘కియా సెల్టోస్’ ఎస్​యూవీ ఇప్పుడు సరికొత్త రూపంలో మన ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. అయితే, జనవరి 2026లో గ్రాండ్‌ లాంచ్​కి ముందు ఈ ఎస్​యూవీకి సంబంధించిన అప్డేట్​ ఒకటి బయటకు వచ్చింది.

2026 కియా సెల్టోస్​..
2026 కియా సెల్టోస్​..

2026 కియా సెల్టోస్​- బిగ్​ అప్డేట్​..

ఈ న్యూ జనరేషన్ సెల్టోస్ ఉత్పత్తిని ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం ఫ్యాక్టరీలో కంపెనీ అధికారికంగా ప్రారంభించింది. ఈ ప్లాంట్‌ను 2019లో ప్రారంభించగా, ఏడాదికి ఏకంగా 3 లక్షల వాహనాలను తయారు చేసే సామర్థ్యాన్ని ఇది కలిగి ఉండటం విశేషం.

2026 కియా సెల్టోస్​ బుకింగ్స్​ డిసెంబర్​ 11న ప్రారంభమైన విషయం తెలిసిందే.

2026 కియా సెల్టోస్​- చూపు తిప్పుకోనివ్వని డిజైన్..

పాత మోడల్‌తో పోలిస్తే 2026 కియా సెల్టోస్ పూర్తిగా భిన్నంగా ఉండనుంది. ఇది మునుపటి కంటే పొడవుగా, వెడల్పుగా ఉండి రోడ్డుపై మరింత అగ్రెసివ్​గా కనిపిస్తుంది. వీల్‌బేస్ పెంచడం వల్ల కారు లోపల ప్రయాణికులకు మరింత స్పేస్​, సౌకర్యం లభిస్తాయి. కియా తన లేటెస్ట్ డిజైన్ ఫిలాసఫీని ఇందులో వాడింది. రీ-డిజైన్ చేసిన ఫ్రంట్ ఫాసియా, సరికొత్త ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, స్టైలిష్ అల్లాయ్ వీల్స్ ఈ ఎస్‌యూవీకి ఒక లగ్జరీ లుక్‌ను ఇస్తున్నాయి.

2026 కియ సెల్టోస్​- హైటెక్ ఫీచర్లతో లోపలి భాగం..

కారు లోపలికి ప్రవేశించగానే మనకు కనిపించే ప్రధాన ఆకర్షణ భారీ ‘పనోరమిక్ డిస్‌ప్లే’. ఇందులో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ రెండూ కలిసిపోయి ఒకే పెద్ద యూనిట్‌లా కనిపిస్తాయి. దీనికి తోడు వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, అద్భుతమైన ఆడియో సిస్టమ్ ప్రయాణాన్ని మరింత ఆహ్లాదకరంగా మారుస్తాయి. ప్రతిరోజూ వాడేందుకు సులభంగా, విలాసవంతంగా ఉండేలా ఇంటీరియర్‌ను కియా తీర్చిదిద్దింది.

2026 కియా సెల్టోస్​- భద్రతకు పెద్ద పీట..

కొత్త కియా సెల్టోస్‌ను ‘కే3’ ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించారు. ఇది వాహనం హ్యాండ్లింగ్‌ను మెరుగుపరచడమే కాకుండా, ప్రయాణంలో కుదుపులు లేకుండా సాఫీగా వెళ్లేలా చేస్తుంది.

భద్రత విషయంలోనూ రాజీ పడకుండా సరికొత్త ప్రమాణాలను పాటించింది కియా సంస్థ. అన్ని మోడళ్లలో స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు ఉండగా, టాప్ వేరియంట్లలో అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ (అడాస్​) ఫీచర్లు లభిస్తాయి.

2026 కియా సెల్టోస్​- ఇంజిన్ ఆప్షన్లు..

వినియోగదారుల ఇష్టాయిష్టాలకు తగ్గట్టుగా పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లను కియా కొనసాగిస్తోంది. సిటీలో తిరిగే వారికి, లాంగ్ జర్నీలు చేసే వారికి వేర్వేరు ట్రాన్స్‌మిషన్ (గేర్ బాక్స్) ఆప్షన్స్​ని అందుబాటులో ఉంటాయి.

ప్రస్తుతం ఉత్పత్తి దశలో ఉన్న ఈ కారు ధరలను జనవరి మొదటి వారంలో కంపెనీ అధికారికంగా ప్రకటించనుంది. తన అద్భుతమైన చరిత్రను కొనసాగిస్తూ, మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో కియా సెల్టోస్ మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

2026 కియా సెల్టోస్​- బేస్​ వేరియంట్​లోనే అదిరే ఫీచర్లు..

సాధారణంగా ఏ కారుకైనా బేస్ వేరియంట్​లో అవసరమైన ఫీచర్లు మాత్రమే ఉంటాయని భావిస్తుంటారు. అయితే, కియా సెల్టోస్ 'హెచ్​టీఈ' వేరియంట్ మాత్రం ఇందుకు భిన్నంగా కనిపిస్తోంది.

తక్కువ బడ్జెట్‌లో మంచి కారు కొనాలనుకునే వారికి సెల్టోస్ హెచ్​టీఈ బేస్ వేరియంట్ బెస్ట్​ ఆప్షన్​లా మారే అవకాశం ఉంది.

లైటింగ్: ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, డీఆర్ఎల్, టెయిల్ ల్యాంప్స్‌తో పాటు హై మౌంట్ స్టాప్ ల్యాంప్ కూడా ఎల్ఈడీలోనే వస్తోంది.

ఎక్స్‌టీరియర్ అండ్​ ఇంటీరియర్: 16 ఇంచ్​ స్టీల్ వీల్స్, సిల్వర్ ఫినిషింగ్‌తో కూడిన ఫ్రంట్ అండ్ రియర్ స్కిడ్ ప్లేట్స్, షార్క్ ఫిన్ యాంటెన్నా వంటివి 2026 కియా సెల్టోస్​కి స్టైలిష్ లుక్ ఇస్తాయి. లోపల స్మోకీ బ్లాక్ అండ్ గ్రే డ్యూయెల్ టోన్ ఇంటీరియర్స్, డబుల్ డీ-కట్ స్టీరింగ్ వీల్ ప్రీమియం ఎక్స్​పీరియెన్స్​ని కలిగిస్తాయి.

పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More