మధ్యతరగతి ప్రజల లగ్జరీ కారు.. మహీంద్రా XUV 7XO ఎస్​యూవీ లాంచ్​

మహీంద్రా తన అత్యంత ప్రజాదరణ పొందిన'ఎక్స్​యూవీ 700'ను కొత్త హంగులతో, సరికొత్త పేరుతో 'ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ'గా భారత మార్కెట్​లోకి విడుదల చేసింది. అధునాతన టెక్నాలజీ, ప్రీమియం ఇంటీరియర్స్‌తో వచ్చిన ఈ కారు ధరలు, ఫీచర్లు, డెలివరీ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Updated on: Jan 6, 2026, 05:33:17 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మహీంద్రా అండ్ మహీంద్రా తన పవర్‌ఫుల్ ఎస్​యూవీ పోర్ట్‌ఫోలియోను మరింత బలోపేతం చేస్తూ.. సరికొత్త ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓను లాంచ్ చేసింది. ఇది ఇండియాలో బెస్ట్​ సెల్లింగ్​ ఫ్యామిలీ ఎస్​యూవీల్లో ఒకటైన ఎక్స్​యూవీ 700కి ఫేస్‌లిఫ్ట్ వెర్షన్. ఇప్పటికే ఎక్స్​యూవీ 300ను ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓగా మార్చిన సంస్థ.. ఇప్పుడు అదే బాటలో తన ఫ్లాగ్‌షిప్ ఎస్​యూవీ పేరును కూడా మార్చేసింది. ఈ నేపథ్యంలో ఈ మహీంద్రా ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓకి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

మహీంద్రా ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ..
మహీంద్రా ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ..

మహీంద్రా ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ- ధర, బుకింగ్ వివరాలు..

ఈ సరికొత్త మహీంద్రా ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ ఎస్​యూవీ ధర రూ. 13.66 లక్షల నుంచి రూ. 22.47 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉంది. అయితే, ఈ ప్రారంభ ధరలు కేవలం మొదటి 40,000 మంది కస్టమర్లకు మాత్రమే వర్తిస్తాయని కంపెనీ స్పష్టం చేసింది.

టెస్ట్ డ్రైవ్: జనవరి 8, 2026 నుంచి ప్రారంభం.

బుకింగ్స్: డిసెంబర్​లోనే బుకింగ్స్​ ఓపెన్​ అయ్యాయి.

డెలివరీ: టాప్​ ఎండ్​ వేరియంట్లను ముందుగా బుక్ చేసుకున్న వారికి (ఏఎక్స్​7, ఏఎక్స్​7టీ, ఏఎక్స్​7ఎల్​ వేరియంట్లు) జనవరి 14 నుంచే డెలివరీలు మొదలవుతాయి. తక్కువ ధర వేరియంట్లు (ఏఎక్స్​, ఏఎక్స్​3, ఏఎక్స్​5) మాత్రం ఏప్రిల్ 2026 నుంచి అందుబాటులోకి వస్తాయి.

మహీంద్రా ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ- డిజైన్‌లో కీలక మార్పులు..

చూడగానే కట్టిపడేసేలా ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓను మహీంద్రా తీర్చిదిద్దింది. దీని ముందు భాగంలో కొత్త హెడ్‌ల్యాంప్స్, స్టైలిష్ ఎల్​ఈడీ డీఆర్​ఎల్, సరికొత్త గ్రిల్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. బంపర్ కూడా మరింత షార్ప్‌గా మారి, కొత్త ఫాగ్ ల్యాంప్స్‌తో ఆకట్టుకుంటోంది. వెనుక భాగంలో హెక్సాగోనల్ ప్యాటర్న్ కలిగిన సరికొత్త టెయిల్ ల్యాంప్స్ దీనికి ప్రీమియం లుక్ ఇస్తున్నాయి. పక్క నుంచి చూస్తే, కొత్తగా డిజైన్ చేసిన 19-ఇంచ్​ అల్లాయ్ వీల్స్ మునుపటి కంటే ఇంకాస్త స్పోర్టీగా కనిపిస్తాయి.

మహీంద్రా ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ- హార్డ్‌వేర్ అండ్​ సేఫ్టీ..

మహీంద్రా ఈసారి కేవలం లుక్ మీద మాత్రమే కాదు, కారు పెర్ఫార్మెన్స్‌పై కూడా దృష్టి పెట్టింది.

డావిన్సీ డాంపర్: గతుకుల రోడ్లపై కూడా సాఫీగా ప్రయాణించేలా సస్పెన్షన్ సెటప్‌ను మెరుగుపరిచారు.

అప్‌గ్రేడెడ్ అడాస్​: భద్రత విషయంలో రాజీ పడకుండా, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (అడాస్​)ను అప్‌గ్రేడ్ చేశారు. మెరుగైన రాడార్, కెమెరాల వల్ల డ్రైవింగ్ ఇప్పుడు మరింత సురక్షితం.

మహీంద్రా ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ- ఇంటీరియర్ ఫీచర్లు..

కారు లోపల అడుగుపెడితే ఒక లగ్జరీ కార్లో కూర్చున్న అనుభూతి కలుగుతుంది.

ట్రిపుల్ స్క్రీన్ మ్యాజిక్: ఇందులో మూడు 12.3-ఇంచ్​ స్క్రీన్లు ఉన్నాయి. డ్రైవర్ కోసం డిజిటల్ క్లస్టర్, మధ్యలో ఇన్ఫోటైన్‌మెంట్, మొదటిసారిగా ప్యాసింజర్ కోసం ప్రత్యేక డిస్‌ప్లేను అందించారు.

ఎంటర్టైన్మెంట్: 16 స్పీకర్లతో కూడిన హర్మాన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్, డాల్బీ అట్మోస్, డాల్బీ విజన్ సపోర్ట్ వంటి ఫీచర్లు మీ ప్రయాణాన్ని మ్యూజికల్ థియేటర్‌లా మారుస్తాయి.

ఏఐ ఇంటిగ్రేషన్: మహీంద్రా ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓలో అలెక్సాతో పాటు చాట్​జీపీటీ ఫీచర్‌ను కూడా జోడించారు.

కంపర్ట్: ఫ్రంట్ సీట్లకు వెెంటిలేషన్, మెమరీ ఫంక్షన్, వెనుక సీట్లకు కూడా వైర్‌లెస్ ఛార్జింగ్, కూలింగ్ ఫెసిలిటీ ఉన్నాయి. సన్‌రూఫ్‌కు కూడా యూవీ ప్రొటెక్షన్ ఇచ్చారు.

మహీంద్రా ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ- ఇంజిన్ సామర్థ్యం..

ఇంజిన్ పరంగా పాత ఎక్స్​యూవీ 700 లోని పవర్‌ఫుల్ ఆప్షన్లనే కొనసాగించారు.

2.0-లీటర్ టర్బో-పెట్రోల్

2.2-లీటర్ డీజిల్ ఈ రెండు ఇంజిన్లకు మాన్యువల్, ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. టాప్ ఎండ్ మోడల్స్‌లో ఆల్​ వీల్​ డ్రైవ్​ (ఏడబ్ల్యూడీ) సదుపాయం కూడా లభిస్తుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More