Allu Arjun: ఒకేరోజు అన్న యానివర్సరీ, తమ్ముడి పెళ్లి- స్నేహా రెడ్డిపై అల్లు అర్జున్ పోస్ట్- గిఫ్ట్‌పై మంచు లక్ష్మి ఆసక్తి

Allu Arjun Sneha Reddy Wedding Anniversary: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్నేహా రెడ్డిల వివాహ బంధానికి నేటితో 15 ఏళ్లు నిండాయి. ఒకవైపు తన ‘క్యూటీ’కి బన్నీ ప్రేమతో విషెస్ చెబుతుంటే, మరోవైపు తమ్ముడు అల్లు శిరీష్-నయనికల పెళ్లి వేడుకతో సందడిగా మారింది. అల్లు అర్జున్ పోస్టుపై మంచు లక్ష్మి కామెంట్ చేసింది.

Mar 6, 2026, 13:12:32 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అల్లు వారి ఇంట నేడు పండుగ వాతావరణం నెలకొంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన వైవాహిక జీవితంలో ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకున్నారు. అల్లు అర్జున్, స్నేహా రెడ్డి ఒక్కటై నేటితో (మార్చి 6) 15 వసంతాలు పూర్తయ్యాయి.

ఒకేరోజు అన్న యానివర్సరీ, తమ్ముడి పెళ్లి- స్నేహా రెడ్డిపై అల్లు అర్జున్ పోస్ట్- గిఫ్ట్‌పై మంచు లక్ష్మి ఆసక్తి
ఒకేరోజు అన్న యానివర్సరీ, తమ్ముడి పెళ్లి- స్నేహా రెడ్డిపై అల్లు అర్జున్ పోస్ట్- గిఫ్ట్‌పై మంచు లక్ష్మి ఆసక్తి

అల్లు అర్జున్ లాగే తమ్ముడు అల్లు శిరీష్

సరిగ్గా ఇదే రోజున (మార్చి 6) అన్న అల్లు అర్జున్ లాగే తమ్ముడు అల్లు శిరీష్ తన చిరకాల ప్రేయసి నయనిక రెడ్డితో ఏడడుగులు వేస్తుండటం విశేషం. తమ్ముడి పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ, బన్నీ తన ప్రియమైన భార్య స్నేహా రెడ్డికి సోషల్ మీడియా వేదికగా అత్యంత ప్రేమపూర్వకమైన శుభాకాంక్షలు తెలిపారు.

హ్యాపీ యానివర్సరీ క్యూటీ..

అల్లు అర్జున్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్నేహా రెడ్డితో కలిసి దిగిన క్యూట్ ఫోటోలను పంచుకున్నారు. అల్లు శిరీష్ ప్రీ-వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా నలుపు రంగు సూట్‌లో బన్నీ, బ్లూ సీక్విన్ డ్రెస్‌లో స్నేహా మెరిసిపోతున్న ఫోటోను షేర్ చేస్తూ.. "హ్యాపీ యానివర్సరీ క్యూటీ. 15 ఏళ్ల ప్రయాణం పూర్తయింది. నువ్వు లేకుండా నా ఈ ప్రయాణం సాధ్యమయ్యేది కాదు" అని తన సక్సెస్ వెనుక ఉన్న స్నేహా పాత్రను కొనియాడారు అల్లు అర్జున్.

నేను చూడాలి అంటూ

మరో అడుగు ముందుకు వేసి తన స్టోరీస్‌లో ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటోను పోస్ట్ చేశారు. అందులో స్నేహ తన భర్తను ప్రేమగా చూస్తున్న క్షణం నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది. దీనిపై బన్నీ స్నేహితురాలు, నటి మంచు లక్ష్మి స్పందిస్తూ.. "సరే యానివర్సరీ విషెస్ బాగున్నాయి కానీ.. అసలు స్నేహకు ఏం గిఫ్ట్ ఇచ్చావో చెప్పు (Tell me), నేను చూడాలి" అంటూ సరదాగా కామెంట్ చేశారు.

అల్లు శిరీష్-నయనికల కళ్యాణం

తమ్ముడు శిరీష్ పెళ్లి విషయంలో అల్లు అర్జున్ అన్ని పనులను దగ్గరుండి చూసుకుంటున్నారు. 2023లో వరుణ్ తేజ్-లావణ్యల కోసం నితిన్ దంపతులు ఇచ్చిన పార్టీలో శిరీష్-నయనికల మధ్య పరిచయం ఏర్పడింది.

రెండేళ్ల ప్రేమ తర్వాత

రెండేళ్ల ప్రేమ తర్వాత గతేడాది అక్టోబర్‌లో వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారు. దుబాయ్‌లో యాచ్ పార్టీ, హైదరాబాద్‌లో కాక్‌టేయిల్ పార్టీలతో సందడిగా మొదలైన ఈ వేడుకలు, నేడు వివాహంతో ముగియనున్నాయి.

అల్లు-కొణిదెల కుటుంబ సభ్యులందరూ

దక్షిణాది సంప్రదాయం ప్రకారం సంగీత్ వేడుకను పక్కన పెట్టి, కేవలం పసుపు దంచడం, మంగళ స్నానం వంటి శాస్త్రోక్తంగా వేడుకలు నిర్వహించారు. ఈ వివాహ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, ఉపాసన, నిహారికతో పాటు అల్లు-కొణిదెల కుటుంబ సభ్యులందరూ హాజరుకానున్నారు.

స్నేహా రెడ్డికి అల్లు అర్జున్ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు (Instagram@ Allu Arjun )
స్నేహా రెడ్డికి అల్లు అర్జున్ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు (Instagram@ Allu Arjun )

పుష్ప తర్వాత..

ఐదేళ్ల పాటు సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సిరీస్ కోసం ప్రాణం పెట్టిన బన్నీ, ఇప్పుడు తన తదుపరి చిత్రాలకు సిద్ధమవుతున్నారు. అట్లీ దర్శకత్వంలో దీపికా పదుకొణె హీరోయిన్‌గా ఒక చిత్రం, అలాగే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో మరో భారీ ప్రాజెక్టు పట్టాలెక్కనున్నాయి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More