భారతీయులు ఎగబడి కొంటున్న ఫ్యామిలీ ఎలక్ట్రిక్​ స్కూటర్​ ఇది- 159 కి.మీ రేంజ్​తో..

బెస్ట్​ సెల్లింగ్​ ఫ్యామిలీ ఎలక్ట్రిక్​ స్కూటర్​గా పేరు సంపాదించుకున్న ఏథర్​ రిజ్టా తాజాగా సరికొత్త మైలురాయిని టచ్​ చేసింది. ఈ మోడల్​కు సంబంధించి​ మొత్తం మీద 2లక్షల యూనిట్​లను అమ్మినట్టు సంస్థ ప్రకటించింది. ఫలితంగా ఏథర్​ ఎనర్జీ మార్కెట్​ వాటాలో అతిపెద్ద పాత్ర పోషిస్తోంది ఈ రిజ్టా ఈ-స్కూటర్​.

Published on: Dec 13, 2025, 07:30:30 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తమ ఫ్యామిలీ ఓరియంటెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ‘రిజ్టా’ అమ్మకాల్లో ఒక పెద్ద మైలురాయిని చేరుకున్నట్లు ప్రకటించింది ఏథర్ ఎనర్జీ సంస్థ. ఈ స్కూటర్ అమ్మకాలు ఇప్పుడు ఏకంగా రెండు లక్షల యూనిట్ల మార్క్‌ను దాటాయి! మే 2025లో మొదటి లక్ష అమ్మకాలను చేరుకున్నప్పటి నుంచి మరో లక్ష సేల్స్ మార్క్​ని టచ్​ చేయడానికి కేవలం ఆరు నెలలే పట్టడం విశేషం​. ఇది దేశవ్యాప్తంగా రిజ్టాకు పెరిగిన ఆదరణను సూచిస్తుంది.

2లక్షల సేల్స్​ మైలురాయిని టచ్​ చేసిన ఏథర్​ రిజ్టా
2లక్షల సేల్స్​ మైలురాయిని టచ్​ చేసిన ఏథర్​ రిజ్టా

ఏప్రిల్ 2024లో విడుదలైన రిజ్టా, ఇంతకు ముందు కేవలం దక్షిణాన ఉన్న ఏథర్ బలమైన మార్కెట్‌ను దాటి, ఇప్పుడు దేశవ్యాప్తంగా తన ఉనికిని విస్తరించడానికి చాలా సహాయపడింది. ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​లో కొత్త రంగులైన టెర్రకోట రెడ్ వంటి వాటిని జోడించడం, 3.7 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీతో 'రిజ్టా ఎస్​' వేరియంట్‌ను ప్రవేశపెట్టడం వంటివి కొత్త మార్కెట్లలో అమ్మకాలు పెరగడానికి దోహదపడ్డాయి. ఈ అప్‌డేట్‌ల కారణంగా డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం ఏథర్ మొత్తం అమ్మకాల్లో రిజ్టా వాటా 70 శాతానికి పైగా ఉంది!

మధ్య భారతంలో మార్కెట్ వాటా పెరుగుదల..

ఏథర్ 'మిడిల్ ఇండియా స్ట్రాటజీ'లో కూడా ఈ స్కూటర్ ముఖ్యపాత్ర పోషించింది! మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల్లో కంపెనీ మార్కెట్ వాటా దాదాపు రెట్టింపు అయ్యింది. 2026 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 7 శాతం నుంచి నవంబర్ 2025 నాటికి మూడొవ త్రైమాసికంలో 14 శాతానికి పెరిగింది. అదే కాలంలో పంజాబ్‌లో 8 శాతం నుంచి 15 శాతానికి, ఉత్తరప్రదేశ్‌లో 4 శాతం నుంచి 10 శాతానికి మార్కెట్ వాటా పెరిగింది.

రిజ్టా ఎలక్ట్రిక్​ స్కూటర్​ జోరుతో, ఏథర్ ఇటీవల భారతదేశంలో 5 లక్షల ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాల మైలురాయిని కూడా దాటినట్లు వాహన్, తెలంగాణ వెహికల్ ఆన్‌లైన్ సేల్స్ డేటా ద్వారా తెలుస్తోంది. రిజ్టా విడుదలైనప్పటి నుంచి, సంస్థ తమ రిటైల్ నెట్‌వర్క్‌ను కూడా వేగంగా విస్తరించింది. సెప్టెంబర్ 30, 2025 నాటికి దేశవ్యాప్తంగా 524 ఎక్స్‌పీరియన్స్ సెంటర్లకు చేరుకుంది.

పంపిణీని విస్తరిస్తాం: ఏథర్..

ఈ మైలురాయిపై ఏథర్ ఎనర్జీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రవ్‌నీత్ సింగ్ ఫోకెలా స్పందించారు. రిజ్టా అద్భుతమైన పనితీరు కారణంగానే కంపెనీ తన కన్జ్యూమర్​ బేస్​ని విస్తరించగలిగిందని, నెట్‌వర్క్‌ను వేగంగా పెంచగలిగిందని ఆయన అన్నారు. రాబోయే నెలల్లో అవైలబులిటీని మెరుగుపరచడంతో పాటు పంపిణీ విస్తరణపై దృష్టి పెడతామని ఆయన హామీ ఇచ్చారు.

ఏథర్​ రిజ్టా ఎలక్ట్రిక్​ స్కూటర్​ ఎస్​- జెడ్​ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. వీటి ఐడీసీ రేంజ్‌లు వరుసగా 123 కి.మీ- 159 కి.మీ. ఈ ఈ-స్కూటర్‌లో విశాలమైన 56 లీటర్ల స్టోరేజ్ సామర్థ్యం ఉంది. ఇందులో 34 లీటర్లు సీటు కింద, అదనంగా 22 లీటర్ల ఫ్రంక్ స్టోరేజ్ (ఆప్షనల్​) ఉంటుంది. సౌకర్యం కోసం స్పేషియస్​ ఫ్లోర్‌బోర్డ్ కూడా అందించారు.

సేఫ్టీ, సౌలభ్యం కోసం ఇందులో స్కిడ్‌కంట్రోల్, ఫాల్ సేఫ్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్, థెప్ట్​- అలెర్ట్‌లు, అలాగే ఏథర్​ స్టాక్​ ప్రోతో కూడిన 'పింగ్ మై స్కూటర్' వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఓటీఏ అప్‌డేట్ ద్వారా రిజ్టా జెడ్​ మోడల్‌కు టచ్‌స్క్రీన్ ఫంక్షనాలిటీని జోడిస్తామని కంపెనీ గతంలో ప్రకటించింది.

పెద్ద రేంజ్​, మంచి ఫీచర్స్​, విశాలవంతమైన సీటింగ్​ కారణంగా ఏథర్​ రిజ్టా ఒక మంచి ఫ్యామిలీ ఎలక్ట్రిక్​ స్కూటర్​గా పేరు సంపాదించుకుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More