సేఫ్టీలో టాప్! టాటా హారియర్, సఫారీ పెట్రోల్ వేరియంట్లకు 5-స్టార్ రేటింగ్..
టాటా మోటార్స్ తన ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీలు హారియర్, సఫారీలో పెట్రోల్ వేరియంట్లను త్వరలో విడుదల చేయనుంది. లాంచ్‌కు ముందే వీటికి భారత్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ రేటింగ్ లభించింది. కొత్త ఇంజిన్, మంచి సేఫ్టీ ఫీచర్లతో ఈ కార్లు రాబోతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..
సురక్షితమైన కార్లను అందించడంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టాటా మోటార్స్.. తన పాపులర్ ఎస్‌యూవీలు హారియర్, సఫారీ పెట్రోల్ వేరియంట్లతో మార్కెట్‌ను షేక్ చేయడానికి సిద్ధమైంది. క్రాష్ టెస్ట్‌లో ఈ కొత్త పెట్రోల్ వేరియంట్లకు కూడా 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించిందని భారత్ ఎన్సీఏపీ ప్రకటించింది. వివరాల్లోకి వెళితే..

టాటా హారియర్, టాటా సఫారీ- సేఫ్టీలో తిరుగులేదు!
2023లో భారత్ ఎన్సీఏపీ పరీక్షించిన మొదటి కార్లుగా హారియర్, సఫారీ నిలిచాయి. అప్పట్లో ఇవి అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ (ఏఓపీ)లో 32 పాయింట్లకు గానూ 30.08, చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ (సీఓపీ)లో 49 పాయింట్లకు గానూ 44.54 సాధించి 5-స్టార్ రేటింగ్ సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు ఇదే రేటింగ్ పెట్రోల్ వెర్షన్లకు కూడా లభించిందని భారత్ ఎన్సీఏపీ స్పష్టం చేసింది.
ఈ కార్లలో భద్రత కోసం ఎక్కడా రాజీ పడలేదు:
అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్ (గరిష్టంగా 7).
ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఈఎస్సీ).
అన్ని వరుసల్లోనూ 3-పాయింట్ సీట్‌బెల్టులు.
ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి.
కొత్త 'హైపీరియన్' ఇంజిన్ పవర్..
హారియర్, సఫారీ పెట్రోల్ వెర్షన్లలో సరికొత్త 1.5-లీటర్, ఫోర్-సిలిండర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌ను టాటా అమర్చింది. దీనిని ‘హైపీరియన్’ సిరీస్ అని పిలుస్తారు. ఇది మొదట సియెర్రా ఎస్‌యూవీలో కనిపించింది. ఈ ఇంజిన్‌లో హై-ప్రెజర్ గాసోలీన్ డైరక్ట్ ఇంజెక్షన్ వ్యవస్థ ఉంది. ఇదొక అల్యూమినియం ఇంజిన్ బ్లాక్. దీనిని వాడటం వల్ల బరువు తగ్గి, ఇంజిన్ పటిష్టత పెరుగుతుంది.
పర్ఫార్మెన్స్: ఇది 170 హెచ్‌పీ పవర్‌ను, 280 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
గేర్‌బాక్స్: ఇందులో 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటు టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంటుంది.
హారియర్, సఫారీ పెట్రోల్ వేరియంట్లు- ధర ఎంత ఉండొచ్చు?
పెట్రోల్ ఇంజిన్ రాకతో హారియర్, సఫారీ ప్రారంభ ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది! హారియర్ పెట్రోల్ ధర రూ. 13 లక్షల నుంచి రూ. 14 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉండవచ్చని అంచనా. ప్రస్తుతం డీజిల్ ధరలతో పోలిస్తే ఇది వినియోగదారులకు మరింత చేరువయ్యే అవకాశం కనిపిస్తోంది. సఫారీ పెట్రోల్ కూడా దాదాపు రూ. 14 లక్షల ప్రారంభ ధరతో వచ్చే ఛాన్స్ ఉంది.
టాటా సఫారీ పెట్రోల్‌లో స్మార్ట్, ప్యూర్ ఎక్స్, అడ్వెంచర్ ఎక్స్ ప్లస్, అడ్వెంచర్ ఎక్స్, అకంప్లీష్డ్ ఆప్షన్స్ ఉంటాయి. ఇక టాటా హారియర్ పెట్రోల్‌లో స్మార్ట్, అడ్వెంచర్ ఎక్స్, అడ్వెంచర్ ఎక్స్ ప్లస్, ఫియర్లెస్ ఎక్స్, ఫియర్లెస్ ఎక్స్ ప్లస్, ఫియర్లెస్ అల్ట్రా ఆప్షన్స్ ఉంటాయి.
ఈ నెలలోనే ఇవి షోరూమ్‌లలో సందడి చేయనున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా డీలర్ల వద్దకు స్టాక్ చేరుకుంటున్నట్లు సమాచారం. మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ఈ కొత్త పెట్రోల్ వేరియంట్లు టాటా మోటార్స్ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


