800 కి.మీ రేంజ్‌తో కియా కొత్త ఎలక్ట్రిక్ కారు- కళ్లుచెదిరే డిజైన్‌తో..
కియా మోటార్స్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ కారు బయటకు రాబోతోంది! ఇది కియా స్ట్రింజర్కి ఎలక్ట్రిక్ వర్షెన్ అని తెలుస్తోంది. దీని రేంజ్ 800 కి.మీ కన్నా ఎక్కువ ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి.
కొన్నేళ్ల క్రితం డిస్కంటిన్యూ చేసిన “స్ట్రింజర్” కారును కియా మోటార్స్ సంస్థ మళ్లీ రివైవ్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. అయితే, గతంలో పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేసిన ఈ మోడల్.. ఇప్పుడు ఆల్- ఎలక్ట్రిక్ వర్షెన్‌తో తిరిగి మార్కెట్లోకి అడుగుపెట్టబోతోంది! ఇందుకు సంబంధించి కొన్ని ఇమేజ్‌లు, వీడియో టీజర్‌లను సంస్థ కొన్ని విడుదల చేసింది. పేరును కంపెనీ ఇంకా ధృవీకరించనప్పటికీ, కాన్సెప్ట్ వర్షెన్‌ని చూస్తుంటే ఇది కియా స్ట్రింజర్ ఈవీ అవుతుందని మార్కెట్ వర్గాలు బలంగా భావిస్తున్నాయి.

కియా స్ట్రింగర్ సక్సెసర్ ఇదేనా?
ఈ ఎలక్ట్రిక్ కాన్సెప్ట్‌ని ‘విజన్ మెటా టూరిస్మో’గా పిలిస్తోంది కియా. ఇది స్ట్రింగర్కి లో-స్లంగ్ సెడాన్ ఆకారం నుంచి భిన్నంగా, మరింత నిటారుగా ఉండే కూపే-శైలి ప్రొఫైల్‌తో రూపుదిద్దుకుంది.
డిజైన్: నిటారుగా ఉండే పిల్లర్లు, విశాలమైన అద్దాల ప్రాంతం, షార్ట్ ఫ్రంట్ ఓవర్‌హాంగ్, వెనుక చక్రాలపై బలమైన షోల్డర్ దీని రూపకల్పనను నిర్వచించాయి.
ఎయిరోడైనమిక్స్: కియా ఎయిరోడైనమిక్స్‌ను మెరుగుపరచడానికి ముందు బంపర్ ప్రాంతంలో ఎయిర్‌ఫ్లో గైడ్‌లు, నిలువు రెక్కలను చేర్చింది. రూఫ్ (పైకప్పు) నెమ్మదిగా వెనుక భాగానికి వాలినట్టు ఉంటుంది.
లైటింగ్: దీని లైటింగ్ చాలా ప్రత్యేకంగా ఉంది. త్రీ-డైమెన్షనల్ వెనుక ల్యాంపులు, ఫ్రెంట్ ఫెండర్‌ల మీదుగా ఏ-పిల్లర్‌ల వైపు సన్నని ఎల్ఈడీ స్ట్రిప్స్ ఉన్నాయి. ఈ స్ట్రిప్స్‌లో వెనుక వైపు చూసే కెమెరాలు అమర్చారు, ఇవి సాంప్రదాయ డోర్ మిర్రర్‌ల స్థానాన్ని భర్తీ చేస్తాయి. వెనుక బంపర్, విండ్‌స్క్రీన్ అంచుల్లో అదనపు కాంతి ఎలిమెంట్స్‌ని ఉంచారు.

కియా స్ట్రింజర్ ఎలక్ట్రిక్- ఇంటీరియర్ వివరాలు..
స్ట్రింజర్ ఈవీకి సంబంధించి పూర్తి ఇంటీరియర్ చిత్రాలను కియా మోటార్స్ వెల్లడించలేదు. కానీ చిన్న వీడియో క్లిప్‌లలో ఫ్లోటింగ్-శైలి డాష్‌బోర్డ్, యోక్-శైలి స్టీరింగ్ వీల్ కనిపిస్తున్నాయి. వెనుక భాగంలో రెండు సీట్లు ఉన్నాయి. అయితే, ప్రొడక్షన్ మోడల్లో సాంప్రదాయ రేర్ బెంచ్ ఉపయోగించే అవకాశం ఉంది. ఈ కొత్త కాన్సెప్ట్ పరిమాణం పాత స్ట్రింగర్ కంటే ఎక్కువగా కనిపిస్తోంది. ఇది క్యాబిన్ మరింత విశాలంగా ఉంటుందని సూచిస్తుంది.
కియా స్ట్రింగర్ ఈవీ రేంజ్..
సాంకేతిక వివరాలు ఇంకా విడుదల కానప్పటికీ, ఈ స్ట్రింగర్ ఎలక్ట్రిక్ వర్షెన్ కియాకు చెందిన 800-వోల్ట్ ఈ-జీఎంపీ ఆర్కిటెక్చర్‌ని ఆధారంగా చేసుకునే అవకాశం ఉంది. ఈ ప్లాట్‌ఫారమ్‌పై ఇప్పటికే ఈవీ6 తయారు చేసింది సంస్థ. ఈ ప్లాట్‌ఫారమ్ అధిక-అవుట్‌పుట్ పవర్‌ట్రెయిన్‌లకు, అల్ట్రా-ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఇది కారు పర్ఫార్మెన్స్ పొజిషనింగ్‌కు సరిపోతుంది.
ఈ ఎలక్ట్రిక్ కారులో 113.2 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీని ఉపయోగించవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. ఇది 800 కిలోమీటర్ల వరకు డ్రైవింగ్ రేంజ్‌ని ఇవ్వగలదని అంచనాలు ఉన్నాయి.
వచ్చే జనవరిలో జరిగే బ్రస్సెల్స్ మోటార్ షోలో కియా 'విజన్ మెటా టూరిస్మో' కాన్సెప్ట్‌ను బహిరంగంగా ప్రదర్శించే అవకాశం ఉంది. అక్కడ దీని ఉత్పత్తికి సంబంధించిన మరిన్ని వివరాలను కియా మోటార్స్ తెలియజేస్తుందని భావిస్తున్నారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper












