మహీంద్రా XUV 7XO ఎస్​యూవీ ప్రీ- బుకింగ్స్​ ఈరోజు నుంచే..

మహీంద్రా XUV 7XO ప్రీ-బుకింగ్స్​పై బిగ్​ అప్డేట్​! ఈ ఎస్​యూవీ బుకింగ్స్​ నేడు ఓపెన్​ అవ్వనున్నాయి. ఇది ఎక్స్​యూవీ700 రీబ్యాడ్జ్డ్, రివ్యాంప్డ్ వర్షెన్. ఈ నేపథ్యంలో టోకెన్​ అమౌంట్​ ఎంత? బుకింగ్​ ఆప్షన్స్​ ఏంటి? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Dec 15, 2025, 09:11:02 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బెస్ట్​ సెల్లింగ్ ఫ్యామిలీ​ ఎస్​యూవీల్లో ఒకటైన మహీంద్రా ఎక్స్​యూవీ700కి ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ని సంస్థ తీసుకొస్తున్న విషయం తెలిసిందే. దాని పేరు మహీంద్రా ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ. ఈ మోడల్​ని ఆటోమొబైల్ తయారీ సంస్థ జనవరి 5న అధికారికంగా విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఇక ఇప్పుడు, ఈ ఎస్​యూవీ ప్రీ-బుకింగ్స్​ ఈరోజు, అంటే డిసెంబర్​ 15న ఓపెన్​ అవ్వనుంది.

మహీంద్రా ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ
మహీంద్రా ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ

మీరు రాబోయే మహీంద్రా ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే, ఈ ఎస్‌యూవీ గురించి కొన్ని కీలక విషయాలను ఇక్కడ తెలుసుకోండి..

మహీంద్రా ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ: ప్రీ-బుకింగ్ వివరాలు..

ప్రారంభ తేదీ, సమయం: మహీంద్రా ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ ప్రీ-బుకింగ్స్​ 2025 డిసెంబర్ 15న మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతాయి.

టోకెన్ అమౌంట్​: ఆసక్తిగల వినియోగదారులు రూ. 21,000 టోకెన్ అమౌంట్​తో ఈ ఎస్‌యూవీని బుక్ చేసుకోవచ్చు.

ఆప్షన్స్​: ప్రీ-బుకింగ్ సమయంలో, కస్టమర్‌లు తమకు నచ్చిన డీలర్‌షిప్, ఫ్యూయెల్​ టైప్​, ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌ను ఎంచుకునే అవకాశం ఉంటుంది.

ఎక్కడ బుక్ చేయాలి?: మహీంద్రా డీలర్‌షిప్‌లలో భౌతికంగా లేదా కార్ల తయారీ సంస్థకు చెందిన ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ ప్రీ-బుకింగ్‌ చేసుకోవచ్చు.

మహీంద్రా ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ: రీడిజైన్ చేసిన ఎక్స్​టీరియర్​..

టీజర్ చిత్రాలు వెల్లడించినట్లుగా, మహీంద్రా ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ ఎస్​యూవీలో కొత్తగా డ్యూయెల్ పాడ్ ఎల్​ఈడీ హెడ్‌ల్యాంప్‌లు ఉంటాయి. వాటికి తోడు 'ఎల్​' ఆకారంలో తిప్పి ఉంచిన ఎల్​ఈడీ డీఆర్​ఎల్స్​ (డేటైమ్ రన్నింగ్ లైట్స్) కూడా జత అవుతాయి.

మహీంద్రా ఎక్స్​ఈవీ 9ఎస్​ మోడల్‌ను పోలి ఉండే కొత్త ఎల్​ఈడీ టెయిల్‌లైట్లతో ఈ ఎస్‌యూవీ రానుంది.

సిల్వర్ స్లాట్‌లతో కూడిన కొత్త బ్లాక్డ్-అవుట్ రేడియేటర్ గ్రిల్‌, మార్పులు చేసిన బంపర్‌లు కూడా ఉంటాయి.

అల్లాయ్ వీల్స్: అలాగే, రీడిజైన్ చేసిన అల్లాయ్ వీల్స్‌ను ఇందులో చూడొచ్చు.

మహీంద్రా XUఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ: ఇంటీరియర్​..

మహీంద్రా ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ లోపలి క్యాబిన్ లేఅవుట్ పూర్తిగా రీడిజైన్ చేసి, అప్‌గ్రేడ్ చేసిన మెటీరియల్‌తో వస్తుంది.

క్యాబిన్ లోపల ప్రధాన ఆకర్షణగా, ఎక్స్​ఈవీ 9ఎస్​ తరహాలో ట్రిపుల్-స్క్రీన్ సెటప్ ఉండనుంది. ఇందులో మూడు పెద్ద డిస్‌ప్లేలు ఉంటాయని భావిస్తున్నారు.

డాష్‌బోర్డ్‌పై సాఫ్ట్-టచ్ ఎలిమెంట్లు, డ్యూయెల్-స్పోక్ స్టీరింగ్ వీల్, వెంటిలేషన్ ఫంక్షన్‌తో కూడిన స్లైడింగ్ సెకండ్-రో సీట్లు, ప్రయాణికులందరికీ అడ్జెస్టెబుల్ హెడ్‌రెస్ట్‌లు వంటి అదనపు సౌకర్యాలు ఇందులో ఉన్నాయి.

మహీంద్రా ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ: పవర్‌ట్రెయిన్‌..

మహీంద్రా ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ ఎస్​యూవీలో కొత్త ఇంజిన్ ఆప్షన్స్​ వచ్చే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో, ఇందులో ప్రస్తుతం ఉన్న, ప్రసిద్ధి చెందిన 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్, 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్‌లు కొనసాగుతాయి. ఈ ఎస్‌యూవీకి ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో సిక్స్-స్పీడ్ మాన్యువల్, టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అందుబాటులో ఉంటాయి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More