దుల్కర్ సల్మాన్‌ను చెంపదెబ్బ కొట్టడానికి సంకోచించాను.. తొలిసారి అలా చేశాను: భాగ్యశ్రీ బోర్సే

దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే లీడ్ రోల్స్ లో నటించిన మూవీ కాంతా. ఈ మూవీకి పాజిటివ్ రివ్యూలు వచ్చినా బాక్సాఫీస్ దగ్గర మాత్రం పెద్దగా సక్సెస్ కాలేదు. అయితే ఈ మూవీలో దుల్కర్ ను చెంపదెబ్బ కొట్టడానికి తాను సంకోచించినట్లు తాజాగా భాగ్యశ్రీ చెప్పింది.

Published on: Nov 20, 2025, 19:50:15 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నటి భాగ్యశ్రీ బోర్సే 'కాంత' మూవీలో దుల్కర్ సల్మాన్‌పై చేయిచేసుకునే సీన్ గురించి మాట్లాడింది. అందులో తాను అతన్ని కొట్టడానికి సంకోచించినట్లు చెప్పింది. భాగ్యశ్రీ.. దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ తో కలిసి ఇచ్చిన ఒక కొత్త ఇంటర్వ్యూలో.. 'కాంత' సినిమాలోని ఒక సీన్ గురించి షేర్ చేసుకుంది. ఈ సీన్ లో ఆమె పాత్ర దుల్కర్ సల్మాన్ పాత్రను కొట్టవలసి వచ్చింది.

దుల్కర్ సల్మాన్‌ను చెంపదెబ్బ కొట్టడానికి సంకోచించాను.. తొలిసారి అలా చేశాను: భాగ్యశ్రీ బోర్సే
దుల్కర్ సల్మాన్‌ను చెంపదెబ్బ కొట్టడానికి సంకోచించాను.. తొలిసారి అలా చేశాను: భాగ్యశ్రీ బోర్సే

భాగ్యశ్రీ ఏమన్నదంటే?

దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ కలిసి నటించిన కాంత మూవీ నవంబర్ 14న థియేటర్లలో రిలీజైన విషయం తెలుసు కదా. ఈ సినిమాలో చేయిచేసుకునే సీన్స్ ఉన్నప్పటికీ దుల్కర్ పాత్రను కొట్టే సీన్ లో తాను సంకోచించానని భాగ్యశ్రీ తెలిపింది. "తెర వెనుక అలా చేయడానికి నేను కొంచెం వెనుకాడాను. కానీ ఆ పర్ఫెక్షన్ ను అతను (దుల్కర్) కోరుకున్నాడని నేను అనుకుంటున్నాను.

ఆ నటనను నా నుండి వెలికితీయడానికి అతను దానిని అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాడు. దానిని నేను గౌరవిస్తాను. కానీ నేను నిజంగా సంకోచించాను. నేను నా జీవితంలో అలా చేయడం ఇదే మొదటిసారి" అని భాగ్యశ్రీ చెప్పింది. ఈ సీన్ తర్వాత దుల్కర్ ముఖం ఎర్రబడింది అని దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ తెలిపాడు.

కాంత మూవీ ఎలా ఉందంటే?

సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన మూవీ కాంత. ఇందులో టీకే మహదేవన్ పాత్రలో దుల్కర్ నటించాడు. ఇక సముద్రఖని అతని గురువు, డైరెక్టర్ అయ్య పాత్రలో కనిపించాడు. భాగ్యశ్రీ ఓ యువ నటి పాత్ర పోషించింది.

సినిమా షూటింగ్ టైమ్‌లో నటీనటులు, టెక్నిషియన్స్, క్రియేటర్స్ మధ్య వచ్చే మనస్పర్థలు, గొడవలు ఆసక్తి కలిగిస్తుంటాయి. వీటిని మూవీ కంటే ఇంట్రెస్టింగ్‌గా చూస్తారు ఆడియెన్స్. అలా డైరెక్టర్, హీరో మధ్య ఉండే అహం, ఇగో క్లాష్ కాన్సెప్ట్‌తో వచ్చిన సినిమానే కాంత.

సినీ పరిశ్రమలో హీరోలు, నటీనటుల క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా వచ్చే సంఘర్షణలను చాలా బాగా చూపించారు డైరెక్టర్. ఇద్దరు గొప్ప వ్యక్తుల అహాన్ని చాలా నాటకీయంగా ఫస్టాఫ్ అంతా చూపించారు. ఒకరిపై మరొకరు పైచేయి సాధించాలనుకునే ఇగోతో ఎక్కడి వరకు వెళ్లారు అనేది ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది.

సినిమాలో గురు, శిష్యుల మధ్య బంధం, గొడవ, సంఘర్షణ, వారిని కలిపేందుకు హీరోయిన్ ట్రై చేయడం వంటి సీన్స్ ఆకట్టుకుంటాయి. స్వర్ణయుగపు సినిమా గొప్పతనాన్ని చెప్పే సీన్స్ బాగుంటాయి.

ఇందులో రానా కూడా ఓ స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ పోలీస్ పాత్ర పోషించాడు. ఈ సినిమాకు రిలీజ్ రోజు నుంచే పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. అయితే బాక్సాఫీస్ దగ్గర మాత్రం పెద్దగా వసూళ్లు సాధించలేకపోతోంది. తొలి వారంలో సుమారు రూ.20 కోట్ల వరకూ వసూలు చేసింది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More