కర్నూలు బస్సు ప్రమాదం కేసు - ట్రావెల్స్ ఓనర్ వేమూరి వినోద్ కుమార్ అరెస్ట్

కర్నూల్ బస్సు ప్రమాదం కేసులో ఏ2గా వేమూరి కావేరి ట్రావెల్స్‌ యజమాని వేమూరి వినోద్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించారు. ఇటీవల జరిగిన బస్సు ప్రమాదంలో 19 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. 

Published on: Nov 7, 2025, 14:56:55 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కర్నూల్ లో చోటు చేసుకున్న బస్సు ప్రమాదం కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు. తాజాగా వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని వేమూరి వినోద్‌ కుమార్ ను ఇవాళ కర్నూల్ పోలీసులు అరెస్టు చేశారు.

కర్నూలు బస్సు ప్రమాదం
కర్నూలు బస్సు ప్రమాదం

అదుపులోకి తీసుకున్న తర్వాత స్పెషల్ మొబైల్ కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో ఏ1 గా ట్రావెల్స్ బస్సు డ్రైవర్ లక్ష్మయ్య ఉన్నారు. ఇప్పటికే అతడిని అరెస్ట్ చేయగా.. తాజాగా ఓనర్ ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరు జిల్లాకు చెందిన ప్రయాణికుడు రమేష్‌ ఫిర్యాదుతో కేసు నమోదైంది. బీఎన్ ఎస్ లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

కర్నూలు జిల్లాలో ఇటీవల(అక్టోబర్ 24,2025) జరిగిన బస్సు ప్రమాదంలో 19 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. పలువురు గాయపడగా.. వారు చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లోని ప్రయాణికులను ఉలికిపడేలా చేసింది.

రోడ్డుపై పడి ఉన్న బైక్‌ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగి వీరంతా సజీవ దహనమయ్యారు. ప్రమాద ఘటనకు సంబంధించి బస్సు డ్రైవర్‌, యజమానిపై కేసు నమోదు కాగా…. కొద్దిరోజుల కిందటే ఏ1గా ఉన్న డ్రైవర్‌ లక్ష్మయ్యను పోలీసులు అరెస్టు చేశారు. డ్రైవర్ నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణం గానే ప్రమాదం జరిగినట్లు ఎఫ్ఐఆర్ కాపీలో పోలీసులు పేర్కొన్నారు.

ప్రమాదం జరిగినప్పుడు బస్సులో ఇద్దరు డ్రైవర్లు…. నలుగురు చిన్నారులు సహా మొత్తం 46 మంది ఉన్నారు. బైక్ బస్సు కిందికి వెళ్లటంతో పాటు కొంచెం దూరం అలాగే బస్సు ముందుకెళ్లింది. ఈ క్రమంలోనే ఇంజిన్ లో మంటలు చెలరేగటంతో ఘోర ప్రమాదం జరిగింది. కొందరు బయటపడినప్పటికీ… 19 మంది మంటల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More