వాల్యూ ఫర్ మనీ ఎలక్ట్రిక్ కారు ఇది- మహీంద్రా XEV 9S ఎందుకు కొనాలంటే..
భారత ఆటోమొబైల్ మార్కెట్లో వాల్యూ ఫర్ మనీ ఎలక్ట్రిక్ కారుగా ఇప్పుడు మహీంద్రా ఎక్స్‌యూవీ 9ఎస్‌ని చూస్తున్నారు. దీని అద్భుత ఫీచర్స్, లాంగ్ రేంజ్, భారీ సేఫ్టీ ఫీచర్స్, తక్కువ ధర వంటివి ఇందుకు కారణాలు.
భారత ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా, 2025లో తన అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎలక్ట్రిక్ కారు 'ఎక్స్ఈవీ 9ఎస్'ను మార్కెట్లోకి విడుదల చేసింది. కంపెనీ పోర్ట్‌ఫోలియోలో బీఈ 6, ఎక్స్ఈవీ 9ఈతో పాటు ఈ ఈవీ ఒక ఫ్లాగ్‌షిప్ మోడల్‌గా ఇది నిలుస్తుంది. నిజానికి ఇది మనందరికీ సుపరిచితమైన ఎక్స్‌యూవీ700 కారుకు ప్యూర్ ఎలక్ట్రిక్ వెర్షన్. ఇకపోతే, ఇదే జనవరి 5న సరికొత్త హంగులతో రానున్న 'ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ'కు ఇది ఎలక్ట్రిక్ రూపమని చెప్పవచ్చు.

మహీంద్రా 'బోర్న్ ఎలక్ట్రిక్' సిరీస్‌లోని ఇతర కార్లతో పోలిస్తే, ఎక్స్ఈవీ 9ఎస్ డిజైన్ చాలా క్లాసిక్‌గా, నిత్యం వాడుకోవడానికి అనువుగా ఉంటుంది. అందుకే ఎలక్ట్రిక్ కార్ల సెగ్మెంట్లో దీనిని 'వాల్యూ ఫర్ మనీ బై'గా చూసత్తున్నారు. ఈ ఎస్‌యూవీని 'వాల్యూ ఫర్ మనీ'గా మార్చే ఆ ఐదు ముఖ్యమైన అంశాలు ఇవే:
పక్కా ఎస్‌యూవీ లుక్.. తిరుగులేని స్పేస్!
మహీంద్రా ఎక్స్ఈవీ 9ఎస్ చూడటానికి పక్కా కన్వెన్షనల్ ఎస్‌యూవీలా కనిపిస్తుంది. దీని రోడ్ ప్రెజెన్స్ చాలా బలంగా ఉంటుంది. 4,737 ఎంఎం పొడవు, 1,900 ఎంఎం వెడల్పు, 1,747 ఎంఎం ఎత్తుతో పాటు 2,762 ఎంఎం వీల్‌బేస్‌ను ఇది కలిగి ఉంది. దీనివల్ల కారు లోపల ప్రయాణికులకు మంచి స్పేస్, సౌకర్యం లభిస్తాయి.
| మహీంద్రా ఎక్స్ఈవీ 9ఎస్: డైమెన్షన్స్ | |
|---|---|
| పొడవు | 4,737 ఎంఎం |
| వెడల్పు | 1,900 ఎంఎం |
| ఎత్తు | 1,747 ఎంఎం |
| వీల్‌బేస్ | 2,762 ఎంఎం |
| గ్రాండ్ క్లియరెన్స్ | 205 ఎంఎం |
పవర్‌ఫుల్ బ్యాటరీ.. అద్భుతమైన రేంజ్!
కస్టమర్ల అవసరాలకు తగ్గట్టుగా మహీంద్రా ఇందులో మూడు బ్యాటరీ ఆప్షన్లను ఇస్తోంది:
59 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ: 521 కి.మీ రేంజ్, 228 బీహెచ్పీ పవర్.
70 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ: 600 కి.మీ రేంజ్, 242 బీహెచ్పీ పవర్.
79 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ: ఏకంగా 679 కి.మీ రేంజ్, 282 బీహెచ్పీ పవర్‌ను అందిస్తుంది.
ఈ మూడు వెర్షన్లు కూడా రియర్ యాక్సిల్ మౌంటెడ్ మోటార్లతో వస్తాయి. ఇవి 380 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి.
కళ్లు చెదిరే ట్రిపుల్ స్క్రీన్ సెటప్ ఈ ఎలక్ట్రిక్ కారు ఇంటీరియర్‌లో ప్రధాన ఆకర్షణ ట్రిపుల్ స్క్రీన్ సెటప్. డ్రైవర్ కోసం డిజిటల్ డిస్ప్లేతో పాటు, మధ్యలో ఒకటి, ప్రయాణికుడి వైపు మరొకటి.. ఇలా రెండు 12.3 ఇంచ్ టచ్‌స్క్రీన్లను అమర్చారు. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ టెక్నాలజీతో నడిచే MAIA సాఫ్ట్‌వేర్ ద్వారా వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే వంటి ఫీచర్లు ఎంతో స్మూత్‌గా పనిచేస్తాయి.
మహీంద్రా ఎక్స్ఈవీ 9ఎస్- ఫీచర్ల ఖజానా..
లగ్జరీ కార్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ మహీంద్రా ఎక్స్ఈవీ 9ఎస్ ఫీచర్లు ఉన్నాయి. ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్లు, మొదటి రెండు వరుసల్లో వెెంటిలేటెడ్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, డ్యుయల్ వైర్‌లెస్ ఛార్జింగ్, వెనుక ప్రయాణికుల కోసం ఫోల్డబుల్ స్నాక్ ట్రేలు వంటివి ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా చేస్తాయి. అంతేకాకుండా, బూట్ స్పేస్‌తో పాటు ముందు భాగంలో ‘ఫ్రంక్’లో కూడా స్టోరేజ్ వసతి ఉంది.
| మహీంద్రా ఎక్స్ఈవీ 9ఎస్: బ్యాటరీ, రేంజ్, పవర్ | |||
|---|---|---|---|
| బ్యాటరీ | 59 కేడబ్ల్యూహెచ్ | 70 కేడబ్ల్యూహెచ్ | 79 కేడబ్ల్యూహెచ్ |
| డ్రైవ్‌ట్రైన్ | ఆర్డబ్ల్యూడీ | ఆర్డబ్ల్యూడీ | ఆర్డబ్ల్యూడీ |
| రేంజ్ | 521 కి.మీ | 600 కి.మీ | 679 కి.మీ |
| పవర్ | 228 హెచ్‌పీ | 242 హెచ్‌పీ | 282 హెచ్‌పీ |
| టార్క్ | 380 ఎన్ఎం | 380 ఎన్ఎం | 380 ఎన్ఎం |
మహీంద్రా ఎక్స్ఈవీ 9ఎస్- భద్రతకు పెద్దపీట..
సేఫ్టీ విషయంలో మహీంద్రా ఎప్పుడూ రాజీ పడదు! ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో కూడా బలమైన బాడీ స్ట్రక్చర్‌తో పాటు అన్ని చక్రాలకు డిస్క్ బ్రేకులు, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ప్రామాణికంగా 6 ఎయిర్‌బ్యాగ్‌లను ఇచ్చారు. టాప్ వేరియంట్‌లో డ్రైవర్ నీ ఎయిర్‌బ్యాగ్‌తో కలిపి మొత్తం 7 ఎయిర్‌బ్యాగ్‌లు ఉంటాయి. వీటికి తోడు లెవల్ 2 అడాస్ టెక్నాలజీ డ్రైవింగ్‌ను మరింత సురక్షితం చేస్తుంది.
మొత్తానికి స్టైల్, పర్ఫార్మెన్స్, సేఫ్టీ కలగలిసిన మహీంద్రా ఎక్స్ఈవీ 9ఎస్, ప్రీమియం ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో సరికొత్త ట్రెండ్ సెట్ చేయనుంది!
భారత మార్కెట్లో మహీంద్రా ఎక్స్ఈవీ 9ఎస్ ఎక్స్‌షోరూం ధర రూ. 19.95లక్షల వద్ద ప్రారంభమవుతుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


