Best cars under 5 lakh : బడ్జెట్లో కారు కొనాలా? వీటి ధర తక్కువ- మైలేజ్ ఎక్కువ!
బడ్జెట్ ఫ్రెండ్లీ కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే! దేశంలో రూ. 5లక్షల ధరలోపు అందుబాటులో ఉన్న కొన్ని అఫార్డిబుల్ మోడల్స్, వాటి మైలేజ్, వాటి ఫీచర్స్ వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
సొంతింటితో పాటు సొంతంగా ఒక కారు కొనుగోలు చేయాలనేది చాలా మంది భారతీయులకు ఉండే ఒక కోరిక! ఇందుకోసం రూపాయి రూపాయి కూడబెట్టుకుంటూ, ఏదో ఒక రోజు సొంతంగా కారు కొనాలని ప్లాన్ చేస్తుంటారు. అయితే 4 వీలర్ కొనాలంటే ఇప్పుడు భారీగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు! తక్కువ ధరకే మంచి మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. మీరు ఒకవేళ బడ్జెట్లో కారు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే ఇది మీకు కచ్చితంగా ఉపయోగపడుతుంది. దేశంలో రూ. 5లక్షల (ఎక్స్‌షోరూం) కన్నా తక్కువ ధరకు లభిస్తున్న కొన్ని బెస్ట్ ఆప్షన్స్‌ని ఇక్కడ తెలుసుకుందాము..

రూ. 5లక్షల ధరలోపు బెస్ట్ కార్లు..
టాటా టియాగో: 2025లో మోస్ట్ ఆఫార్డిబుల్ కార్లలో ఈ టాటా టియాగో ఒకటి. బిల్డ్ క్వాలిటీకి, సేఫ్టీకి టియాగో పెట్టింది పేరు! టాటా టియాగో ప్రారంభ ఎక్స్‌షోరూం ధర రూ. 4.57లక్షలు.
ఇందులో 1199 సీసీ ఇంజిన్ ఉంటుంది. ఇది 74.41 హెచ్‌పీ పవర్, 96.5 ఎన్ఎం టార్క్‌ని జనరేట్ చేస్తుంది. టాటా టియాగో మైలేజ్ 19-19.01 కేఎంపీఎల్!
గ్లోబల్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్‌లో ఈ టాటా టియాగోకి 4 స్టార్ రేటింగ్ లభించింది.
టాటా టియాగో బేస్ వేరియంట్ ‘ఎక్స్ఈ’లో డ్యూయెల్ డాష్‌బోర్డు, డిజిటల్ క్లస్టర్, ఏసీ, పవర్ స్టీరింగ్, హీటర్, సీట్ బెల్ట్ వార్నింగ్, రేర్ పార్కింగ్ సెన్సార్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.
మారుతీ సుజుకీ వాగన్ఆర్: మారుతీ సుజుకీకి ఉన్న బెస్ట్ సెల్లింగ్ బడ్జెట్ కార్లలో ఈ వాగన్ఆర్ ఒకటి. దీని ప్రారంభ ఎక్స్‌షోరూం ధర రూ. 4.99లక్షలు.
మారుతీ సుజుకీ వాగన్ఆర్లో రెండు పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇవి 998సీసీ- 1197సీసీ ఇంజిన్లు. ఇవి వరుసగా 55.9 హెచ్‌పీ పవర్- 88.5 హెచ్‌పీ పవర్‌ని, 82.1- 113 ఎన్ఎం టార్క్‌ని జనరేట్ చేస్తుంది.
దేశంలో అధిక మైలేజ్‌ని ఇస్తున్న వాహనాల్లో ఈ వాగన్ఆర్ ఒకటి అనడంలో సందేహం లేది. దీని మైలేజ్ 23.5- 25.19 కేఎంపీఎల్ మధ్యలో ఉంటుంది.
ఇందులో డ్యూయెల్ టోన్ డాష్‌బోర్డు, ఏసీ వంటివి ఉన్నాయి. హీటర్, రేర్ పార్కింగ్ సెన్సార్, పవర్ సీటర్ వంటి ఫీచర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
మారుతీ సుజుకీ ఆల్టో కే10: దేశంలోని బడ్జెట్ కార్ల గురించి మాట్లాడుతూ, మారుతీ సుజుకీ ఆల్టో కే10 గురించి ప్రస్తావించకపోతే ఎలా? ఇండియాలో అత్యధికంగా అమ్ముడుపోతున్న వాహనాల్లో ఇదీ ఒకటి. దీని ప్రారంభ ఎక్స్‌షోరూం ధర రూ. 3.70లక్షలు. సాధారణంగా, మొదటిసారు కారు కొనాలని చూసే వారు దీనిని ప్రిఫర్ చేస్తుంటారు.
ఈ ఆల్టో కే10లో రెండు 998 సీసీ పెట్రోల్ ఇంజిన్ ఉంటాయి. ఇవి వరుసగా 55.92- 65.71 హెచ్‌పీ పవర్‌ని, 82.1 ఎన్ఎం- 89 ఎన్ఎం టార్క్‌ని జనరేట్ చేస్తాయి. ఆల్టో కే10 మైలేజ్ 24.39- 24.9 కేఎంపీఎల్ మధ్యలో ఉంటుంది.
మారుతీ సుజుకీ ఆల్టో కే10 బేస్ వేరియంట్ “ఎస్టీడీ”లో రేర్ పార్కింగ్ సెన్సార్, గ్లోవ్ బాక్స్, ఓఆర్వీఎం వంటి ఫీచర్స్ ఉన్నాయి.
వీటితో పాటు రెనాల్ట్ క్విడ్, మారుతీ సెలేరియో, మారుతీ ఎస్-ప్రెస్సో వంటి మోడల్స్ కూడా రూ. 5లక్షల లోపు ఎక్స్‌షోరూం ధరలతో లభిస్తున్నాయి.
కారును కొనుగోలు చేసే ముందు మీరు మీ సమీపంలోని షోరూమ్‌ని సందర్శించడం ఉత్తమం. వెహికిల్ టెస్ట్ డ్రైవ్‌తో పాటు ఆ సమయంలో ఏవైనా ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయా? అన్నది తెలుస్తుంది. అది మీ బడ్జెట్‌కి కూడా ఉపయోగపడుతుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper












