మహీంద్రా XUV 7XO.. కొత్త హంగులతో ఫ్యామిలీ ఎస్‌యూవీ! డిజైన్, ఇంటీరియర్ వివరాలు..
కొత్త ఏడాదిలో అదరగొట్టాలని మహీంద్రా పెద్ద ప్లానే వేసింది! ఇందులో భాగంగా బెస్ట్ సెల్లింగ్ ఫ్యామిలీ ఎస్‌యూవీ మహీంద్రా ఎక్స్‌యూవీ700కి ఫేస్‌లిఫ్ట్ వర్షెన్‌ని లాంచ్ చేయనుంది. దీనిని ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ అని సంస్థ పిలుస్తోంది. టెస్ట్ డ్రైవ్‌లో కనిపించిన మోడల్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
భారత ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా కొత్త ఏడాదిని ఘనంగా ప్రారంభించేందుకు సిద్ధమైంది! తన ఫ్లాగ్‌షిప్, బెస్ట్ సెల్లింగ్ ఫ్యామిలీ ఎస్‌యూవీ అయిన ఎక్స్‌యూవీ700ను సరికొత్త హంగులతో మార్కెట్లోకి తీసుకురాబోతోంది! అయితే, ఈసారి కేవలం ఫీచర్లు మాత్రమే కాదు, పేరు కూడా మారుతోంది. గతంలో ఎక్స్‌యూవీ300ను 'ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ'గా మార్చినట్లే, ఇప్పుడు ఎక్స్‌యూవీ700ని 'ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ'గా రీబ్రాండ్ చేస్తోంది. ఈ ఎస్‌యూవీని జనవరి 5న లాంచ్ చేయనుంది. కాగా, లాంచ్‌కి ముందు ఈ మోడల్ భారత రోడ్‌పై దర్శనమిచ్చింది. ఫలితంగా మరిన్ని వివరాలు అందుబాటులోకి వచ్చాయి. వాటిని ఇక్కడ తెలుసుకోండి..

మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ- డిజైన్‌లో కీలక మార్పులు..
ఇటీవల రోడ్ టెస్టింగ్‌లో కనిపించిన ఈ మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ డిజైన్ వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి! ముఖ్యంగా ముందు భాగంలో హెడ్‌లైట్ సెటప్‌ను పూర్తిగా మార్చేశారు. స్కార్పియో-ఎన్ తరహాలో డ్యూయల్ బ్యారెల్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్ రాబోతున్నాయి. డే-టైమ్ రన్నింగ్ లైట్స్ (డీఆర్ఎల్) ఇప్పుడు కిందికి కాకుండా 'యూ' ఆకారంలో సరికొత్తగా కనిపిస్తాయి. గ్రిల్ కూడా పాత ఎక్స్‌యూవీ500ని గుర్తుకు తెచ్చేలా డిజైన్ చేశారు. వెనుక వైపు ఎక్స్‌ఈవీ 9ఎస్ తరహాలో సరికొత్త టెయిల్ ల్యాంప్స్ ఉండనున్నాయి. కొత్త అల్లాయ్ వీల్స్ ఈ ఎస్‌యూవీకి మరింత స్పోర్టీ లుక్ ఇస్తాయి.
మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ- ఇంటీరియర్ ఇప్పుడు మరింత లగ్జరీగా!
కారు లోపల అడుగు పేడితే లగ్జరీ రేంజ్ ఫీచర్లు స్వాగతం పలుకుతాయి! మహీంద్రా ఎక్స్‌యూవీ700లో ప్రస్తుతం ఉన్న రెండు స్క్రీన్ల సెటప్‌కు అదనంగా, ఇప్పుడు ప్రయాణికుల కోసం ప్రత్యేక స్క్రీన్‌ను కూడా జోడించారు. అంటే డ్యాష్‌బోర్డులో మొత్తం మూడు స్క్రీన్లు కనిపించే అవకాశం ఉంది.
బాస్ మోడ్: వెనుక కూర్చునే ప్రయాణికులు తమ లెగ్ రూమ్‌ను పెంచుకోవడానికి ముందు సీటును వెనుక నుంచే అడ్జస్ట్ చేసుకునే 'బాస్ మోడ్' సౌకర్యం ఉంది.
బీవైఓడీ కనెక్టివిటీ: వెనుక సీట్లలో ప్రయాణించే వారు తమ ట్యాబ్లెట్లు లేదా స్మార్ట్‌ఫోన్లను అమర్చుకోవడానికి ప్రత్యేక ఫిక్చర్లు (బీవైఓడీ) ఇచ్చారు.
ప్రీమియం ఫీచర్లు: 2 స్పోక్ స్టీరింగ్ వీల్, డాల్బీ అట్మాస్ ఆడియో సిస్టమ్, రెండో వరుసలో కెప్టెన్ సీట్లు, వెంటిలేటెడ్ సీట్లు వంటి ప్రీమియం ఫీచర్లు ఈ మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓలో ఉండబోతున్నాయి. ప్రైవసీ కోసం వెనుక విండోలకు కర్టెన్లు కూడా ఇస్తున్నారు!
మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ- ఇంజిన్, పర్ఫార్మెన్స్..
ఇంజిన్ విషయానికి వస్తే పెద్దగా మార్పులు కనిపించడం లేదు. ప్రస్తుతం ఉన్న 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్, 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లతోనే కొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ కూడా వస్తుందని అంచనాలు ఉన్నాయి. అయితే పెట్రోల్ ఇంజిన్‌లో మైలేజీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక డ్రైవింగ్ మోడ్స్ ఇచ్చే అవకాశం ఉంది. 6-స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో పాటు ఆల్-వీల్ డ్రైవ్ (ఏడబ్ల్యూడీ) వేరియంట్లు కూడా అందుబాటులో ఉంటాయి.
మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ ప్రీ-బుకింగ్స్ ఈ నెల 15న మొదలయ్యాయి. మహీంద్రా వెబ్సైట్ లేదా డీలర్షిప్ షోరూమ్స్‌లో కస్టమర్లు బుక్ చేసుకోవచ్చు.
మొత్తానికి.. కొత్త పేరుతో, సరికొత్త హంగులతో వస్తున్న 'మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ' మార్కెట్లో మళ్లీ ప్రకంపనలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


