సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్- 2025 బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ కారుగా ఎంజీ విండ్సర్
ఎంజీ విండ్సర్ ఈవీ 2025లో 46,735 యూనిట్ల అమ్మకాలతో భారత్‌లో నంబర్ 1 ఎలక్ట్రిక్ కారుగా నిలిచింది. ఈ ఈవీని ప్రజలు ఎందుకు ఆదరిస్తున్నారు? కారణాలేంటి? ఇక్కడ తెలుసుకోండి.
భారత ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో రారాజుగా కొనసాగుతున్న టాటా మోటార్స్‌కి షాక్! 2025లో అత్యధికంగా అమ్ముడుపోయిన ఈవీ ఈ కంపెనీకి చెందినది కాదు. జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్కి చెందిన ఎంజీ విండ్సర్ ఈవీ ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ ఈవీగా దూసుకెళుతోంది!

2025లో అత్యధికంగా అమ్ముడుపోయిన ఈవీ..
ఎలక్ట్రిక్ వాహనం అంటే కేవలం ప్రయోగం మాత్రమే కాదు, అదొక పక్కా ఫ్యామిలీ ఛాయిస్ అని 'ఎంజీ విండ్సర్' నిరూపించింది. జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా తాజాగా ప్రకటించిన గణాంకాల ప్రకారం.. 2025 ఏడాదిలో మొత్తం 46,735 యూనిట్ల విండ్సర్ కార్లు అమ్ముడయ్యాయి. దీనితో దేశంలోనే ఒక ఏడాదిలో అత్యధిక సేల్స్ సాధించిన 4-వీలర్ ఎలక్ట్రిక్ వాహనంగా ఇది సరికొత్త చరిత్ర సృష్టించింది.
సాధారణంగా దేశ ఈవీ విభాగంలో అత్యధిక వాటా టాటా మోటార్స్‌దే. అలాంటిది, ఈసారి టాటా కార్లను వెనక్కి నెట్టి, 2025లో బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా ఎంజీ విండ్సర్ ఈవీ నిలవడం సంస్థకు నిజమైన ప్లస్ పాయింట్ అనే చెప్పుకోవాలి.
మధ్యతరగతి కుటుంబాలే టార్గెట్..
విండ్సర్ ఈవీ సాధించిన ఈ ఘనవిజయం వెనుక ఒక బలమైన కారణం ఉంది. సాధారణంగా ఎలక్ట్రిక్ కార్లను సెకండ్ ఆప్షన్‌గా చూసే మధ్యతరగతి కుటుంబాలు, ఇప్పుడు దీనిని తమ మెయిన్ కారుగా మార్చుకుంటున్నాయి. కారులో ఉన్న అద్భుతమైన స్పేస్, సౌకర్యవంతమైన ప్రయాణం, సులభమైన ఫీచర్లు విండ్సర్‌ను ఫ్యామిలీ బయ్యర్లకు దగ్గర చేశాయి. నేడు రోడ్లపై పెరుగుతున్న పోటీలో కూడా తనదైన ముద్ర వేస్తూ, దేశంలోనే అత్యధిక అవార్డులు గెలుచుకున్న ఈవీగా ఇది గుర్తింపు పొందింది.
ఎంజీ మోటార్స్ జోరు.. 111% వృద్ధి!
విండ్సర్ ఈవీ జోరుతో ఎంజీ మోటార్ ఇండియా కూడా 2025ను ఘనంగా ముగించింది!
మొత్తం వృద్ధి: గత ఏడాదితో పోలిస్తే కంపెనీ 19 శాతం మొత్తం వృద్ధిని సాధించింది.
ఈవీ సేల్స్: ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాల్లో ఏకంగా 111 శాతం పెరుగుదల నమోదైంది. కేవలం హైదరాబాద్, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లోనే కాకుండా, చిన్న చిన్న పట్టణాల్లో కూడా ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ భారీగా పెరగడం విశేషం.
తక్కువ ధర.. ఎక్కువ రేంజ్!
విండ్సర్ సక్సెస్‌లో ప్రధాన పాత్ర పోషించింది దాని వినూత్నమైన బీఏఏఎస్ (బ్యాటరీ ఆస్ ఏ సర్వీస్) మోడల్.
ధర: రూ. 9.99 లక్షల (ప్రారంభ ధర)కే ఈ కారును ఇంటికి తీసుకెళ్లవచ్చు. బ్యాటరీ వాడకానికి కిలోమీటరుకు కేవలం రూ. 3.9 చొప్పున చెల్లిస్తే సరిపోతుంది.
పవర్: దీని మోటార్ 136 పీఎస్ పవర్, 200 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
బ్యాటరీ ఆప్షన్లు అండ్ రేంజ్: సాధారణ మోడల్‌లో 38 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ (332 కి.మీ. రేంజ్) ఉంటే, 'విండ్సర్ ప్రో'లో 52.9 కేడబ్లూహెచ్ భారీ బ్యాటరీ (449 కి.మీ. రేంజ్) లభిస్తుంది.
జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా ఏమందంటే..
2025 బెస్ట్ సెల్లింగ్ ఈవీగా విండ్సర్ నిలవడంపై జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అనురాగ్ మెహ్రోత్రా హర్షం వ్యక్తం చేశారు.
"విండ్సర్ కొన్న కస్టమర్లే ఇప్పుడు మా బ్రాండ్ అంబాసిడర్లుగా మారుతున్నారు. తమ స్నేహితులను, బంధువులను కూడా ఈవీ వైపు ప్రోత్సహిస్తున్నారు. 2025లో ఇండియాలోనే నంబర్ 1 ఈవీగా నిలవడం చాలా గర్వంగా ఉంది. 2026ను మరింత అద్భుతంగా మార్చుతాము," అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఒకప్పుడు కేవలం నగరాలకే పరిమితమైన ఎలక్ట్రిక్ కార్లు, ఇప్పుడు సామాన్యుల జీవితంలోనూ భాగమవుతున్నాయి అనడానికి విండ్సర్ సాధించిన ఈ విజయమే నిదర్శనం.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


