ఓటీటీలోకి తెలుగులో ఏకంగా 13 సినిమాలు- అన్నీ స్పెషలే, 6 మాత్రం ఇంట్రెస్టింగ్- నెట్‌ఫ్లిక్స్ టు ఈటీవీ విన్-అన్ని జోనర్లలో!

ఓటీటీలో గత వారం తెలుగు భాషలో ఏకంగా 13 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో అన్నీ స్పెషల్‌గా ఉండగా తెలుగులో స్ట్రయిట్‌గా ఓటీటీ రిలీజ్ అయిన ఆరు సినిమాలు ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్, జీ5, సన్ నెక్ట్స్, ఈటీవీ విన్ ఓటీటీ స్ట్రీమింగ్ మూవీస్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Jan 12, 2026, 14:30:32 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలోకి గత వారం తెలుగులో ఏకంగా 13 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. ఫాంటసీ, సైకలాజికల్, రొమాంటిక్, కామెడీ, అడ్వెంచర్ వంటి విభిన్న జోనర్లలో ఓటీటీ రిలీజ్ అయిన ఆ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

ఓటీటీలోకి తెలుగులో ఏకంగా 13 సినిమాలు- అన్నీ స్పెషలే, 6 మాత్రం ఇంట్రెస్టింగ్- నెట్‌ఫ్లిక్స్ టు ఈటీవీ విన్-అన్ని జోనర్లలో!
ఓటీటీలోకి తెలుగులో ఏకంగా 13 సినిమాలు- అన్నీ స్పెషలే, 6 మాత్రం ఇంట్రెస్టింగ్- నెట్‌ఫ్లిక్స్ టు ఈటీవీ విన్-అన్ని జోనర్లలో!

జిగ్రీస్ ఓటీటీ: నలుగురు ఫ్రెండ్స్ కలిసి ఒక్క రూపాయి లేకుండా గోవాకు వెళ్లే కథతో తెరకెక్కిన సినిమానే జిగ్రీస్. సన్ నెక్ట్స్‌, అమెజాన్ ప్రైమ్ రెండింట్లో జనవరి 6 నుంచి జిగ్రీస్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

సైలెంట్ స్క్రీమ్స్ ఓటీటీ: తెలంగాణలో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందిన సైలెంట్ స్క్రీమ్స్ కూడా సన్ నెక్ట్స్ ఓటీటీలో జనవరి 8 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది.

మళ్లీ వచ్చిన వసంతమ్: ఓటీటీలో తెలుగులో డైరెక్టర్ ఓటీటీ రిలీజ్ అయిన రొమాంటిక్ డ్రామా మూవీనే మళ్లీ వచ్చిన వసంతమ్. ఈటీవీ విన్‌లో జనవరి 11 నుంచి మళ్లీ వచ్చిన వసంతమ్ ఓటీటీ ప్రీమియర్ అవుతోంది.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

హిజ్ అండ్ హర్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైకలాజికల్ మిస్టరీ వెబ్ సిరీస్)- జనవరి 8

అఖండ 2 (తెలుగు మైథలాజికల్ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- జనవరి 9

పీపుల్ వుయ్ మెట్ ఆన్ వెకేషన్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ రొమాంటిక్ సినిమా)- జనవరి 9

సన్ నెక్ట్స్ ఓటీటీ

జిగ్రీస్ (తెలుగు కామెడీ అడ్వెంచర్ డ్రామా ఫిల్మ్)- జనవరి 6

సైలెంట్ స్క్రీమ్స్: ది లాస్ట్ గర్ల్స్ ఆఫ్ తెలంగాణ (తెలుగు ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ సినిమా)- జనవరి 8

రాధేయ (తెలుగు డబ్బింగ్ కన్నడ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ)- జనవరి 8

ఈటీవీ విన్ ఓటీటీ

కానిస్టేబుల్ కనకం సీజన్ 2 (తెలుగు మిస్టరీ అడ్వెంచర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జనవరి 8

మళ్లీ వచ్చిన వసంతమ్ (తెలుగు రొమాంటిక్ డ్రామా సినిమా)- జనవరి 11

ఆయలాన్ (తెలుగు డబ్బింగ్ తమిళ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ కామెడీ యాక్షన్ డ్రామా ఫిల్మ్)- ఆహా ఓటీటీ- జనవరి 7

బీస్ట్ గేమ్స్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ రియాలిటీ కాంపిటీషన్ అడ్వెంచర్ గేమ్ షో)- అమెజాన్ ప్రైమ్ ఓటీటీ- జనవరి 7

డ్యుయల్: నాట్ ఆల్ మూవీస్ ఆర్ ది సేమ్ (తెలుగు జాంబీ సైన్స్ ఫిక్షన్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- జనవరి 9

ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ హిందీ బయోగ్రఫీ హిస్టారికల్ ఫిక్షన్ వెబ్ సిరీస్)- సోనీ లివ్ ఓటీటీ- జనవరి 9

ది పిట్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ మెడికల్ డ్రామా వెబ్ సిరీస్)- జియో హాట్‌స్టార్ ఓటీటీ- జనవరి 9

ఓటీటీలోకి తెలుగులో 13

ఇలా గత వారం (జనవరి 5 నుంచి 11 వరకు) తెలుగు భాషలో ఏకంగా 13 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వీటిలో దాదాపు అన్నీ చూసేందుకు స్పెషల్‌గానే ఉన్నాయి.

ఇంట్రెస్టింగ్‌గా 6

అయితే వీటన్నింటిలో తెలుగు స్ట్రయిట్ సినిమాలు అయిన అఖండ 2 తాండవం, జిగ్రీస్, సైలెంట్ స్క్రీమ్స్, కానిస్టేబుల్ కనకం 2, మళ్లీ వచ్చిన వసంతమ్, డ్యుయల్ 6 ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More