హైవేపై డ్రైవింగ్ అంటే ఇష్టమా? సేఫ్​గా ఉండాలంటే ఇవి తెలుసుకోండి..

జాతీయ రహదారులపై వాహనాలు సాధారణంగా వేగంగా వెళుతుంటాయి. అయితే ఇది ప్రమాదాలకు దారితీయవచ్చు. ప్రమాదాలను నివారించాలంటే కొన్ని జాగ్రత్తలను కచ్చితంగా పాటించాలి. వాటిని ఇక్కడ తెలుసుకోండి..

Published on: Nov 9, 2025, 11:00:16 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సిటీ ట్రాఫిక్​లో డ్రైవింగ్​ చేయాలంటే చాలా చిరాకుగా ఉంటుంది. అందుకే ఎప్పటికప్పుడు హైవేలపై రోడ్డు ట్రిప్​కి వెళ్లాలని అనిపిస్తుంటుంది. అయితే, రోడ్డు ట్రిప్ అంటే తరచుగా మీరు హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలపై ప్రయాణించడం జరుగుతుంది. అయితే, నగరాల్లో డ్రైవింగ్ చేయడంతో పోలిస్తే జాతీయ రహదారులపై డ్రైవింగ్ డిఫరెంట్​గా ఉంటుంది. ఇందులో కొన్ని సవాళ్లు కూడా ఉంటాయి. హైవేలపై డ్రైవింగ్ చాలా రిలాక్సింగ్‌గా ఉన్నప్పటికీ, చుట్టూ అధిక వేగంతో కార్లు వెళుతుంటాయి ఉంటుంది కాబట్టి, పూర్తి ఏకాగ్రత అవసరం.

హైవేపై డ్రైవింగ్​లో సేఫ్​గా ఉండాలంటే ఇవి తెలుసుకోండి..
హైవేపై డ్రైవింగ్​లో సేఫ్​గా ఉండాలంటే ఇవి తెలుసుకోండి..

ఈ నేపథ్యంలో చిన్న పొరపాటు కూడా హైవేలపై మీకు పెద్ద నష్టాన్ని కలిగించవచ్చు! ఏ రకమైన రోడ్డుపై డ్రైవింగ్ చేసినా కొన్ని ప్రాథమిక ట్రాఫిక్ నియమాలను పాటించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా హైవేలపై డ్రైవింగ్​కి ఇది వర్తిస్తుంది.

ఈ నేపథ్యంలో హైవేలపై డ్రైవింగ్ చేసేటప్పుడు పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన టిప్స్​, ట్రిక్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

వేగం ఆధారిత లేన్‌లను అనుసరించండి..

హైవేలపై డ్రైవింగ్ చేసేటప్పుడు సాధారణ నియమాలలో ఒకటి వేగం ఆధారిత లేన్ నియమాన్ని పాటించడం.

  • ట్రక్కులు, బస్సులు వంటి నెమ్మదిగా కదిలే వాహనాలన్నీ ఎడమ లేన్ తీసుకోవాలి.
  • కార్ల వంటి వేగంగా వెళ్లే వాహనాలు కుడి లేన్‌లో ఉండాలి.
  • ఈ నియమం తప్పుడు వైపు నుంచి ఓవర్‌టేక్ చేయడాన్ని నివారిస్తుంది.

డైరెక్షన్​ ఆధారిత లేన్‌లను అనుసరించండి..

హైవేలు సాధారణంగా ప్రతి వైపున రెండు లేదా మూడు లేన్‌లను కలిగి ఉంటాయి. ఎక్స్‌ప్రెస్‌వేల విషయంలో కొన్నిసార్లు నాలుగు లేన్ల వరకు పెరుగుతాయి. మీరు ప్రయాణించే డైరెక్షన్​ని బట్టి ఎల్లప్పుడూ సరైన లేన్‌ను ఎంచుకోండి.

  • మీరు మూడు లేన్ల రోడ్డులో కుడి వైపుకు తిరగాలనుకుంటే, కుడి లేన్‌లోనే ఉండండి.
  • మీరు హైవే నుంచి బయటకు వెళ్లాలనుకుంటే ఎడమ లేన్‌లో డ్రైవ్ చేయండి.
  • మీరు నేరుగా వెళ్తుంటే, మధ్య లేన్‌లో డ్రైవ్ చేయండి.

అతివేగం వద్దు..

ఎప్పుడూ అతివేగంతో డ్రైవ్ చేయకండి. ఇది మీకు, మీతో పాటు ఉన్న వారి భద్రతకు మాత్రమే కాకుండా, ఇతర వాహనాలకు కూడా ప్రమాదం కలిగించవచ్చు. అంతేకాకుండా, ఇది మీకు ట్రాఫిక్‌కు సంబంధించిన చట్టపరమైన సమస్యలను కూడా తెచ్చిపెట్టవచ్చు.

సాధారణంగా హైవేలపై స్పీడ్​ లిమిట్​ని సూచించే సైన్‌బోర్డులు ఉంటాయి. ఊహించని విషయాలను ఎదుర్కోవాల్సి వస్తే, మీరు వాహనంపై నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి, ఆ వేగ పరిమితిని ఎప్పుడూ దాటవద్దు.

తిరిగేటప్పుడు ఇండికేటర్లు వాడండి..

లేన్ మారుతున్నప్పుడు లేదా ఎడమ లేదా కుడి వైపునకు తిరుగుతున్నప్పుడు ఎల్లప్పుడూ ఇండికేటర్ లైట్లు వాడండి. దీనివల్ల మీ చుట్టూ ఉన్న వాహనదారులు ఇండికేటర్ లైట్లను గమనించి, మీరు చేయబోయే కదలిక గురించి తెలుసుకుంటారు. ఇది వారికి తదనుగుణంగా చర్య తీసుకోవడానికి సహాయపడుతుంది. ఇండికేటర్లు వాడకుండా అకస్మాత్తుగా లేన్లు మారడం వల్ల తీవ్రమైన ప్రమాదాలు, మరణాలు కూడా సంభవించవచ్చని గుర్తుపెట్టుకోండి.

జంక్షన్ల వద్ద వేగం తగ్గించండి..

జాతీయ రహదారులపై చాలా క్రాసింగ్‌లు, జంక్షన్‌లు (ఇంటర్‌సెక్షన్లు) ఉంటాయి. ఆ ప్రాంతాల్లో అధిక వేగంతో డ్రైవ్ చేయడం చాలా ప్రమాదకరం, ఎందుకంటే అక్కడ వాహనాల కదలికతో పాటు పాదచారులు కూడా హైవేలను దాటుతూ ఉంటారు. కాబట్టి, జంక్షన్‌కు చేరుకుంటున్నప్పుడు ఎప్పుడూ వేగాన్ని తగ్గించండి. ఇలా చేయడం వలన అనుకోని సంఘటన జరిగినప్పుడు మీరు త్వరగా ప్రతిస్పందించడానికి మరింత సమయం లభిస్తుంది.

ఈ టిప్స్​ పాటించి హైవేలపై డ్రైవింగ్​ని ఎంజాయ్​ చేస్తూనే మీరు సేఫ్​గా కూడా ఉండొచ్చు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More