మహీంద్రా XUV 7XO లాంచ్ రేపే- బెస్ట్ సెల్లింగ్ ఫ్యామిలీ ఎస్‌యూవీ అవుతుందా?
మహీంద్రా నుంచి మోస్ట్ అవైటెడ్ ఎస్‌యూవీ 'ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ' రేపు (జనవరి 5న) విడుదల కానుంది. ఎక్స్‌యూవీ700కి ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌గా వస్తున్న ఈ కారులో ట్రిపుల్ స్క్రీన్ సెటప్, అడ్వాన్స్‌డ్ ఏడాస్ వంటి విప్లవాత్మక మార్పులు ఉండనున్నాయి.
మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో పోటీని మరో స్థాయికి తీసుకెళుతూ, మహీంద్రా తన సరికొత్త ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓను రేపు (జనవరి 5) మార్కెట్లోకి ప్రవేశపెట్టబోతోంది. గతంలో ఎక్స్‌యూవీ500, ప్రస్తుతం ఎక్స్‌యూవీ700గా మనకు సుపరిచితమైన మోడల్‌కు ఇది అత్యాధునిక 'ఫేస్‌లిఫ్ట్' వెర్షన్. ఇప్పటికే టీజర్లతో అంచనాలను పెంచేసిన మహీంద్రా, సోమవారం ఈ కారు పూర్తి ధరలను, ఫీచర్లను అధికారికంగా వెల్లడించనుంది.

మీరు ఈ కొత్త ఫ్యామిలీ ఎస్‌యూవీని కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే లాంచ్‌కు ముందే ఈ ఎస్‌యూవీకి సంబంధించిన ముఖ్యమైన విషయాలను ఇక్కడ తెలుసుకోండి..
మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ..
1. ఎక్స్‌టీరియర్: మరింత పవర్‌ఫుల్ లుక్..
మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ డిజైన్ చాలా బోల్డ్‌గా, స్టైలిష్‌గా ఉండబోతోంది.
ముందు భాగం: రీడిజైన్ చేసిన సరికొత్త గ్రిల్, దాని పైభాగంలో స్లీక్ ఎల్‌ఈడీ డే-టైమ్ రన్నింగ్ లైట్లు ఉంటాయి. ఇందులో కొత్త డ్యూయల్-పాడ్ ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, అగ్రెసివ్ బంపర్ ఉండనున్నాయి.
దీని లుక్ ఇటీవలే విడుదలైన ఎక్స్ఈవీ 9ఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ పోలి ఉంటుంది.
సైడ్ అండ్ రియర్: కొత్తగా డిజైన్ చేసిన 18-ఇంచ్ అలాయ్ వీల్స్, బాడీలోకి కలిసిపోయే 'ఫ్లష్' డోర్ హ్యాండిల్స్ ఆకర్షణీయంగా ఉంటాయి. వెనుక వైపు కనెక్టెడ్ ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్స్, రూఫ్ స్పాయిలర్, షార్క్-ఫిన్ యాంటెన్నా ఈ కారుకు ప్రీమియం లుక్ ఇస్తాయి. టీజర్లలో చూపిన విధంగా 'ఎక్స్ఈవీ 9ఎస్' తరహాలోనే సరికొత్త 'రెడ్' కలర్ వేరియంట్ రాబోతోంది.
2. ఇంటీరియర్: లగ్జరీ అండ్ టెక్నాలజీ..
ఎక్స్‌యూవీ 700తో పోలిస్తే ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ క్యాబిన్ మరింత ఆధునికంగా ఉంటుంది.
ట్రిపుల్ స్క్రీన్ సెటప్: ఈ ఎస్‌యూవీ డాష్‌బోర్డ్‌లో మూడు స్క్రీన్లు ఉంటాయి. ఒకటి ఇన్‌ఫోటైన్‌మెంట్ కోసం, రెండోది డ్రైవర్ డిస్‌ప్లే, మూడోది కారులోని ఇతర ఫంక్షన్లను నియంత్రించేందుకు ప్రత్యేకంగా ఉంటుంది.
కొత్త స్టీరింగ్: సరికొత్త లోగోతో కూడిన 'టూ-స్పోక్' ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ ప్రయాణాన్ని మరింత సుఖతరం చేస్తుంది. వైట్ థీమ్ వల్ల క్యాబిన్ లోపల చాలా విశాలంగా అనిపిస్తుంది.
3. అదిరిపోయే ఫీచర్లు..
ఫీచర్ల విషయంలో మహీంద్రా ఈసారి కూడా ఎక్కడా తగ్గలేదు.
12.3 ఇంచ్ టచ్‌స్క్రీన్, పనోరమిక్ సన్‌రూఫ్, 16-స్పీకర్ల హార్మన్ కార్డన్ ఆడియో సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
మెమరీ ఫంక్షన్‌తో కూడిన పవర్డ్ సీట్లు, వెన్లటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జింగ్ సదుపాయం ఈ మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ ఎస్‌యూవీలో ఉంటుంది.
వెనుక సీటు ప్రయాణికుల కోసం కూడా వెన్లటిలేషన్, వైర్‌లెస్ ఛార్జర్, ‘బ్రింగ్ యువర్ ఓన్ డివైజ్’ ఫీచర్లను అందిస్తున్నారు.
4. భద్రత: ఏ విషయంలోనూ రాజీ లేదు..
సేఫ్టీకి మారుపేరుగా నిలిచే మహీంద్రా ఈ ఫ్యామిలీ ఎస్‌యూవీలో 7 ఎయిర్‌బ్యాగ్‌లు (6 స్టాండర్డ్), ఈఎస్‌సీ, హిల్ హోల్డ్ అసిస్ట్‌లను అందిస్తోంది. టాప్ వేరియంట్లలో 540-డిగ్రీ కెమెరాతో పాటు అడ్వాన్స్‌డ్ అడాస్ లెవల్-2 ఉంటుంది. దీనివల్ల అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి సదుపాయాలు లభిస్తాయి.
5. అంచనా ధర..
మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 15 లక్షల నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. రేపటి లాంచ్‌తో దీనిపై క్లారిటీ వస్తుంది.
ఇప్పటికే రూ. 21,000 టోకెన్ అమౌంట్‌తో బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.
ఈ ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ.. మార్కెట్లో టాటా సఫారీ, మహీంద్రా స్కార్పియో-ఎన్, హ్యుందాయ్ అల్కాజార్, ఎంజీ హెక్టర్ ప్లస్ వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


