టర్బో ఇంజిన్​తో 2026 టాటా పంచ్​- ఇంకొన్ని రోజుల్లో లాంచ్​..

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ తన పాపులర్ ఎస్‌యూవీ 'పంచ్' ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను సిద్ధం చేస్తోంది. కేవలం డిజైన్ మార్పులే కాకుండా, ఈసారి సరికొత్త టర్బో పెట్రోల్ ఇంజిన్, అధునాతన ఫీచర్లతో ఈ కారు మార్కెట్లోకి రానుంది. వివరాల్లోకి వెళితే..

Published on: Jan 5, 2026, 14:00:34 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టాటా మోటార్స్ నుంచి అత్యధికంగా అమ్ముడవుతున్న మోడళ్లలో 'టాటా పంచ్' ఒకటి. ఇప్పుడు ఈ చిన్న ఎస్‌యూవీని మరింత శక్తిమంతంగా మార్చుతూ 'ఫేస్‌లిఫ్ట్' వెర్షన్‌ను కంపెనీ తీసుకువస్తోంది. ఈ టాటా పంచ్​ ఫేస్​లిఫ్ట్​ 2026 జనవరి 13న లాంచ్​కానుంది. తాజాగా విడుదలైన టీజర్ ప్రకారం.. ఈ కారులో కేవలం ఎక్స్​టీరియర్​, ఇంటీరియర్​ మార్పులే కాకుండా.. మెకానికల్ పరంగా ఒక భారీ అప్‌డేట్ రాబోతోంది. అదే ‘టర్బో ఇంజిన్’!

టాటా పంచ్​ ఫేస్​లిఫ్ట్​లో కొత్త ఇంజిన్​ ఆప్షన్​..
టాటా పంచ్​ ఫేస్​లిఫ్ట్​లో కొత్త ఇంజిన్​ ఆప్షన్​..

2026 టాటా పంచ్​- టర్బో ఇంజిన్​తో!

టాటా పంచ్ ఫేస్​లిఫ్ట్​ టర్బో పెట్రోల్ వేరియంట్‌లో 1.2 లీటర్, 3-సిలిండర్ టర్బోచార్జ్​డ్​ ఇంజిన్‌ను అమర్చారు. దీనిని ఐటర్బో అని సంస్థ పిలుస్తోంది. ఇది సుమారు 118 బీహెచ్​పీ పవర్​ని, 170 ఎన్​ఎం టార్క్‌ను జనరేట్​ చేస్తుంది. దీనికి తోడు 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ను కూడా లేటెస్ట్​ టీజర్ ధృవీకరించింది.

టర్బో ఇంజిన్‌తో పాటు ప్రస్తుతం అందుబాటులో ఉన్న 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ (88 హెచ్​పీ, 115 ఎన్​ఎం) కూడా కొనసాగనుంది. అలాగే మైలేజ్ కోరుకునే వారి కోసం సీఎన్జీ వేరియంట్ కూడా అందుబాటులో ఉంటుంది. వీటిలో 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ ఏఎంటీ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉంటాయి.

2026 టాటా పంచ్​- అధునాతన ఫీచర్ల సందడి..

2026 టాటా పంచ్​ ఫీచర్ల విషయంలో టాటా ఎక్కడా తగ్గలేదు. టీజర్‌లో కనిపించిన కొన్ని ప్రధాన ఫీచర్లు ఇవే:

ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్: కారు సమాచారాన్ని స్పష్టంగా చూపే డిజిటల్ స్క్రీన్.

65డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్: మొబైల్ ఫోన్లు, ఇతర గ్యాడ్జెట్లను వేగంగా ఛార్జ్ చేసుకునే సదుపాయం.

హిల్ డిసెంట్ కంట్రోల్: కొండ ప్రాంతాలు, ఎత్తైన వాలు మార్గాల్లో కారును సురక్షితంగా నడిపేందుకు ఉపయోగపడుతుంది.

టచ్-బేస్డ్ కంట్రోల్ ప్యానెల్: కారులోని ఫీచర్లను నియంత్రించేందుకు స్మార్ట్ టచ్ ప్యానెల్.

ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్ (ఎఫ్​ఏటీసీ): కారు లోపల వాతావరణాన్ని దానంతట అదే సర్దుబాటు చేసే ఫుల్లీ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్.

వీటితో పాటు డ్రైవింగ్ సౌకర్యం కోసం డ్రైవర్ సీటు వద్ద ‘అండర్-థై సపోర్ట్’ని మెరుగుపరిచారు. ఈ చిన్న మార్పు లాంగ్ డ్రైవ్స్‌లో డ్రైవర్‌కు ఎంతో హాయినిస్తుంది.

2026 టాటా పంచ్​- డిజైన్‌లో కొత్తదనమిదే..

పాత టాటా పంచ్ రూపురేఖలను కాపాడుకుంటూనే, కొన్ని ఆకర్షణీయమైన మార్పులు చేశారు. కొత్త డిజైన్ అలాయ్ వీల్స్, వెనుక వైపు హారియర్, సఫారి మోడళ్ల తరహాలో కారు వెడల్పు పొడవునా ఉండే లైట్ స్ట్రిప్ ఆకట్టుకుంటోంది. దీనికి తోడు కొత్త 'బ్లూ' రంగు కారుకు మరింత ప్రీమియం లుక్‌ను ఇస్తోంది.

త్వరలోనే ఈ పవర్‌ఫుల్ పంచ్ భారత రోడ్లపై సందడి చేయనుంది. పనితీరు, భద్రత మరియు ఫీచర్ల పరంగా ఈ అప్‌డేట్ కస్టమర్లను మరింత ఆకట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More