సరికొత్త లుక్‌తో 2026 కియా సెల్టోస్: టాప్ 5 ఫీచర్లు ఇవే!
సరికొత్త లుక్‌తో 2026 కియా సెల్టోస్‌ని సంస్థ తాజాగా అవిష్కరించింది. ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ మోడల్స్‌లో ఒకటిగా ఉన్న ఈ సెల్టోస్‌లో కొన్ని కొత్త ఫీచర్స్‌ని సంస్థ తీసుకొచ్చింది. వాటిల్లో టాప్ 5 ఫీచర్లను ఇక్కడ వివరంగా తెలుసుకోండి..
న్యూ జెన్ 2026 కియా సెల్టోస్ పూర్తి స్థాయి మార్పులతో మార్కెట్లోకి అడుగుపెట్టింది. దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ గ్లోబల్ స్టైల్ షీట్ ప్రకారం అప్డేట్ చేసిన డిజైన్‌తో పాటు, ఇందులో ఫీచర్లు పెరిగాయి. అంతేకాదు భద్రత మెరుగుపడింది, క్యాబిన్ (ఇంటీరియర్) పూర్తిగా అప్‌గ్రేడ్ అయ్యింది. ఈ తాజా అప్‌డేట్‌లతో పాత తరం సెల్టోస్ కంటే ఈ కొత్త మోడల్ మరింత ప్రీమియం లుక్‌ను సంతరించుకుంది. జనవరి 2న లాంచ్ (Launch) కానున్న ఈ 2026 కియా సెల్టోస్ మోడల్‌లో ఉన్న టాప్ 5 ఫీచర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాము..

2026 కియా సెల్టోస్- 5 కీలక ఫీచర్లు..
1. ట్రాక్షన్ మోడ్స్-
నిజమైన ఆఫ్-రోడర్ కాకపోయినా, కొత్త ట్రాక్షన్ మోడ్స్ కారణంగా 2026 కియా సెల్టోస్ కష్టతరమైన భూభాగాలను మరింత సమర్థవంతంగా ఎదుర్కోగలదు. ఈ మోడల్‌లో ముఖ్యంగా మూడు రకాల సెట్టింగ్‌లు ఉన్నాయి:
స్నో: మంచుతో కూడిన రోడ్లపై మెరుగైన పట్టు కోసం.
మడ్: బురదలో వాహనం జారిపోకుండా నిరోధించడానికి.
సాండ్: ఇసుక నేలపై స్థిరత్వాన్ని పెంచడానికి.
ఇది ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఈఎస్సీ), నాలుగు చక్రాలకు డిస్క్ బ్రేకులు, 360-డిగ్రీ కెమెరాతో కూడిన సరౌండ్ వ్యూ మానిటర్ వంటి అధునాతన భద్రతా ఫీచర్లతో కలిసి, ఈ కొత్త తరం సెల్టోస్‌ను మరింత నమ్మదగిన ప్యాకేజీగా మార్చింది.
2. ట్రినిటీ పనోరమిక్ డిస్‌ప్లే-
కొత్త సెల్టోస్ ఎస్‌యూవీలో ఇన్ఫోటైన్‌మెంట్, డిజిటల్ క్లస్టర్ కోసం ఒక ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ సెటప్‌ను ఏర్పాటు చేశారు. దీన్నే ట్రినిటీ పనోరమిక్ డిస్‌ప్లే అని పిలుస్తున్నారు. ఈ సెటప్‌ను కియా ‘సైరోస్’ మోడల్ నుంచి తీసుకున్నారు.
ఇది డిజిటల్ క్లస్టర్, ఇన్ఫోటైన్‌మెంట్ కోసం రెండు పెద్ద 12.3-ఇంచ్ ప్యానెల్స్‌ను కలిగి ఉంది.
వీటి మధ్యలో 5-ఇంచ్ హెచ్‌వీఏసీ టచ్ ప్యానెల్ ఉంటుంది.
ఈ డిస్‌ప్లే వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్ల్ను సపోర్ట్ చేస్తుంది.
లేటెస్ట్ గ్రాఫికల్ ఇంటర్‌ఫేస్ కారణంగా యూజర్ ఎక్స్‌పీరియెన్స్ మరింత మెరుగ్గా ఉంటుంది.
3. 10-వే పవర్డ్ డ్రైవర్ సీటు-
2026 కియా సెల్టోస్ జీటీఎక్స్ వేరియంట్‌లో, డ్రైవర్‌కు అత్యంత సౌకర్యవంతమైన 10-వే పవర్ అడ్జెస్టెబుల్ సీటు లభిస్తుంది. దీనికి లంబార్ అడ్జెస్టెబిలిటీ (నడుము సపోర్ట్), మెమరీ సెట్టింగ్స్ ఉన్నాయి. కియా ఇందులో రిలాక్సేషన్ ఫీచర్‌ను కూడా జోడించింది.
అంతేకాకుండా, 3-స్టెప్ వెంటిలేషన్ ఫీచర్ కూడా ఉంది. ఇది వేసవిలో కూడా డ్రైవర్‌కు చల్లని అనుభూతినిస్తుంది.
4. 21 ఫీచర్లతో లెవెల్-2 అడాస్ భద్రత-
అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (అడాస్) లెవెల్-2 ను 2026 సెల్టోస్ తీసుకువచ్చింది. అయితే, ఈ భద్రతా ప్యాకేజీ కేవలం హెచ్‌టీఎక్స్ (ఏ), జీటీఎక్స్ (ఏ) వేరియంట్‌లకు మాత్రమే పరిమితం. ఇందులో మొత్తం 21 అటానమస్ ఫీచర్లు ఉన్నాయి.
- కొలిజన్ అలర్ట్ సిస్టెమ్
- లేన్ డ్రైవింగ్ ఎయిడ్స్.
- డ్రైవర్ అటెన్షన్ డిటెక్షన్.
- బ్లైండ్ స్పాట్ మానిటరింగ్‌తో కూడిన 360-డిగ్రీ కెమెరా .
- స్టాప్ అండ్ గో ఫంక్షన్‌తో స్మార్ట్ క్రూయిజ్ కంట్రోల్.
ఇది ప్రామాణిక భద్రతా ఫీచర్లతో పాటు వస్తుంది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్, బ్రేక్ అసిస్ట్, ఈఎస్సీ, డౌన్‌హిల్ బ్రేక్ కంట్రోల్, రేర్ వ్యూ కెమెరా వంటి ముఖ్యమైన భద్రతా ఫీచర్లు అన్ని వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి.
5. ముందు, వెనుక భాగాల కోసం డాష్‌క్యామ్‌లు-
మన రోడ్లపై ట్రాఫిక్, డ్రైవింగ్ తీరును దృష్టిలో ఉంచుకుని, కియా సంస్థ డాష్‌క్యామ్‌లకు బాగా ప్రాధాన్యత పెరిగింది. కొత్త కియా సెల్టోస్ ఏకంగా రెండు డాష్‌క్యామ్‌లను అందిస్తోంది.
ఈ డ్యూయల్ డాష్‌క్యామ్‌లు కారు ముందు, వెనుక భాగాల దృశ్యాలను రికార్డ్ చేస్తాయి. ఇవి ప్రమాదాలు జరిగినప్పుడు లేదా ఏదైనా సంఘటన జరిగినప్పుడు ముఖ్యమైన సాక్ష్యాలను అందిస్తాయి.
మార్కెట్‌లో చాలా ఎంపికలు ఉన్నప్పటికీ, తయారీదారు నేరుగా ఫ్యాక్టరీ నుంచి ఈ ఫీచర్‌ను ఇవ్వడం వినియోగదారులకు మరింత సౌలభ్యం.

E-Paper












