లగ్జరీ కార్లకు పోటీగా మహీంద్రా XUV 7XO టాప్​ ఎండ్ వేరియంట్​​ ఫీచర్లు..

మహీంద్రా ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ ఇంకొన్ని రోజుల్లో లాంచ్​కానుంది. లాంచ్​కి ముందు ఈ ఎస్​యూవీ టాప్​ ఎండ్​ వేరియంట్​ ఫీచర్ల వివరాలు బయటకి వచ్చాయి. ఇవి లగ్జరీ కార్లకు పోటీనిచ్చే విధంగా ఉండటం విశేషం.. వివరాల్లోకి వెళితే..

Published on: Dec 24, 2025, 12:16:42 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారతీయ రోడ్లపై తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న మహీంద్రా అండ్ మహీంద్రా.. 2026 ప్రారంభంలోనే కొత్త కారును లాంచ్​ చేయబోతోంది. ప్రస్తుతం ఉన్న ఎక్స్​యూవీ700కి ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌గా వస్తున్న 'ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ'ని జనవరి 5, 2026న పరిచయం చేయనుంది. అయితే లాంచ్‌కు ముందే ఈ కారుకు సంబంధించిన టాప్-ఎండ్ వేరియంట్ టెస్ట్ రన్‌లు చేస్తూ కెమెరా కంటికి చిక్కింది. ఈ టాప్​ ఎండ్​ వేరియంట్​ని చూస్తుంటే మహీంద్రా ఈసారి లగ్జరీ కార్లకు గట్టి పోటీ ఇవ్వబోతోందని స్పష్టమవుతోంది.

మహీంద్రా ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ టాప్​ ఎండ్​ వేరియంట్​ ఫీచర్స్​..
మహీంద్రా ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ టాప్​ ఎండ్​ వేరియంట్​ ఫీచర్స్​..

మహీంద్రా ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ- టాప్​ ఎండ్​ వేరియంట్​..

మహీంద్రా తన ఎస్‌యూవీ లైనప్‌ను మరింత విస్తరిస్తూ 'ఏఎక్స్​9ఎల్​' అనే కొత్త టాప్-ఎండ్ వేరియంట్‌ని పరిచయం చేస్తోంది. మరింత విలాసవంతమైన ఎక్స్​పీరియెన్స్​ని కోరుకునే వారి కోసం ఈ మోడల్‌ను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. నాణ్యత, టెక్నాలజీ పరంగా ఇది ప్రస్తుతం ఉన్న మోడళ్ల కంటే ఎంతో మెరుగ్గా ఉండబోతోంది.

కళ్లు చెదిరే ఇంటీరియర్:

మూడు స్క్రీన్ల మ్యాజిక్ స్పై షాట్స్ ప్రకారం, ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ ఎస్​యూవీ క్యాబిన్ లోపల భారీ మార్పులు కనిపిస్తున్నాయి.

డ్యూయల్ టోన్ ఫినిషింగ్: సీట్లు, డ్యాష్‌బోర్డ్ పై భాగంలో 'బీజ్-బ్రౌన్' రంగుల కలయిక కారుకు రిచ్ లుక్ ఇస్తోంది.

ట్రిపుల్ స్క్రీన్ సెటప్: ఇప్పటివరకు ఎక్స్​ఈవీ 9ఈ వంటి ఎలక్ట్రిక్ కార్లలో చూసినట్లుగా, ఇందులో డ్రైవర్ నుంచి ప్యాసింజర్ వరకు మూడు స్క్రీన్లు ఉండబోతున్నాయి. గతంలో ఉన్న 10.25 ఇంచ్​ డిస్‌ప్లేల స్థానంలో ఇప్పుడు 12.3 ఇంచ్​ భారీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు.

స్టీరింగ్ వీల్: కొత్తగా డిజైన్ చేసిన టూ-స్పోక్ స్టీరింగ్ వీల్ మధ్యలో వెలుగులీనే మహీంద్రా లోగో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

ఫలితంగా లగ్జరీ విషయంలో మహీంద్రా ఎక్కడా రాజీ పడలేదని స్పష్టమవుతోంది. అయితే భద్రతలో కూడా మహీంద్రా ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ బలంగా ఉండనుంది.

  • 2026 కియా సెల్టోస్ బేస్​ వేరియంట్లోనే అదిరిపోయే ఫీచర్లు- పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

లెవల్ 2 అడాస్​: ప్రయాణాన్ని మరింత సురక్షితం చేసే లెవల్​ 2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ ఫీచర్​ దీని సొంతం.

సౌండ్ సిస్టమ్: డాల్బీ అట్మోస్ సపోర్ట్‌తో కూడిన 16-స్పీకర్ల హర్మాన్ కార్డన్ ఆడియో సిస్టమ్ మీకు థియేటర్ ఎక్స్​పీరియెన్స్​ని ఇస్తుంది.

ఇతర సౌకర్యాలు: పనోరమిక్ సన్‌రూఫ్, ఆటో-డిమ్మింగ్ ఐఆర్​వీఎం, ఎలక్ట్రిక్ బాస్ మోడ్, వెనుక విండోలకు బ్లైండ్స్, పవర్డ్ టెయిల్‌గేట్ వంటి ప్రీమియం ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

మహీంద్రా ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ- శక్తివంతమైన ఇంజిన్..

ఫీచర్లు మారినా, పనితీరులో పవర్‌ఫుల్‌గా ఉండే ప్రస్తుత ఇంజిన్లనే మహీంద్రా ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓలోనూ సంస్థ కొనసాగించనుంది. ఇందులో 2.2-లీటర్ ఎంహాక్​ టర్బో డీజిల్, 2.0-లీటర్ ఎంస్టాలియన్​ టర్బో పెట్రోల్ ఇంజిన్లు ఉండబోతున్నాయి. వీటితో పాటు మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉంటాయి.

ఈ ఎస్​యూవీ టాప్​ ఏండ్​కి చెందిన మరిన్ని ఫీచర్లు, ధర వంటి వివరాలు లాంచ్​ నాటికి అందుబాటులోకి వస్తాయి.

మొత్తానికి, అదిరిపోయే టెక్నాలజీ, విలాసవంతమైన ఫీచర్లతో వస్తున్న ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ.. ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో సరికొత్త సంచలనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More