సోలో హీరోగా సంగీత్ శోభన్ తొలి సినిమా- రాకాస టైటిల్ పోస్టర్ రిలీజ్- ఓటీటీ సిరీస్ డైరెక్టర్ దర్శకత్వం, నిర్మాతగా నిహారిక
సంగీత్ శోభన్ సోలో హీరోగా రూపొందిన తొలి సినిమా రాకాస. తాజాగా రాకాస టైటిల్ మోషన్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మిస్తోన్న ఈ సినిమాకు ఓటీటీ సిరీస్ డైరెక్టర్ మానస శర్మ దర్శకురాలిగా పరిచయం కానున్నారు. సమ్మర్ సందర్భంగా రాకాస మూవీని విడుదల చేయనున్నట్లు తెలిపారు.
మెగా డాటర్, నిర్మాత నిహారిక కొణిదెల 2024లో విడుదలైన ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుని తెలుగు చిత్రపరిశ్రమలో సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్‌గా తన మార్క్‌ను క్రియేట్ చేశారు. ఇప్పుడు జీ స్టూడియోస్ సమర్పణలో.. నిహారిక తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మాతగా మరో సినిమాను నిర్మిస్తున్నారు.

రాకాస టైటిల్ ఫిక్స్
ఉమేష్ కుమార్ బన్సాల్‌తో నిహారిక కొణిదెల కలిసి నిర్మిస్తోన్న చిత్రానికి ‘రాకాస’ అనే టైటిల్ ఖరారు చేశారు. రాకాస టైటిల్ మోషన్ పోస్టర్‌ను తాజాగా విడుదల చేశారు మేకర్స్. అలాగే, రాకాస సినిమాను ఏప్రిల్ 3న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.
సోలో హీరోగా సంగీత్ శోభన్
‘రాకాస’ చిత్రానికి మానస శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ చిత్రాల్లో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న యంగ్ టాలెంటెడ్ హీరో సంగీత్ శోభన్ ఈ చిత్రంలో కథానాయకుడిగా మెప్పించనున్నారు. సంగీత్ సోలో హీరోగా నటించనున్న తొలి సినిమా ఇదే.
ఓటీటీ సిరీస్ డైరెక్టర్
ఇది వరకే నిహారిక కొణిదెల రూపొందించిన ఓటీటీ వెబ్ ప్రాజెక్ట్స్‌లో హీరో సంగీత్ శోభన్, డైరెక్టర్ మానస శర్మ భాగమయ్యారు. జీ5 ఓటీటీతో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ రూపొందించిన ఓటీటీ సిరీస్ ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’లో సంగీత్ శోభన్ ప్రధాన పాత్రలో నటిస్తే.. మానస శర్మ రచయితగా వర్క్ చేశారు.
ఫీచర్ ఫిల్మ్ డైరెక్టర్‌గా మానస
తర్వాత మానస శర్మ సోనీ లివ్ ఓటీటీ రూపొందించిన ‘బెంచ్ లైఫ్’కి దర్శకురాలిగా పని చేశారు. తాజాగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, జీ5 ఓటీటీ బ్యానర్స్‌పై రూపొందుతోన్న రాకాస చిత్రంతో మానస శర్మ ఫీచర్ ఫిల్మ్ డైరెక్టర్‌గా పరిచయమవుతున్నారు.
ఫాంటసీ కామెడీ మూవీ
ఈ సందర్భంగా నిర్మాతలు నిహారిక కొణిదెల, ఉమేష్ కుమార్ బన్సాల్ మాట్లాడుతూ ‘‘సంగీత్ శోభన్‌ను హీరోగా పరిచయం చేస్తూ మేం స్టార్ట్ చేసిన సినిమాకు ‘రాకాస’ అనే టైటిల్‌ను ఖరారు చేశాం. ఇదొక ఫాంటసీ కామెడీ మూవీ. నయన్ సారిక హీరోయిన్‌గా నటిస్తోంది’’ అని తెలిపారు.
సమ్మర్ సందర్భంగా రిలీజ్
‘‘ఒక సాంగ్, నాలుగు రోజుల టాకీ పార్ట్ చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. త్వరలోనే దాన్ని కంప్లీట్ చేస్తాం. సమ్మర్ సందర్బంగా ఏప్రిల్ 3న రాకాస మూవీని రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని ప్రొడ్యూసర్స్ నిహారిక కొణిదెల, ఉమేష్ కుమార్ బన్సాల్ వెల్లడించారు.
రాకాస నటీనటులు
ఇకపోతే రాకాస సినిమాకు అనుదీప్ దేవ్ సంగీత సారథ్యం వహించగా.. రాజు ఎదురోలు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమాలో సంగీత్ శోభన్, నయన్ సారికతోపాటు వెన్నెల కిశోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను, సుక్విందర్ సింగ్, అన్నపూర్ణ, అమన్, అనూప్ సింగ్ ఠాకూర్, రమణ భార్గవ్, వాసు ఇంటూరి, రోహిణి (బజర్దస్త్), రోహన్ (నైంటీస్) తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


