2026 కియా సెల్టోస్ బేస్ వేరియంట్లోనే అదిరిపోయే ఫీచర్లు..
కియా మోటార్స్ తన నెక్ట్స్ జనరేషన్ 'సెల్టోస్' ధరలను జనవరి 2, 2026న ప్రకటించనుంది. అయితే బ్రోచర్ ద్వారా బయటకు వచ్చిన సమాచారం ప్రకారం.. ఈసారి బేస్ వేరియంట్లోనే కనీవినీ ఎరుగని రేంజ్‌లో అద్భుతమైన ఫీచర్లను కియా అందిస్తోంది. అవేంటంటే..
భారతీయ ఎస్‌యూవీ మార్కెట్లో సెన్సేషన్ సృష్టించిన కియా సెల్టోస్, సరికొత్త హంగులతో మన ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. 2026 కియా సెల్టోస్‌ని సంస్థ ఇటీవలే ప్రదర్శించింది. ఇక 2026 జనవరి 2న ఈ న్యూ-జనరేషన్ సెల్టోస్ ధరలను కంపెనీ అధికారికంగా వెల్లడించనుంది. అయితే లాంచ్‌కు ముందే విడుదలైన బ్రోచర్ ద్వారా ఈ ఎస్‌యూవీకి సంబంధించిన అనేక కీలక విషయాలు బయటకు వచ్చాయి. మరీ ముఖ్యంగా కియా సేల్టోస్ ఫేస్‌లిఫ్ట్ బేస్ వేరియంట్‌పై మంచి బజ్ నెలకొంది.

సాధారణంగా ఏ కారుకైనా బేస్ వేరియంట్ అంటే కేవలం అవసరమైన ఫీచర్లు మాత్రమే ఉంటాయని అనుకుంటారు. కానీ కియా సెల్టోస్ 'హెచ్‌టీఈ' వేరియంట్ మాత్రం ఇందుకు భిన్నంగా నిలబడనున్నట్టు కనిపిస్తోంది.
2026 కియా సెల్టోస్ బేస్ వేరియంట్లో అదిరిపోయే ఫీచర్లు..
తక్కువ బడ్జెట్‌లో మంచి కారు కొనాలనుకునే వారికి సెల్టోస్ హెచ్‌టీఈ బేస్ వేరియంట్ ఒక వరంలా మారనుంది. ఇందులో లభించే కొన్ని కీలక ఫీచర్లను ఇక్కడ తెలుసుకోండి..
లైటింగ్: ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, డీఆర్ఎల్, టెయిల్ ల్యాంప్స్‌తో పాటు హై మౌంట్ స్టాప్ ల్యాంప్ కూడా ఎల్ఈడీలోనే వస్తోంది.
ఎక్స్‌టీరియర్ అండ్ ఇంటీరియర్: 16 ఇంచ్ స్టీల్ వీల్స్, సిల్వర్ ఫినిషింగ్‌తో కూడిన ఫ్రంట్ అండ్ రియర్ స్కిడ్ ప్లేట్స్, షార్క్ ఫిన్ యాంటెన్నా వంటివి 2026 కియా సెల్టోస్‌కి స్టైలిష్ లుక్ ఇస్తాయి. లోపల స్మోకీ బ్లాక్ అండ్ గ్రే డ్యూయెల్ టోన్ ఇంటీరియర్స్, డబుల్ డీ-కట్ స్టీరింగ్ వీల్ ప్రీమియం ఎక్స్‌పీరియెన్స్‌ని కలిగిస్తాయి.
టెక్నాలజీ: ఆశ్చర్యకరంగా కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ బేస్ మోడల్‌లోనే 10.25 ఇంచ్ హెచ్‌డీ టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే, 6-స్పీకర్ల సౌండ్ సిస్టమ్ వంటివి ఉన్నాయి. దీనితో పాటు 12 ఇంచ్ ఎల్‌సీడీ క్లస్టర్, క్రూయిజ్ కంట్రోల్, కీ-లెస్ ఎంట్రీ వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి.
2026 కియా సెల్టోస్ హెచ్‌టీఈ (ఓ) వేరియంట్..
కాస్త ఎక్కువ ఖర్చు చేయగలిగితే, హెచ్‌టీఈ నెక్ట్స్ వేరియంట్ హెచ్‌టీఈ (ఓ)లో మరిన్ని అదిరే ఫీచర్లను పొందవచ్చు. ఇందులో కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్ లైట్స్, బ్లాక్ రూఫ్ రైల్స్, సెమీ-లెథర్ సీట్లు, రియర్ సెంటర్ ఆర్మ్‌రెస్ట్ వంటి విలాసవంతమైన ఫీచర్లు లభిస్తాయి.
ముఖ్యంగా దీని ఆటోమేటిక్ వెర్షన్‌లో ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, ట్రాక్షన్ కంట్రోల్ మోడ్స్ (మడ్/డస్ట్/స్నో), ప్యాడిల్ షిఫ్టర్లు, మూడు డ్రైవ్ మోడ్లు (ఎకో, నార్మల్, స్పోర్ట్) అదనపు ఆకర్షణలుగా నిలుస్తాయి.
2026 కియా సెల్టోస్- ఇంజిన్ ఆప్షన్లు..
కియా తన కస్టమర్ల కోసం విభిన్నమైన ఇంజిన్ ఆప్షన్లను అందిస్తోంది:
1.5లీటర్ పెట్రోల్: 114బీహెచ్పీ పవర్, 144ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్, సీవీటీ గేర్‌బాక్స్‌తో వస్తుంది.
1.5లీటర్ డీజిల్: 114బీహెచ్పీ పవర్, 250ఎన్ఎం టార్క్ అందిస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్, టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.
1.5లీటర్ టర్బో పెట్రోల్: వేగాన్ని ఇష్టపడే వారి కోసం 157బీహెచ్పీ పవర్, 253ఎన్ఎం టార్క్ ఇచ్చే శక్తివంతమైన ఇంజిన్. ఇది 6-స్పీడ్ ఐఎంటీ గేర్‌బాక్స్‌తో అందుబాటులో ఉంది.
ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ఈ కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్‌తో గట్టి పోటీనిస్తూ, ఫీచర్ల పరంగా కియా తన స్థానాన్ని మరింత పదిలం చేసుకుంటోంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


