దుల్కర్ సల్మాన్ కాంత ఓటీటీ రిలీజ్ డేట్‌ ఇదే.. నెల రోజుల్లోపే నెట్‌ఫ్లిక్స్‌లోకి.. లేటెస్ట్ బజ్

దుల్కర్ సల్మాన్ నటించిన కాంత మూవీ నెల రోజుల్లోపే నెట్‌ఫ్లిక్స్ లోకి వస్తోందా? పాజిటివ్ రివ్యూలు వచ్చినా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడిన ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ పై తాజాగా బజ్ నెలకొంది.

Published on: Nov 25, 2025, 21:50:18 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే లీడ్ రోల్స్ లో నటించిన మూవీ కాంత (Kaantha). ఈ తమిళ-తెలుగు మూవీ నవంబర్ 14న థియేటర్లలో రిలీజైంది. దుల్కర్ నటనకు ప్రశంసలు దక్కినా.. బాక్సాఫీస్ దగ్గర ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. దీంతో ఈ సినిమా నెల రోజుల్లోపే డిజిటల్ ప్రీమియర్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.

దుల్కర్ సల్మాన్ కాంత ఓటీటీ రిలీజ్ డేట్‌ ఇదే.. నెల రోజుల్లోపే నెట్‌ఫ్లిక్స్‌లోకి.. లేటెస్ట్ బజ్
దుల్కర్ సల్మాన్ కాంత ఓటీటీ రిలీజ్ డేట్‌ ఇదే.. నెల రోజుల్లోపే నెట్‌ఫ్లిక్స్‌లోకి.. లేటెస్ట్ బజ్

కాంత ఓటీటీ రిలీజ్ డేట్

తమిళంతోపాటు తెలుగులోనూ ఒకేసారి రూపొందించిన సినిమా కాంత. తెలుగులో ఇప్పటి వరకూ ఫెయిల్యూర్ అన్నదే ఎరగని దుల్కర్ సల్మాన్ లీడ్ రోల్లో నటించిన సినిమా కావడంతో భారీ అంచనాల మధ్య వచ్చింది. అయితే ప్రేక్షకుల ఆదరణ మాత్రం దక్కించుకోలేకపోయింది. దీంతో ఈ మూవీని నాలుగు వారాల్లోనే ఓటీటీలోకి తీసుకురావాలని నెట్‌ఫ్లిక్స్ భావిస్తోంది.

ఆ లెక్కన డిసెంబర్ 12న ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఓటీటీప్లే రిపోర్టు తెలిపింది. తెలుగు సహా దక్షిణాది భాషలన్నీ ఆ రోజే అందుబాటులోకి రానున్నాయి. అయితే హిందీ వెర్షన్ మాత్రం 8 వారాల తర్వాతే వస్తుంది.

కాంతా మూవీ గురించి..

హీరో, డైరెక్టర్ మధ్య వచ్చే ఇగో క్లాష్ చుట్టూ తిరిగే మూవీ కాంత. దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటి, సముద్రఖని వంటి స్టార్స్ నటించిన సినిమా ఇది. ఇందులో హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే చేసింది. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించాడు. అయ్య అనే డైరెక్టర్ పాత్రలో సముద్రఖని, టీకే మహదేవన్ అనే స్టార్ హీరో పాత్రలో దుల్కర్ సల్మాన్ నటించారు. ఈ ఇద్దరి మధ్య వచ్చే విభేదాల చుట్టూ ఈ కాంత మూవీ తిరుగుతుంది.

ఓల్డ్ సినీ యుగాన్ని చాలా మంది సినీ స్వర్ణయుగంగా పిలుచుకుంటారు. దీనిపై వచ్చిన కాంత అప్పటి యుగాన్ని కళ్లకు కట్టినట్లు చూపించింది. 1950-60 కాలంలో తెరకెక్కినట్లుగా పీరియాడిక్ డ్రామాగా కాంతను చూపించారు. సినీ పరిశ్రమలో హీరోలు, నటీనటుల క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా వచ్చే సంఘర్షణలను చాలా బాగా చూపించాడు డైరెక్టర్.

ఈ సినిమాలో దుల్కర్ నటనకు ప్రశంసలు దక్కాయి. అతనితోపాటు సముద్రఖని, రానా దగ్గుబాటి నటన కూడా మెప్పించింది. ఓవరాల్ గా సినిమాకు తమిళనాట మంచి రివ్యూలే వచ్చాయి. అయితే బాక్సాఫీస్ దగ్గర ఊహించిన వసూళ్లు మాత్రం రాలేదు. థియేటర్లలో చూడకపోయి ఉంటే ఈ కాంత సినిమాను నెట్‌ఫ్లిక్స్ లో చూడొచ్చు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More