ద్రౌపది 2 నుంచి తారాసుకి రామ్ సాంగ్ రిలీజ్- విలన్‌పై భారీ సెట్‌లో పాట- లిరిక్స్ రాసిన మూవీ డైరెక్టర్ మోహన్ జీ
రిచర్డ్ రిషి హీరోగా, రక్షణ ఇందుసుదన్ హీరోయిన్‌గా తెరకెక్కిన మూవీ ద్రౌపది 2. ఈ సినిమాలో చిరాగ్ జానీ విలన్‌గా చేస్తున్నారు. మోహన్ జీ దర్శకత్వం వహించిన ద్రౌపది 2 నుంచి తారాసుకి రామ్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. విలన్‌పై కంపోజ్ చేసిన ఈ పాటను భారీ సెట్‌లో నిర్మించారు. ఈ పాటకు డైరెక్టర్ మోహన్ రచన చేయడం విశేషం.
హీరో రిచర్డ్ రిషి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ద్రౌపది 2. నేతాజి ప్రొడక్షన్స్, జీఎం ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్ల మీద సోల చక్రవర్తి భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే డిఫరెంట్ ప్రమోషనల్ యాక్టివిటీస్‌తో ద్రౌపది 2 సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.

విలన్‌గా చిరాగ్ జానీ
ఈ సినిమాలో రిచర్డ్ రిషి హీరోగా చేయగా ఆయనకు జోడీగా రక్షణ ఇందుసుదన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, ఈ సినిమాలో చిరాగ్ జానీ విలన్‌గా చేస్తున్న ద్రౌపది 2 మూవీకి మోహన్ జీ దర్శకత్వం వహించారు. వీరి పాత్రలకు సంబంధించిన లుక్స్‌ను, నెలరాజె.. అనే పాటను విడుదల చేయగా సూపర్బ్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.
విలన్‌పై భారీ బడ్జెట్‌తో పాట
తాజాగా బుధవారం (జనవరి 7) రోజున ద్రౌపది 2 సినిమా నుంచి ‘తారాసుకి రామ్’ అనే పాటను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో మహమ్మద్ బిన్ తుగ్లక్ పాత్రలో నటిస్తోన్న చిరాగ్ జానీపై ఈ పాటను చిత్రీకరించారు. అంటే విలన్‌పై పాటను కంపోజ్ చేశారని తెలుస్తోంది. ఈ పాట కోసం భారీ సెట్ వేసి మరీ చిత్రీకరించారు.
పీరియాడిక్ టచ్
పీరియాడిక్ టచ్‌తో సాగే ఈ పాట మంచి బీట్‌తో ఆకట్టుకుంటోంది. జిబ్రాన్ సంగీత సారథ్యంలో చిత్ర దర్శకుడు మోహన్.జి రాసిన ఈ తారాసుకి రామ్ పాటను జిబ్రాన్, గోల్డ్ దేవరాజ్, గురు హరిరాజ్ ఆలపించారు.
ద్రౌపది 2 నటీనటులు
ఇంకా ఈ ద్రౌపది 2 చిత్రంలో నట్టి నటరాజ్ ఒక కీలక పాత్రలో నటిస్తుండగా.. వైజీ మహేంద్రన్, నడోడిగల్ బరాణి, సరవణ సుబ్బయ్య, వెల్ రామమూర్తి, దినేష్ లాంబా, గణేష్ గౌరాంగ్, దివి, దేవయానీ శర్మ, అరుణోదయన్ తదితరులు ఇతర పాత్రల్లో అలరించనున్నారు.
ద్రౌపది 2 సాంకేతిక వర్గం
ఫిలిప్ ఆర్. సుందర్ సినిమాటోగ్రఫీ అందించగా, జిబ్రాన్ సంగీతాన్ని అందించారు. యాక్షన్ సంతోష్, నృత్యాలను తనిక టోనీ యాక్షన్ సన్నివేశాలను డిజైన్ చేశారు. ఎడిటర్‌గా దేవరాజ్, ప్రొడక్షన్ డిజైనర్‌గా కమల్‌నాథన్ బాధ్యతలను నిర్వహించారు. పద్మ చంద్రశేఖర్, మోహన్.జి డైలాగ్స్ రాశారు.
సెన్సార్ కార్యక్రమాలు పూర్తి
సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ద్రౌపది 2 నుంచి త్వరలోనే ట్రైలర్ రిలీజ్ చేసి, ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున ద్రౌపది 2 రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ద్రౌపది 2 సినిమా రిలీజ్ డేట్‌పై కూడా ప్రకటన త్వరలోనే రానుందని మేకర్స్ పేర్కొన్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


