OTT Telugu: ఓటీటీలోకి మన శంకర వరప్రసాద్ గారు- చిరంజీవి, నయనతార, వెంకటేష్ కామెంట్స్ ఇవే- హృదయాన్ని తాకే బంధాలతో అంటూ!

మెగాస్టార్ చిరంజీవి, నయనతార, వెంకటేష్ కలిసి నటించిన అనిల్ రావిపూడి కామెడీ యాక్షన్ థ్రిల్లర్ మన శంకర వరప్రసాద్ గారు ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా చిరంజీవి, నయనతార, వెంకటేష్ కామెంట్స్ చేశారు. హృదయాన్ని తాకే బంధాలతో అంటూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Feb 6, 2026, 11:52:47 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఈ ఏడాది సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బ్లాక్ బ‌స్ట‌ర్ స‌క్సెస్‌ను సాధించింది. ఇప్పుడు ఈ మన శంకర వర ప్రసాద్ గారు మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యేందుకు రెడీ అవుతోంది.

ఓటీటీలోకి మన శంకర వరప్రసాద్ గారు- చిరంజీవి, నయనతార, వెంకటేష్ కామెంట్స్ ఇవే- హృదయాన్ని తాకే బంధాలతో అంటూ!
ఓటీటీలోకి మన శంకర వరప్రసాద్ గారు- చిరంజీవి, నయనతార, వెంకటేష్ కామెంట్స్ ఇవే- హృదయాన్ని తాకే బంధాలతో అంటూ!

మన శంకర వరప్రసాద్ గారు ఓటీటీ రిలీజ్

ప్ర‌ముఖ ఓటీటీ మాధ్య‌మం జీ5లో ఫిబ్ర‌వ‌రి 11న మన శంకర వరప్రసాద్ ఓటీటీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చిరంజీవి, నయనతార, వెంకటేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు నెట్టింట్లో చిరంజీవి, నయనతార, వెంకటేష్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

బంధాలు బాంధవ్యాల గురించి

మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. "మన శంకర వర ప్రసాద్ గారు అనేది కుటుంబంలోని బంధాలు, బాంధవ్యాలు గురించి చెప్పిన ఎంట‌ర్‌టైన‌ర్‌. ఈ సినిమాపై థియేటర్లలో ప్రేక్షకులు చూపిన ప్రేమ మాకెంతో ఆనందాన్నిచ్చింది" అని అన్నారు.

ప్రజల ఇళ్లలోకి చేరడం

"ఇప్పుడు జీ5 ఓటీటీ ద్వారా ఈ సినిమా ఇంకా ఎక్కువ భాషల్లో, ఎక్కువ దేశాల్లో ఉన్న ప్రేక్షకుల దగ్గరకు చేరువ కానుండంటం మ‌రింత సంతోషంగా ఉంది. ఒక కథ సినిమాహాళ్లను దాటి, నేరుగా ప్రజల ఇళ్లలోకి చేరడం అనేది ఎప్పుడూ చాలా ప్రత్యేకమే" అని మెగాస్టార్ చిరంజీవి అభిప్రాయపడ్డారు.

యాక్షన్ ఎలిమెంట్స్ కూడా

న‌య‌న‌తార మాట్లాడుతూ.. "ఈ సినిమాలో మంచి ఎమోషన్స్ ఉన్నాయి. దీనికి తోడు చక్కటి హాస్యం, మంచి యాక్షన్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. ఈ క‌ల‌యిక‌లో రూపొందట‌మే ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టింది" అని అన్నారు.

ఇంట్లో కూర్చుని ఆస్వాదిస్తారని

"చిరంజీవి గారితో పాటు మొత్తం టీమ్‌తో కలిసి పని చేయడం నాకు చాలా మంచి ఎక్స్‌పీరియెన్స్‌. థియేటర్లలో చూడలేకపోయిన ప్రేక్షకులు ఇప్పుడు జీ5లో ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాను ఇంట్లో కూర్చొని చూసి ఈ ప్రయాణాన్ని ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాను" అని లేడి సూపర్ స్టార్ నయనతార పేర్కొన్నారు.

హృదయాన్ని తాకే బంధాలతో

వెంక‌టేష్ ద‌గ్గుబాటి మాట్లాడుతూ "మన శంకర వర ప్రసాద్ గారు సినిమాలో నాకు నచ్చిన విషయం ఏమిటంటే, చక్కటి వినోదాన్ని.. హృదయాన్ని తాకే బంధాలతో, ఎమోష‌న్స్‌తో చ‌క్క‌గా క‌ల‌గలిపి సినిమా చేశారు. చిరంజీవి గారితో తొలిసారి కలిసి పని చేయడంతో ఈ జ‌ర్నీ నాకింకా ప్రత్యేకంగా మారింది" అని తెలిపారు.

జీ5 ఓటీటీ ద్వారా

"ఇప్పుడు మన శంకర వరప్రసాద్ గారు జీ5 ఓటీటీ ద్వారా అనేక భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల వరకు చేరుతుండటం చాలా సంతోషంగా ఉంది. కుటుంబం అంతా కలిసి ఈ సినిమాలోని భావోద్వేగం, హాస్యం, డ్రామాను ఆస్వాదిస్తార‌నే న‌మ్మ‌కం ఉంది" అని వెంకటేష్ ఆశించారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More