Twins: కవల పిల్లలకు జన్మనిచ్చిన రామ్ చరణ్ ఉపాసన- మెగా ఇంట్లోకి ఒకేసారి అడుగుపెట్టిన బాబు, పాప- చిరంజీవి పోస్ట్ వైరల్

Ram Charan Upasana Konidela Blessed With Twins: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కొణిదెల దంపతులు కవల పిల్లలకు జన్మనిచ్చారు. ఒక బాబు, ఒక పాప పుట్టడంతో మెగా కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా మెగాస్టార్ చిరంజీవి పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు.

Published on: Feb 1, 2026, 06:24:47 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మెగా అభిమానులకు ఇది అసలైన పండుగ వార్త. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతుల కుటుంబంలోకి కొత్త అతిథులు అడుగుపెట్టారు. శనివారం (జనవరి 31) ఉపాసన కవల పిల్లలకు జన్మనిచ్చారు. ఒక బాబు, ఒక పాప పుట్టడంతో కొణిదెల, కామినేని కుటుంబాల్లో ఆనందం అంబరాన్నంటింది.

కవల పిల్లలకు జన్మనిచ్చిన రామ్ చరణ్ ఉపాసన- మెగా ఇంట్లోకి ఒకేసారి అడుగుపెట్టిన బాబు, పాప- చిరంజీవి పోస్ట్ వైరల్
కవల పిల్లలకు జన్మనిచ్చిన రామ్ చరణ్ ఉపాసన- మెగా ఇంట్లోకి ఒకేసారి అడుగుపెట్టిన బాబు, పాప- చిరంజీవి పోస్ట్ వైరల్

తాతయ్యగా చిరంజీవి మురిపెం

ఈ అద్భుతమైన గుడ్ న్యూస్‌ను మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ధృవీకరించారు. "ఎంతో ఆనందంతో, కృతజ్ఞతా భావంతో ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నాము. చరణ్, ఉపాసనలకు కవలలు (బాబు, పాప) జన్మించారు" అని చిరంజీవి పేర్కొన్నారు.

మాకు దైవప్రసాదంగా

"తల్లీ, పిల్లలు క్షేమంగా ఉన్నారు. తాతామ్మలుగా ఈ చిన్నారులను మా కుటుంబంలోకి ఆహ్వానించడం మాకు దైవప్రసాదంగా భావిస్తున్నాము. మీ అందరి ప్రార్థనలు, ప్రేమకు ధన్యవాదాలు" అని చిరంజీవి తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. దీంతో చిరంజీవి పోస్ట్ ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది.

క్లిన్ కారాకు తోడుగా..

కాగా, రామ్ చరణ్, ఉపాసన 2012 జూన్‌లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత 2023 జూన్‌లో వీరికి మొదటి సంతానంగా 'క్లిన్ కారా' జన్మించింది.

డబుల్ సెలబ్రేషన్ అంటూ

ఇక 2025 దీపావళి సమయంలో ఉపాసన తన సీమంతం వీడియోను పంచుకుంటూ 'డబుల్ సెలబ్రేషన్' అంటూ కవలల రాకపై అప్పట్లోనే హింట్ ఇచ్చారు. ఇప్పుడు ఆ ముచ్చట తీరడంతో అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మెగా కుటుంబంలోకి ఒకేసారి చిన్నారి బాబు, పాప రావడంతో చిరు ఫ్యామిలీతోపాటు అభిమానుల్లో సంతోషం వెల్లివిరుస్తోంది.

సినిమా విశేషాలు

ఇక కెరీర్ విషయానికొస్తే.. రామ్ చరణ్ ఇటీవల 'గేమ్ ఛేంజర్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాలను అందుకుంది.

పీరియాడిక్ ఫిల్మ్

ప్రస్తుతం రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా 'పెద్ది' (Peddi) అనే స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్నారు. దీనితో పాటు నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా రూపొందుతున్న పీరియాడిక్ ఫిల్మ్ 'ది ఇండియా హౌస్'ను రామ్ చరణ్ స్వయంగా నిర్మిస్తున్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More