2026 కియా సెల్టోస్​ వర్సెస్​ హ్యుందాయ్​ క్రెటా- ఎందులో ఫీచర్స్​ ఎక్కువ?

2026 కియా సెల్టోస్​ వర్సెస్​ హ్యుందాయ్​ క్రెటా- ఈ రెండు ఎస్​యూవీల్లోని టాప్​ వేరియంట్స్​ని పోల్చి ఎందులో ఫీచర్స్​ ఎక్కువ? ఎక్స్​టీరియర్​, ఇంటీరియర్​లో కనిపించే మార్పులు ఏంటి? వంటి వివరాలను ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి. ఇది మీకు కచ్చితంగా ఉపయోగపడుతుంది.

Published on: Dec 12, 2025 10:47 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఇండియాలో బెస్ట్​ సెల్లింగ్​ ఎస్​యూవీగా ఉన్న సెల్టోస్​కి ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ని తీసుకొచ్చింది కియా సంస్థ. ఇప్పటికే ఈ 2026 కియా సెల్టోస్ కోసం బుకింగ్‌లను సైతం ప్రారంభించింది. ఫీచర్లు, ఇతర వివరాలను కూడా వెల్లడించింది. దీని ధరను మాత్రం జనవరి 2న ప్రకటించనుంది.

2026 కియా సెల్టోస్​ వర్సెస్​ హ్యుందాయ్​ క్రెటా
2026 కియా సెల్టోస్​ వర్సెస్​ హ్యుందాయ్​ క్రెటా

ఈ నేపథ్యంలో న్యూ జెన్​ ఎస్‌యూవీ లాంచ్‌కు ముందు, 2026 కియా సెల్టోస్ టాప్-ఎండ్ ట్రిమ్ జీటీఎక్స్​ (ఏ), హ్యుందాయ్ క్రెటా టాప్-ఎండ్ ట్రిమ్ క్రెటా కింగ్ మోడళ్ల ఫీచర్లను పోల్చి చూద్దాము. ఈ రెండు మోడళ్లతో వినియోగదారులకు ఏం లభిస్తుందో తెలుసుకుందాము..

2026 కియా సెల్టోస్​ వర్సెస్​ హ్యుందాయ్​ క్రెటా- ఎక్స్​టీరియర్​..

రెండు ఎస్‌యూవీల టాప్ ట్రిమ్‌లు ఎక్స్​టీరియర్​ ఫీచర్ల పరంగా చాలా పోలికలను కలిగి ఉన్నాయి. అదే సమయంలో కొన్ని ముఖ్యమైన తేడాలు ఉన్నాయి:

2026 కియా సెల్టోస్​ జీటీఎక్స్​ (ఏ)హ్యుందాయ్​ క్రెటా కింగ్​
హెడ్​లైట్స్​మల్టీ-బీమ్​ ఎల్​ఈడీమల్టీ- బీమ్​ ఎల్​ఈడీ
ఎల్​ఈడీ డీఆర్​ఎల్స్​ఉన్నాయిఉన్నాయి
ఫాగ్​ లైట్స్​ఉన్నాయిలేవు
టెయిల్​ లైట్స్​ఎల్​ఈడీఎల్​ఈడీ
పడిల్​ ల్యాంప్స్​లేవుఉన్నాయి
సీక్వెన్షియల్​ ఇండికేటర్స్​లేవుఉన్నాయి
ఆటోమెటిక్​ హెడ్​లైట్స్​ఉన్నాయిఉన్నాయి
ఆటోమెటిక్​ వైపర్స్​ఉన్నాయిఉన్నాయి
ఎలక్ట్రికల్లీ అడ్జెస్టెబుల్​ ఓఆర్​వీఎంలుఉన్నాయిఉన్నాయి
వీల్స్​18 ఇంచ్​ అలాయ్​18 ఇంచ్​ అలాయ్​
ఫ్లష్​ డోర్​ హ్యాండిల్స్​ఉన్నాయిలేవు
రూఫ్​ రెయిల్స్​ఉన్నాయిఉన్నాయి
రేర్​ స్పాయిలర్​ఉందిఉంద
రిమోట్​ ఇంజిన్​ స్టార్ట్​ఉందిఉంది

ఫాగ్ ల్యాంప్స్: సెల్టోస్‌లో ముందు, వెనుక భాగాల్లో ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి. క్రెటాలో ఈ ఫీచర్ లేదు.

అయితే క్రెటా కింగ్ ఎడిషన్‌లో పడిల్ ల్యాంప్స్, సీక్వెన్షియల్ ఇండికేటర్స్ అందుబాటులో ఉన్నాయి. ఇవి కొత్త సెల్టోస్‌లో లేవు.

డోర్ హ్యాండిల్స్: న్యూ జెన్​ సెల్టోస్ ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్‌ను కలిగి ఉంది. ఇది ప్రీమియం లుక్‌ను ఇస్తుంది. క్రెటాలో మాత్రం ట్రెడిషనల్​ డోర్ హ్యాండిల్స్ ఉన్నాయి.

2026 కియా సెల్టోస్​ వర్సెస్​ క్రెటా- ఇంటీరియర్..

క్యాబిన్ లోపల, కొత్త సెల్టోస్ టాప్-ఎండ్ ట్రిమ్ కొన్ని మెరుగైన సౌకర్యాలను అందిస్తోంది:

2026 కియా సెల్టోస్​ జీటీఎక్స్​ (ఏ)హ్యుందాయ్​ క్రెటా కింగ్​
డిజిటల్​ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​12.3-ఇంచ్​10.25-ఇంచ్​
టచ్​స్క్రన్​ ఇన్​ఫోటైన్​మెంట్​12.3-ఇంచ్​10.25-ఇంచ్​
హెచ్​వీఏసీ స్క్రీన్​5.0-ఇంచ్​లేదు
సీట్​ అప్​హోలిస్ట్రీడ్యూయెల్​ టోన్​ లెథరేట్​డ్యూయెల్​ టోన్​ లెథరేట్​
యాంబియెంట్​ లైటింగ్​64-కలర్​ ఎల్​ఈడీ లైటింగ్​ఉంది
వైరల్​సెల్​ కనెక్టివిటీఉందిఉంది
ఆటోమెటిక్​ క్లైమేట్​ కంట్రోల్​రేర్​ వెంట్స్​తో కూడిన డ్యూయెల్​ జోన్​రేర్​ వెంట్స్​తో కూడిన డ్యూయెల్​ జోన్​
సన్​రూఫ్​డ్యూయెల్​ పేన్​ పానోరమిక్​డ్యూయెల్​ పేన్​ పానోరమిక్​
డ్రైవర్​ సీట్​ అడ్జెస్ట్​మెంట్​లంబర్​ అడ్జెస్ట్​తో పవర్డ్​పవర్డ్​
డ్రైవర్​ సీట్​ మెమొరీ ఫంక్షన్​ఉందిఉంది
వెంటిలేటెడ్​ ఫ్రెంట్​ సీట్స్​ఉన్నాయిఉన్నాయి
స్ల్పిట్​ ఫోల్డింగ్​ రేర్​ సీట్స్​ఉన్నాయి (60:40)ఉన్నాయి (60:40)
రేర్​ ఆర్మ్​రెస్ట్​ఉందిఉంది
రేర్​ సన్​షేడ్స్​ఉందిఉంది
వైర్​లెస్​ ఛార్జింగ్​ఉందిఉంది
ఆడియో సిస్టెమ్​8-స్పీక్​ బోస్​ సిస్టెమ్​8 స్పీక్​ బోస్​ సిస్టెమ్​
పుష్​ బటన్​ స్టార్ట్​ఉందిఉంది
టిల్ట్​ అండ్​ టెలిస్కోపిక్​ స్టీరింగ్​ఉందిఉంది
కనెక్టెడ్​ కార్​ టెక్​కియా కనెక్ట్​హ్యుందాయ్​ బ్లూలింక్​
ఓటీఏ సాఫ్ట్​వేర్​ అప్డేట్​ఉందిఉంది
యూఎస్బీ టైప్​ సీ4 పోర్ట్స్​3 పోర్ట్స్​

కొత్త సెల్టోస్ క్యాబిన్ లోపల పెద్ద స్క్రీన్‌లు, డ్రైవర్ సీటుకు ప్రత్యేకమైన లంబార్ అడ్జస్ట్‌మెంట్ వంటి అంశాలతో క్రెటా కంటే ఆధునిక ఎక్స్​పీరియెన్స్​ని ఇవ్వడానికి ప్రయత్నిస్తోంది. మరోవైపు, క్రెటా ముందు- వెనుక ప్రయాణికులకు ప్రత్యేకంగా డ్యూయల్ వైర్‌లెస్ ఛార్జర్‌లను అందించడం ద్వారా వినియోగదారుల సౌలభ్యంపై దృష్టి పెట్టింది.