బుకింగ్స్‌లో టాటా సియెర్రా సంచలనం- మరి డెలివరీ ఎప్పుడు? పూర్తి వివరాలు..
టాటా సియెర్రా ఎస్‌యూవీని బుక్ చేశారా? లేదా బుక్ చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే టాటా సియెర్రా డెలివరీ ప్రారంభ తేదీ, వేరియంట్ వారీగా డెలివరీలు సహా ఈ ఎస్‌యూవీకి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
భారత ఆటోమొబైల్ రంగంలో సెన్సేషన్ సృష్టిస్తోంది 'టాటా సియెర్రా'. ఈ కారు కోసం భారతీయులు ఎంతగా ఎదురుచూస్తున్నారో చెప్పడానికి దీనికి వచ్చిన 70,000 బుకింగ్‌లే (ఒక్క రోజులో) నిదర్శనం! మరి మీరు కూడా ఈ కారును బుక్ చేసుకున్నారా? లేదా బుక్ చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే! టాటా సియెర్రా డెలివరీ డేట్‌తో పాటు ధరలు, వేరియంట్ల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

టాటా సియెర్రా ఎస్‌యూవీ- డెలివరీ ఎప్పుడు?
టాటా సియెర్రా డెలివరీలు జనవరి 15న ప్రారంభం అవుతాయని కంపెనీ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది.
తొలి విడతలో టాప్ ఎండ్ వేరియంట్లను, ఆ తర్వాత మిడ్- బేస్ వేరియంట్లను టాటా మోటార్స్ డెలివరీ చేస్తుంది. మీరు ఎంచుకున్న కలర్, వేరియంట్, నగరాన్ని బట్టి వెయిటింగ్ పీరియడ్ మారుతుంటుంది.
అదిరిపోయే బుకింగ్స్ దక్కించుకుంది కాబట్టి, టాటా సియెర్రా వేరియంట్ పీరియడ్ కాస్త ఎక్కువగానే ఉండొచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
టాటా సియెర్రా ఎస్‌యూవీ- ధర ఎంత?
టాటా సియెర్రా క్లిక్ అవ్వడానికి కారణం దాని ప్రైజింగ్! అదిరిపోయే డిజైన్‌తో వస్తున్న ఈ ఎస్‌యూవీ ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండేలా నిర్ణయించింది కంపెనీ.
- దీని ప్రారంభ ధర రూ. 11.49 లక్షలు (ఎక్స్-షోరూమ్).
- టాప్ మోడల్ ధర రూ. 21.29 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.
హైదరాబాద్‌లో టాటా సియెర్రా ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
టాటా సియెర్రా ఎస్‌యూవీ- ఎన్ని వేరియంట్లు ఉన్నాయి?
ఈ ఎస్‌యూవీ.. మొత్తం ఏడు వేరియంట్లలో లభిస్తుంది. అవి..
స్మార్ట్+, ప్యూర్, ప్యూర్+, అడ్వెంచర్, అడ్వెంచర్+, అకంప్లిష్డ్, అకంప్లిష్డ్+.
బేస్ వేరియంట్ అయిన స్మార్ట్+ లోనే సంస్థ అదిరిపోయే ఫీచర్స్‌ని ఇస్తుండటం విశేషం. ఈ వేరియంట్ గురించి పూర్తి వివరాలను తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
టాటా సియెర్రా ఎస్‌యూవీ- ఇంజిన్, పర్ఫార్మెన్స్..
టాటా సియెర్రాలో మొత్తం మూడు రకాల ఇంజిన్ ఆప్షన్లను ఇచ్చారు:
1.5 లీటర్ పెట్రోల్ (హైపీరియన్ సిరీస్): ఇది 104 హెచ్‌పీ పవర్, 145 ఎన్ఎం టార్క్‌ను ఇస్తుంది. దీనిలో 6-స్పీడ్ మాన్యువల్ లేదా 7-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి.
1.5 లీటర్ టర్బో-పెట్రోల్: ఇది మరింత పవర్‌ఫుల్. 157 హెచ్‌పీ పవర్, 255 ఎన్ఎం టార్క్‌ను ఇస్తుంది. దీనికి 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ జతచేశారు.
1.5 లీటర్ డీజిల్: మైలేజీ కోరుకునే వారికి ఇది బెస్ట్. 116 హెచ్‌పీ పవర్‌తో వస్తుంది. మాన్యువల్, ఆటోమేటిక్ గేర్ బాక్స్ రెండూ అందుబాటులో ఉన్నాయి.
టాటా సియెర్రా ఫీచర్లు.. నెక్ట్స్ లెవల్ అంతే!
ఫీచర్ల విషయంలో ఈ టాటా సియెర్రా ఎస్‌యూవీ తన విభాగంలోనే టాప్ అని చెప్పొచ్చు!
ట్రిపుల్ స్క్రీన్ సెటప్: లోపల ఏకంగా మూడు స్క్రీన్లు ఉంటాయి. డ్రైవర్ కోసం ఒకటి, మధ్యలో ఒకటి, ముందు కూర్చునే ప్యాసింజర్ కోసం ప్రత్యేకంగా ఒక స్క్రీన్ ఇచ్చారు.
పానోరమిక్ సన్‌రూఫ్: ఆకాశాన్ని చూస్తూ ప్రయాణించేలా పెద్ద సన్‌రూఫ్ కూడా ఇందులో ఉంది.
ఆడియో: మ్యూజిక్ లవర్స్ కోసం 12 స్పీకర్లతో కూడిన జేబీఎల్ ఆడియో సిస్టమ్ ఉంటుంది.
ఇతర సౌకర్యాలు: వెంటిలేటెడ్ సీట్లు, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే, రెండు వేర్వేరు జోన్లలో ఏసీని కంట్రోల్ చేసుకునే సదుపాయం ఉన్నాయి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


