Ram Charan Twins: కవల పిల్లకు నామకరణం చేసిన రామ్ చరణ్, ఉపాసన- చిరంజీవి పేరుతో పాటు లోతైన అర్థం చెప్పిన గ్లోబల్ స్టార్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు తమ కవల పిల్లల పేర్లను ప్రపంచానికి పరిచయం చేశారు. బాబుకు 'శివరామ్', పాపకు 'అన్వీరా దేవి' అని నామకరణం చేసినట్లు రామ్ చరణ్ దంపతులు వెల్లడించారు. ఈ పేర్ల వెనుక ఉన్న ఆధ్యాత్మిక నేపథ్యం, కుటుంబ వారసత్వం గురించి చరణ్ పంచుకున్న విశేషాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Published on: Feb 13, 2026, 07:46:43 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. జనవరి 31న కవలలకు జన్మనిచ్చిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన దంపతులు, తాజాగా తమ చిన్నారుల నామకరణ వేడుకను హైదరాబాద్‌లోని తమ నివాసంలో అత్యంత సన్నిహితుల మధ్య వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తమ కుమారుడికి 'శివరామ్' అని, కుమార్తెకు 'అన్వీరా దేవి' అని పేరు పెట్టినట్లు ఈ జంట అధికారికంగా ప్రకటించింది.

కవల పిల్లకు నామకరణం చేసిన రామ్ చరణ్, ఉపాసన- చిరంజీవి పేరుతో పాటు లోతైన అర్థం చెప్పిన గ్లోబల్ స్టార్! (Instagram)
కవల పిల్లకు నామకరణం చేసిన రామ్ చరణ్, ఉపాసన- చిరంజీవి పేరుతో పాటు లోతైన అర్థం చెప్పిన గ్లోబల్ స్టార్! (Instagram)

పేర్ల వెనుక ఉన్న లోతైన అర్థం..

పిల్లల పేర్ల ఎంపిక గురించి రామ్ చరణ్ మాట్లాడుతూ, ఇది కేవలం పేరు పెట్టడం మాత్రమే కాదని, ఒక ఆధ్యాత్మిక నిర్ణయమని పేర్కొన్నారు.

"పిల్లలకు పేర్లు పెట్టడం మా ఇద్దరికీ చాలా వ్యక్తిగతమైన, ఆధ్యాత్మికమైన విషయం. ఈ ప్రయాణంలో మా తల్లిదండ్రుల సూచనలు మాకు ఎంతో కీలకం. మా కుమారుడి పేరు 'శివరామ్'.. ఇది శివుడు, రాముడు అనే ఇద్దరు దేవుళ్ల ఆదర్శాలకు ప్రతిరూపం. అంతేకాకుండా, మా నాన్న (చిరంజీవి) గారి అసలు పేరు 'శివశంకర్ వరప్రసాద్'లోని కొంత భాగాన్ని కూడా ఇది కలిగి ఉంది. ఇది ఆయనపై మాకున్న కృతజ్ఞతకు నిదర్శనం" అని రామ్ చరణ్ వివరించారు.

కుమార్తె పేరు గురించి చెబుతూ.. "'అన్వీరా దేవి' అంటే అపరిమితమైన ధైర్యం, దైవిక శక్తి అని అర్థం. 'వీర' అంటే ధైర్యం, దేవి అంటే శక్తికి చిహ్నం. మా పిల్లలు శక్తివంతంగా, దయతో పెరగాలనే మా ఆకాంక్షకు ఈ పేర్లు ప్రతిరూపాలు" అని రామ్ చరణ్ మురిపెంగా చెప్పుకొచ్చారు.

రెండోసారి మాతృత్వంపై ఉపాసన స్పందన..

ముగ్గురు పిల్లల తల్లిగా తన అనుభూతిని పంచుకుంటూ ఉపాసన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "మొదటిసారి (క్లిన్ కారా పుట్టినప్పుడు) అంతా కొత్తగా, కొంచెం గందరగోళంగా అనిపించేది. కానీ, ఈసారి మాతృత్వం చాలా ప్రశాంతంగా, స్పష్టంగా అనిపిస్తోంది. ఇప్పుడు నేను చిన్న చిన్న విషయాలకు కంగారు పడకుండా చాలా రిలాక్స్‌డ్‌గా ఉంటున్నాను" అని ఉపాసన తెలిపారు.

"ముగ్గురు పిల్లలను కలిపి చూస్తుంటే కలిగే ఆ తృప్తి వెలకట్టలేనిది. చరణ్ కూడా పిల్లల బాధ్యతల్లో నాకు ఎంతో తోడుగా ఉంటున్నారు. ముఖ్యంగా క్లిన్ కారాను ఆయనే చూసుకుంటున్నారు" అని ఉపాసన కొణిదెల పేర్కొన్నారు.

వారసత్వం అంటే తిరిగి ఇవ్వడమే!

తమ పిల్లలను ఎంతో బాధ్యత గల వ్యక్తులుగా పెంచాలని ఈ దంపతులు లక్ష్యంగా పెట్టుకున్నారు. "మా పిల్లలు సమాజం పట్ల అవగాహనతో, దయతో పెరగాలని ఆశిస్తున్నాము. వారసత్వం అంటే కేవలం ఆస్తులు ఇవ్వడం కాదు, సమాజానికి తిరిగి ఇవ్వడమే నిజమైన వారసత్వం అని మేము నమ్ముతున్నాము" అని ఉపాసన భావోద్వేగంగా పేర్కొన్నారు.

ప్రస్తుతం మెగా కుటుంబంలో సంబరాలు అంబరాన్నంటాయి. క్లిన్ కారా ఇప్పుడు తన తమ్ముడు, చెల్లితో కలిసి ఆడుకుంటున్న వీడియోల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More