Allu Arjun Gift Sneha Reddy: భార్యకు లగ్జరీ కారు గిఫ్ట్ ఇచ్చిన అల్లు అర్జున్- స్నేహా రెడ్డి స్వీట్ కిస్- కారు ధర ఎంతంటే?

Allu Arjun Anniversary Gift To Sneha Reddy: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్నేహా రెడ్డి తమ 15వ వివాహ వార్షికోత్సవాన్ని ఎంతో సంతోషంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా స్నేహా రెడ్డికి అల్లు అర్జున్ విలాసవంతమైన మెర్సిడెస్ బెంజ్ కారును బహుమతిగా ఇచ్చాడు. దానికి స్నేహా రెడ్డి రియాక్షన్ వైరల్ అవుతోంది.

Mar 8, 2026, 11:14:49 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్నేహా రెడ్డి మార్చి 6న తమ 15వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. విశేషమేమిటంటే, అదే రోజున బన్నీ తమ్ముడు అల్లు శిరీష్-నయనిక రెడ్డిల వివాహం కూడా జరిగింది. ఒకవైపు తమ్ముడి పెళ్లి వేడుకలో సందడి చేస్తూనే, మరోవైపు తన ప్రియమైన భార్య స్నేహకు బన్నీ అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చారు.

భార్యకు లగ్జరీ కారు గిఫ్ట్ ఇచ్చిన అల్లు అర్జున్- స్నేహా రెడ్డి స్వీట్ కిస్- కారు ధర ఎంతంటే?
భార్యకు లగ్జరీ కారు గిఫ్ట్ ఇచ్చిన అల్లు అర్జున్- స్నేహా రెడ్డి స్వీట్ కిస్- కారు ధర ఎంతంటే?

కోట్ల లగ్జరీ కారు.. ఫిదా అయిన స్నేహా!

తమ 15 ఏళ్ల బంధానికి గుర్తుగా స్నేహా రెడ్డికి అల్లు అర్జున్ ఒక ఖరీదైన, విలాసవంతమైన 'మెర్సిడెస్-బెంజ్ AMG CLE 53' (Mercedes-Benz AMG CLE 53) కారును గిఫ్ట్‌గా అందించారు. హైదరాబాద్‌లో దీని ధర సుమారు రూ. 1.81 కోట్లు ఉంటుందని సమాచారం. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అందులో అల్లు అర్జున్, ఆయన తండ్రి అల్లు అరవింద్ కలిసి కారు తాళాలను స్నేహకు అందజేశారు. ఆ కొత్త కారును చూడగానే మురిసిపోయిన స్నేహ, వెంటనే బన్నీ బుగ్గపై ముద్దు పెట్టి తన సంతోషాన్ని పంచుకుంది. అనంతరం మామగారు అల్లు అరవింద్‌ను హత్తుకుని కృతజ్ఞతలు తెలిపింది. భార్య ముఖంలో ఆ ఆనందాన్ని చూసి అల్లు అర్జున్ ఎంతో మురిసిపోయారు.

నా జీవిత భాగస్వామివి నువ్వే: స్నేహ ఎమోషనల్ నోట్

ఈ ప్రత్యేక సందర్భంలో స్నేహా రెడ్డి తన భర్తకు సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ నోట్ రాశారు. "15 ఏళ్ల ప్రయాణం.. ప్రేమతో నిండిన జీవితం, నాకు సర్వస్వమైన కుటుంబం, మన ఇద్దరు ముద్దుల పిల్లలు, మన రెండు కుక్కపిల్లలు.. ఇలా ఎన్నో మధుర జ్ఞాపకాలు. నా జీవితంలోని ప్రతి అధ్యాయంలో భాగస్వామిగా ఉన్నందుకు థాంక్యూ అర్జున్. హ్యాపీ యానివర్సరీ" అని స్నేహా రెడ్డి పేర్కొన్నారు.

నా ప్రపంచం ఇక్కడే ఉంది

అలాగే, తన పిల్లలు అయాన్, అర్హలతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ "నా ప్రపంచం అంతా ఇక్కడే ఉంది" అని స్నేహా రెడ్డి మురిసిపోయారు. అల్లు అర్జున్ కూడా యానివర్సరీ సందర్భంగా తన భార్యను 'క్యూటీ' అని సంబోధిస్తూ విష్ చేశారు.

"హ్యాపీ యానివర్సరీ క్యూటీ. 15 ఏళ్ల ఈ ప్రయాణం నువ్వు లేకుండా సాధ్యం అయ్యేది కాదు" అని తన సక్సెస్‌లో స్నేహా రెడ్డి పాత్రను కొనియాడుతూ అల్లు అర్జున్ శుభాకాంక్షలు చెప్పారు. వీరి పోస్టులపై మంచు లక్ష్మి సరదాగా స్పందిస్తూ.. "సరే సరే.. యానివర్సరీ విషెస్ అంతా బానే ఉంది కానీ, గిఫ్ట్ ఏం ఇచ్చావో చెప్పు.. నేను చూడాలి" అంటూ ఆటపట్టించారు.

అల్లు అర్జున్-స్నేహ ప్రయాణం

మంచు లక్ష్మి అడిగిన దానికి లగ్జరీ బెంజ్ కారు సమాధానం ఇచ్చినట్లు అయింది. ఇకపోతే 2011 మార్చి 6న అల్లు అర్జున్, స్నేహా రెడ్డిల వివాహం హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా జరిగింది. వీరికి 2014లో అయాన్, 2016లో అర్హ జన్మించారు. అర్హ ఇప్పటికే సమంత నటించిన 'శాకుంతలం' సినిమాతో వెండితెరకు పరిచయమైంది.

అగ్ర దర్శకులతో

ఇక అల్లు అర్జున్ 'పుష్ప 2'తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ చేతిలో అట్లీ, లోకేష్ కనగరాజ్ వంటి అగ్ర దర్శకుల ప్రాజెక్టులు ఉన్నాయి. ఇవి 2027లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More