ఇంకొన్ని రోజుల్లో మహీంద్రా XUV 7XO లాంచ్​.. కొనాలా? వద్దా?

కొత్త ఏడాదిలో ఎస్‌యూవీ కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? మహీంద్రా అండ్​ మహీంద్రా సంస్థ 'XUV 7XO' ని మీ ముందుకు తీసుకొస్తోంది. ఈ ఎస్​యూవీకి సంబంధించిన పలు కీలక ఫీచర్స్​, ముఖ్యమైన వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Dec 31, 2025, 11:00:41 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మీరు 2026 జనవరిలో కొత్త ఎస్‌యూవీ కొనే ఆలోచనలో ఉన్నారా? అయితే మార్కెట్లో మీకు చాలా ఆప్షన్లు సిద్ధంగా ఉన్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెనాల్ట్ డస్టర్ రీ-ఎంట్రీ ఇస్తోంది. పర్యావరణంపై మక్కువ ఉంటే మారుతీ సుజుకీ నుంచి ‘ఈ విటారా’ ఎలక్ట్రిక్ కారు కూడా వస్తోంది. టాటా సియెర్రా బుకింగ్స్​ ఇప్పటికే ప్రారంభమయ్యాయి, హారియర్, సఫారి పెట్రోల్ మోడల్స్ డెలివరీలు కూడా జనవరి నుంచే మొదలుకానున్నాయి.

మహీంద్రా ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ..
మహీంద్రా ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ..

అయితే, వీటన్నింటి మధ్య మహీంద్రా తన పాపులర్ ఎస్‌యూవీ ఎక్స్​యూవీ 700ని సరికొత్త హంగులతో 'ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ' పేరుతో లాంచ్ చేస్తోంది. మునుపటి కంటే మెరుగైన డిజైన్, లగ్జరీ ఇంటీరియర్స్, హై-టెక్ సేఫ్టీ ఫీచర్లతో ఇది రాబోతోంది. మరి ఈ కారు కొనాలా? వద్దా? కొన్ని కీలక విషయాలను ఇక్కడ తెలుసుకోండి..

మహీంద్రా ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ- సరికొత్త లుక్.. అదిరిపోయే డిజైన్

ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ చూడటానికి పాత ఎక్స్​యూవీ 700 మాదిరిగానే ఉన్నప్పటికీ, దీని ఎక్స్​టీరియర్​లో కీలక మార్పులు చేశారు. మహీంద్రా అప్ కమింగ్ ఎలక్ట్రిక్ కార్ల డిజైన్ శైలిని దీనికి జోడించారు. ముఖ్యంగా కొత్త ఎల్ఈడీ లైటింగ్ యూనిట్లు, స్టైలిష్ అలాయ్ వీల్స్‌తో ఈ కారు మరింత ఫ్రెష్‌గా కనిపించనుంది.

మహీంద్రా ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ- లగ్జరీ ఇంటీరియర్.. మూడు స్క్రీన్ల మ్యాజిక్!

ఈ మహీంద్రా ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ కారు లోపల అడుగుపెడితే మీకు ఒక ప్రీమియం ఫీలింగ్ కలుగుతుంది. డ్యాష్‌బోర్డ్‌పై ఏకంగా మూడు స్క్రీన్లు ఉంటాయి. డ్రైవర్, మధ్యలో ఉండే ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌తో పాటు పక్కన కూర్చునే ప్యాసింజర్ కోసం ప్రత్యేకంగా మరో స్క్రీన్‌ను కేటాయించారు.

బాస్ మోడ్: ఈ ఎస్​యూవీ వెనుక సీట్లో కూర్చునే వారు తమకు కావలసినంత లెగ్‌రూమ్ కోసం ముందు సీట్లను ఎలక్ట్రికల్ బటన్ ద్వారా అడ్జస్ట్ చేసుకోవచ్చు.

మౌంటింగ్ పాయింట్లు: వెనుక ప్యాసింజర్ల కోసం తమ సొంత స్క్రీన్లను అమర్చుకునేలా 'బీవైఓడీ' (బ్రింగ్​ యువర్​ ఓన్​ డిస్​ప్లే) సదుపాయం కల్పించారు.

కొత్త స్టీరింగ్: టూ-స్పోక్ స్టీరింగ్ వీల్ మీద మహీంద్రా లోగో వెలుగుతూ అద్భుతంగా ఉంటుంది.

మహీంద్రా ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ- అదిరిపోయే ఫీచర్లు.. భద్రతలో మేటి

వెంటిలేటెడ్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్, మల్టీ-కలర్ యాంబియంట్ లైటింగ్ వంటి సౌకర్యాలతో పాటు ఈ మహీంద్రా ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ ఎస్​యూవీలో భద్రతకు పెద్దపీట వేశారు.

అడాస్​ లెవల్​ 2: మరింత సురక్షితమైన డ్రైవింగ్ కోసం లెవల్ 2 అడాస్ (అడాస్​) ప్యాకేజీని అందించే అవకాశం ఉంది.

540-డిగ్రీ కెమెరా: కారు చుట్టూ ఏముందో 360 డిగ్రీల కంటే మెరుగ్గా, అంటే 540-డిగ్రీల వ్యూతో స్క్రీన్ పై చూడవచ్చు! ఇది డ్రైవింగ్‌ను మరింత సులభతరం చేస్తుంది.

కేటగిరీవివరాలు
ఇంజిన్లు2.0లీటర్​ టర్బో పెట్రోల్​, 2.2లీర్​ డీజిల్​
పవర్​పెట్రోల్​ 197 హెచ్​పీ, డీజిల్​ 182 హెచ్​పీ
టార్క్​పెట్రోల్​ 380 ఎన్​ఎం, డీజిల్​ 450 ఎన్​ఎం
ట్రాన్స్​మిషన్​6 స్పీడ్​ మేన్యువల్​, 6 స్పీడ్​ ఆటోమేటిక్​
డ్రైవ్​ట్రైన్​ఎఫ్​డబ్ల్యూడీ, ఏడబ్ల్యూడీ
ఎక్స్​టీరియర్​ మార్పులుకొత్త గ్రిల్​, రివైజ్డ్​ బంపర్​, కొత్త డ్యూయెల్​ బ్యారెల్​ ఎల్​ఈడీ హెడ్​ల్యాంప్స్​, అప్డేటెడ్​ టెయిల్​ ల్యాంప్స్​
వీల్స్​కొత్త అలాయ్​ వీల్స్​ డిజైన్​
ఇంటీరియర్​ట్రిపుల్​ స్క్రీన్​ సెటప్​, వెంటిలేటెడ్​ సెకెండ్​ రో కెప్టెన్​ సీట్స్​, హర్మన్​ కార్డాన్​ డాల్బీ అట్మోస్​ ఆడియో, బాస్​ మోడ్​
టెక్​ అండ్​ సేఫ్టీలెవల్​ 2 అడాస్​, సెల్ఫ్​ పార్కింగ్​ ఫీచర్​, ఫ్రెంట్​ పార్కింగ్​ సెన్సార్​
సీటింగ్​ ఆప్షన్స్​5 లేదా 7
ఫ్యుయెల్​ టైప్​పెట్రోల్​, డీజిల్​

మహీంద్రా ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ- ఇంజిన్ పవర్ సేమ్..

ఈ మహీంద్రా ఎక్స్​యూవీ 700 ఫేస్​లిఫ్ట్​లో మెకానికల్ పరంగా పెద్ద మార్పులు లేవు. 2.0 లీటర్ టర్బో పెట్రోల్, 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్లనే ఇందులోనూ కొనసాగిస్తున్నారు. ఇవి 6-స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో వస్తాయి. డీజిల్ వెర్షన్‌లో ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్ కూడా ఉండే అవకాశం ఉంది.

ధర- బుకింగ్స్: మహీంద్రా ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ భారతదేశంలో 2026 జనవరి 5న అధికారికంగా లాంచ్ కానుంది. రూ. 21,000 టోకెన్ అమౌంట్‌తో బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. దీని ధర సుమారు రూ. 15 లక్షల నుంచి రూ. 25 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండే అవకాశం ఉంది.

కొత్త ఏడాదిలో పవర్ ఫుల్ ఎస్‌యూవీ కావాలనుకునే వారు దీనిపై ఓ లుక్కేయొచ్చు!

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More