చిరంజీవి నుంచి శర్వానంద్ వరకు- ఓటీటీలోకి 6 గురు హీరోలతో 5 సంక్రాంతి సినిమాలు- ఒకేదాంట్లో 2- ఏది ఎక్కడ చూడాలంటే?

ఓటీటీలోకి ఈ ఏడాది 2026 సంక్రాంతి సినిమాలు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌పై ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది. ఈ సంక్రాంతికి చిరంజీవి నుంచి శర్వానంద్ వరకు మొత్తంగా ఆరుగురు హీరోలతో ఐదు సినిమాలు థియేటర్లలో సందడి చేస్తున్నాయి. మరి ఆ సినిమాల ఓటీటీ రిలీజ్ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Jan 15, 2026, 19:35:10 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రతి ఏడాది సంక్రాంతికి థియేటర్లలో సినిమాలు సందడి చేస్తుంటాయి. ఈ సంవత్సరం 2026 సంక్రాంతికి అయితే ఏకంగా ఆరుగురు హీరోలతో ఐదు సినిమాలు అలరించేందుకు వచ్చాయి.

చిరంజీవి నుంచి శర్వానంద్ వరకు- ఓటీటీలోకి 6 గురు హీరోలతో 5 సంక్రాంతి సినిమాలు- ఒకేదాంట్లో 2- ఏది ఎక్కడ చూడాలంటే?
చిరంజీవి నుంచి శర్వానంద్ వరకు- ఓటీటీలోకి 6 గురు హీరోలతో 5 సంక్రాంతి సినిమాలు- ఒకేదాంట్లో 2- ఏది ఎక్కడ చూడాలంటే?

సంక్రాంతి మూవీస్ ఓటీటీలు

ఇప్పుడు ఆ సంక్రాంతి సినిమాల ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది. చిరంజీవి నుంచి శర్వానంద్ వరకు గల ఐదు సినిమాల ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడెక్కడో ఇక్కడ తెలుసుకుందాం. వాటిలో రెండు సినిమాలు ఒకే ఓటీటీలో రిలీజ్ కావడం విశేషం.

ది రాజా సాబ్ ఓటీటీ

సంక్రాంతి 2026 బాక్సాఫీస్ బరిలో దిగిన మొదటి సినిమా ది రాజా సాబ్. రెబల్ స్టార్ ప్రభాస్, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరో హీరోయిన్లుగా నటించిన హారర్ కామెడీ ఫాంటసీ థ్రిల్లర్ సినిమా ఇది. డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహించిన ది రాజా సాబ్ జనవరి 12న థియేటర్లలో విడుదల అయింది.

వింటేజ్ ప్రభాస్‌ను చూశామని ఫ్యాన్స్ మురిసిపోతుంటే స్టోరీ కాన్సెప్ట్ బాగున్నా టేకింగ్‌లో పొరపాట్లు జరిగాయంటూ మిశ్రమ రెస్పాన్స్ వస్తోంది. అయితే, ది రాజా సాబ్ ఓటీటీ రైట్స్‌ను జియో హాట్‌స్టార్ కొనుగోలు చేసింది.

ఓటీటీ-శాటిలైట్ ధరలు

అలాగే శాటిలైట్ హక్కులను స్టార్ మా సొంతం చేసుకుంది. రిలీజ్‌కు ముందే ది రాజా సాబ్ ఓటీటీ, శాటిలైట్ రైట్స్ రెండింటిని సుమారుగా రూ. 180 నుంచి 200 కోట్ల వరకు చెల్లించి హాట్‌స్టార్, స్టార్ మా దక్కించుకున్నట్లు సమాచారం.

మన శంకర వరప్రసాద్ గారు ఓటీటీ

మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, నయనతార, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన ఫ్యామిలీ కామెడీ డ్రామా సినిమా మన శంకర వరప్రసాద్ గారు. ఫ్యామిలీ ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అయిన ఈ సినిమా జనవరి 12 నుంచి థియేటర్లలో సందడి చేస్తోంది.

ప్రముఖ సంస్థ జీ గ్రూప్ మన శంకర వరప్రసాద్ గారు ఓటీటీ, శాటిలైట్ హక్కులను సొంతం చేసుకుంది. జీ5లో మన శంకర వరప్రసాద్ గారు ఓటీటీ స్ట్రీమింగ్ అయితే, జీ తెలుగులో టీవీ ప్రీమియర్ కానుంది. ఫిబ్రవరిలో వాలెంటైన్స్ డే సందర్భంగా మన శంకర వరప్రసాద్ గారు ఓటీటీ రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.

భర్త మహాశయులకు విజ్ఞప్తి ఓటీటీ

కిశోర్ తిరుమల డైరెక్షన్‌లో రవితేజ, డింపుల్ హయాతి, ఆషిక రంగనాథ్ నటించిన ఫ్యామిలీ రొమాంటిక్ కామెడీ సినిమా ఇది. జనవరి 13న థియేటర్లలో విడుదలైన భర్త మహాశయులకు విజ్ఞప్తి ఓటీటీ హక్కులను కూడా జీ5 సొంతం చేసుకుంటే శాటిలైట్ రైట్స్‌ను జీ తెలుగు దక్కించుకుంది. ఫిబ్రవరి రెండో వారంలో భర్త మహాశయులకు విజ్ఞప్తి ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నట్లు టాక్.

అనగనగా ఒక రాజు ఓటీటీ

కామెడీతో నవ్వించే నవీన్ పోలిశెట్టి, బ్యూటిపుల్ మీనాక్షి చౌదరి జోడీ కట్టిన విలేజ్ కామెడీ డ్రామా మూవీ అనగనగా ఒక రాజు. మారి డైరెక్టర్‌గా పరిచయం అయిన ఈ సినిమా జనవరి 14 నుంచి థియేటర్లలో సందడి చేస్తోంది.

అనగనగా ఒక రాజు ఓటీటీ హక్కులను దిగ్గజ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. మార్చి మొదటి వారంలో నెట్‌ఫ్లిక్స్‌లో అనగనగా ఒక రాజు ఓటీటీ ప్రీమియర్ అయ్యే ఛాన్స్ ఉందని సమాచారం.

నారీ నారీ నడుమ మురారి ఓటీటీ

ఇద్దరు ముద్దుగుమ్మలు సంయుక్త మీనన్, సాక్షి వైద్య మధ్య నలిగే హీరోగా శర్వానంద్ నటంచిన రొమాంటిక్ కామెడీ చిత్రం ఇది. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 14న సాయంత్రం షో నుంచి దూసుకుపోతోంది.

సంక్రాంతి పర్‌ఫెక్ట్ మూవీగా పేరు తెచ్చుకుంటోన్న నారీ నారీ నడుమ మురారి మూవీ ఓటీటీ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ చేజిక్కుంచుకుంది. సుమారు రూ. 17.5 కోట్లు వెచ్చించి ఈ మూవీ హక్కులు కొనుగోలు చేసింది. దాంతో అమెజాన్ ప్రైమ్ వీడియోలో నారీ నారీ నడుమ మురారి ఓటీటీ స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది.

హీరోసినిమా పేరుథియేటర్ రిలీజ్ డేట్ఓటీటీ ప్లాట్‌ఫామ్జోనర్ (Genre)
ప్రభాస్ది రాజా సాబ్జనవరి 9, 2026జియో హాట్‌స్టార్హారర్ రొమాంటిక్ కామెడీ
చిరంజీవి, వెంకటేష్మన శంకర వరప్రసాద్ గారుజనవరి 12, 2026జీ5 (ZEE5)యాక్షన్ ఫ్యామిలీ కామెడీ
రవితేజభర్త మహాశయులకు విజ్ఞప్తిజనవరి 13, 2026జీ5 (ZEE5)రొమాంటిక్ కామెడీ డ్రామా
నవీన్ పోలిశెట్టిఅనగనగా ఒక రాజుజనవరి 14, 2026నెట్‌ఫ్లిక్స్కామెడీ డ్రామా
శర్వానంద్నారి నారి నడుమ మురారిజనవరి 14, 2026అమెజాన్ ప్రైమ్ఫ్యామిలీ ఎంటర్‌టైనర్

ఒక మూవీలో ఇద్దరు హీరోలు

ఇలా ఆరుగురు హీరోలతో తెరకెక్కిన ఐదు సంక్రాంతి 2026 సినిమాలు జియో హాట్‌స్టార్, జీ5, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి 4 ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో ప్రతి సినిమాలో సోలో హీరో ఉంటే ఒక్క చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారులో వెంకటేష్ కూడా యాక్ట్ చేయడం విశేషం.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More